క‌ర్ణ‌క‌ఠోర కంగువ‌

“కంగువ‌”కి కొంచెం భ‌యం గానే వెళ్లాల్సి వ‌చ్చింది. “ఎక్క‌డో కొడుతోంది శీనా” అని మ‌న‌సు చెబుతూనే వుంది. కానీ వినం క‌దా. సినిమా స్టార్ట్ కాగానే ఒక గుడ్డి ముస‌ల‌మ్మ చంద్రుని చూపిస్తూ ఏదో…

“కంగువ‌”కి కొంచెం భ‌యం గానే వెళ్లాల్సి వ‌చ్చింది. “ఎక్క‌డో కొడుతోంది శీనా” అని మ‌న‌సు చెబుతూనే వుంది. కానీ వినం క‌దా. సినిమా స్టార్ట్ కాగానే ఒక గుడ్డి ముస‌ల‌మ్మ చంద్రుని చూపిస్తూ ఏదో చెప్పింది (కాలం 1070). అర్థం కాలేదు. ఇంత‌లో 2024లోకి ఎంట‌రైంది. ఒక ప్ర‌యోగశాల నుంచి పిల్ల‌వాడు త‌ప్పించుకున్నాడు.

గోవాలో సూర్య‌మీద ఓపెన్ అయింది. యోగిబాబు, హీరో ఏదో గ‌ట్టిగా అరుస్తూ మాట్లాడుకున్నారు. దిశాప‌టాని ఇంకో క‌మెడియ‌న్‌తో సీన్‌లోకి వ‌చ్చింది. అంద‌రూ అరుస్తున్నారు. ఓ 20 నిమిషాలు ఇదేం టార్చ‌ర్‌రా అనుకుంటూ వుండ‌గా మ‌ళ్లీ 1000 ఏళ్లు వెన‌క్కి వెళ్లింది. ఒక‌డు పెద్ద వాయిస్ ఓవ‌ర్‌తో మ్యాప్‌లో పంచ‌కోన‌ల గురించి వివ‌రించాడు. మ‌నం ఎపుడూ చూడ‌ని, విన‌ని ప్ర‌పంచంలోకి తీసుకెళితేనే క‌దా పాన్ ఇండియా అంటారు. అన్ని భాష‌ల వాళ్ల‌కి సుల‌భంగా అర్థం కావాలంటే అనాగ‌రిక జాతుల్లోకి క‌థ‌ని తీసుకెళ్లాలి.

ఒక‌డెవ‌డో వేరే ప‌ని లేన‌ట్టు పెద్ద ప‌డ‌వేసుకుని రోమ్ నుంచి వ‌చ్చాడు. ఈ ఐదు కోన‌ల్ని స్వాధీనం చేసుకుంటే భార‌త‌దేశాన్ని ఆక్ర‌మించుకుంటాడ‌ట‌. ఐదు కోన‌లంటే దేవ‌ర‌లోని ఐదు ఊళ్లు గుర్తుకొచ్చాయి. ఎన్టీఆర్ అతి సీరియ‌స్‌గా స్మ‌గ్లింగ్ చేస్తూ, డైలాగ్‌లు చెబుతూ, గ్యాప్‌లో స‌క్‌స‌క్‌మ‌ని అంద‌ర్నీ న‌రుకుతుంటాడు. సంగీతం కంటే స‌క్‌స‌క్ సౌండే ఎక్కువుంది.

దేవ‌ర‌ని ఇంకా మ‌రిచిపోక‌ముందే కంగువా వ‌చ్చాడు. బ‌ర్బ‌ర జాతుల మ‌ధ్య క‌థ ప్రారంభ‌మైంది. ఇక యాక్ష‌నే యాక్ష‌న్ అనుకున్నా. ఎండిపోయిన జుత్తు, ఒక గాజు క‌న్ను, ఉత‌క‌డం అసాధ్య‌మైన షోలాపురం దుప్ప‌టిలాంటి బ‌ట్ట‌లు క‌ట్టుకున్న వంద‌లాది మంది అర‌వ‌డం స్టార్ట్ చేశారు. అర‌వ‌డం ఆపిన మ‌రు క్ష‌ణం ఒక ముస‌లాయ‌న డైలాగ్ చెప్పాడు. తెలుగులా వుంది కానీ, అర్థం కావ‌డం లేదు. ప‌ద్యం పాడిన‌ట్టు, న‌క్క ఊల వేసిన‌ట్టు మాట్లాడుతున్నాడు. మ‌ళ్లీ కోర‌స్‌లా అరుపులు. అప్ప‌టి వ‌ర‌కు అవ‌కాశం కోసం పొంచి వున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్ 113 ర‌కాల విచిత్ర వాయిద్యాలతో స్పీక‌ర్ల మీద దాడి చేశాడు. ఆ శ‌బ్దానికి చెవుల్లో ఉన్న తుప్పుగిప్పు , గుబిలిగిబిలి ఎగిరిపోయి రెండు చెవుల మ‌ధ్య ఒక ర‌క‌మైన శూన్యం ఏర్ప‌డింది.

క‌నీసం సూర్య వ‌స్తే అయినా కుదురుకుంటుందేమో అని ఆశించా. అప్ప‌టికే నా స‌హ‌చ‌ర ప్రేక్ష‌కులు కొంద‌రు సీట్ల మీద స్పృహ త‌ప్పి, మ‌రి కొంద‌రు ఫిట్స్ రాకుండా బైక్ తాళాలు అర‌చేతిలో అదిమి పెట్టుకు కూచున్నారు.

సూర్య కూడా రావ‌డం రావ‌డ‌మే గ‌ట్టిగా అరుస్తూ, స‌క్‌స‌క్ సౌండ్స్‌తో, విచిత్ర ఆయుధాల‌తో దాడికి పూనుకున్నాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ త‌న సంగీత బృందానికి చేసిన సైగ‌తో వాళ్లు కూడా చైత‌న్య‌వంతులై ఢ‌మ‌రుకం, మృదంగం, త‌బ‌లా, డ్ర‌మ్స్ చేతికి ఏది దొరికితే అది వాయించ‌సాగారు. యుద్ధం త‌ర్వాత యుద్ధం. అరుపులు త‌ర్వాత అరుపులు. సుదీర్ఘ బాదుడు త‌ర్వాత ఉప‌శ‌మ‌నం కోసం ఇంట‌ర్వెల్ ఇచ్చారు.

తెలివైన వాళ్లు థియేట‌ర్ గోడ‌లు దూకి పారిపోయారు. మెట్లు దిగే ఓపిక లేనివాళ్లు డ్రైనేజీ పైపుల సాయంతో జ‌ర్రున జారుతూ దూకేశారు. సినిమాని స‌మీక్షిస్తాన‌ని ఒక పెద్దాయ‌న‌కి ఇచ్చిన మాట వ‌ల్ల‌, ఉరిశిక్ష ప‌డిన ఖైదీలా లోపలికెళ్లాను.

పొగ తాగినా, మ‌ద్యం సేవించినా, ఈ సినిమా చూసినా పోతారు అని వినిపించి, ఇలా జ‌రుగుతుంద‌ని అనుకోలేదు. జీవితం మునుప‌టిలా ఇంకెన్న‌డూ ఉండ‌దు అని తెర‌మీద మ‌స‌గ్గా క‌నిపిస్తూ వుండ‌గా, మ‌ళ్లీ ఆట‌, వేట మొద‌లైంది. బాబీడియోల్ త‌న సైన్యంతో వ‌చ్చి క‌స‌క్‌క‌స‌క్ అని సౌండ్ ఇచ్చాడు. సూర్య ఇక లాభం లేద‌నుకుని గ్రాఫిక్స్‌లో ఒక పెద్ద మొస‌లిని ఎత్తి ప‌డేశాడు.

ఆ కుర్ర‌వాడు కంగువా అని అరుస్తూ వుండ‌గా, సూర్య “పులోమా” అని రీసౌండ్ చేస్తూ వుండ‌గా, ప్రేక్ష‌కుడు దేవుడా అని అరిచాడు. మ‌న‌ల్ని గ‌త కాలం నుంచి విముక్తి చేస్తూ క‌థ మ‌ళ్లీ గోవాకి వ‌చ్చింది.

ఇచ్చిన షాక్ చాల్లేద‌ని ఈ సారి సూర్య ఏకంగా ఒక విమానానికే వేలాడాడు. మెషిన్‌గ‌న్ బుల్లెట్‌కి, బుల్లెట్‌కి మ‌ధ్య గ్యాప్‌లో త‌ప్పించుకుంటూ ఎట్ట‌కేల‌కి పిల్ల‌వాన్ని కాపాడాడు.

చివ‌ర్లో ఒక ట్విస్ట్‌. క‌ష్టాలు క‌ల‌కాలం వుండ‌వు అనే ధ‌ర్మ సూత్రాన్ని అనుస‌రించి ఈ సినిమా కూడా అయిపోయింది. చ‌చ్చిన పాముని మ‌రింత చంప‌డానికి ఈ సినిమా పార్ట్‌-2 కూడా వుంద‌ని ద‌ర్శ‌కుడు శివ ఒక స్లైడ్ వేశాడు. దాంతో కోపోద్రిక్తులైన కొంద‌రు చెన్నైకి వెళ్లి శివ‌ని వెత‌క‌డానికి థియేట‌ర్‌లోనే శ‌ప‌థం చేశారు.

అప‌స్మార‌క స్థితిలో గ‌చ్చిబౌలి నుంచి ఇమ్లిబ‌న్ లేదా ఇంజ‌న్‌బౌళికి వెళ్ల‌కుండా నేను మ‌ణికొండ‌కే వెళ్లి, నా ఇంట్లోనే నిద్ర‌పోవ‌డం నా పూర్వ జ‌న్మ అదృష్టం.

రాజ‌పుత్ర ర‌హ‌స్యంలో ఎన్టీఆర్ టార్జాన్‌లా కేక పెడితే త‌ట్టుకున్నాను. చిలిపి కృష్ణుడులో ఏఎన్ఆర్ పుస్త‌కాలు ప‌ట్టుకుని కాలేజీకి వెళ్లినా నా ధైర్యం చెక్కు చెద‌ర‌లేదు. తుపాకి లోడ్ చేయ‌కుండా కృష్ణ 32 సార్లు కాల్చ‌డంతో పాటు పొగ కూడా ఊదినా భ‌య‌ప‌డ‌లేదు. శోభ‌న్‌బాబు డ్యాన్స్ చేసినా, కృష్ణంరాజు “క‌త్తి అందుకో జాన‌కి నాయాల్దీ” అని అరిచినా త‌ట్టుకుని నిల‌బ‌డిన సాహ‌స ప్రేక్ష‌కుడిని నేను.

అయితే కంగువా న‌న్ను క‌కావిక‌లం చేసింది. ఎమ్జీఆర్‌, శివాజీగ‌ణేష‌న్ డ‌బ్బింగ్ హార‌ర్ సినిమాల్ని కూడా నేల మీద సిగ‌రెట్ పొగ‌ల మ‌ధ్య చూసిన న‌న్నే జ‌డిపించిందంటే కంగువా మామూలు కంగువా కాదు.

అరిచే సినిమాలు, అర‌వం సినిమాలు ఇంకెప్పుడూ చూడ‌ను జ్ఞానవేల్ రాజా. జ్ఞాన‌నేత్రం తెరిపించావు.

జీఆర్ మ‌హ‌ర్షి

33 Replies to “క‌ర్ణ‌క‌ఠోర కంగువ‌”

  1. Writing is spot on. LOL, Evi Emi cinemalu ? Tamil audiences & big anti hero fans (Rajini, Ajith and Vijay Fans) are trolling the movie on social media. By seeing those trolls and in an attempt to counter those trolls, Kanguva producers have asked Rajini to release a video byte stating that he has missed doing this great film, just so that neutral audience would get some positive feeling about it. Irony is, in that video also, Rajini is control his laughter when he said he greatly missed doing this film, that’s means he also knows that this is super Mental film. Despite that, they just tried to fool the audience with Rajinikanth’s video byte.

  2. ఎప్పుడో ఆల్ ద బెస్ట్ ,ఆపరేషన్ దుర్యోధన -2 కి చదివాను ఇలాంటి రివ్యూ 😂😂😂😂😂😂

  3. ప్రేక్షకులు శివని వెతకటం ఏమో కానీ, శివ మిమ్మలిని వెతుక్కుంటూ వస్తాడు జాగ్రత్త

  4. అరవ సినిమా అనే పేరు సార్ధకం చేసాడు , ఇంక నుంచి అరవ సినిమా అంటే అరుపులే(చూసే ప్రేక్షకుల ఆర్తనాదాలు)

  5. Orey lanjodaka… Oka maddakey puttava…ilanti fake rathalu raasi vachina money tho ne family posinchukondhamanikonnava…

    Thappudu lanjakodaka…movie bhaganey vundhi… Ne ammani movie ki teesukelli chupinchi…ne review me ammaku cheppu…appudemaniddho cheppu…

    1. కృష్ణ, కృష్ణంరాజు అండ్ శోభన్ బాబు have done 10s of boring films which they might had not dare to watch even for a singr time ..

      1. vallu low budget lo cinema thappa vere entertainment ledu ane rojullo chesaru.. Industry ni bathikincharu…bagunte chusevallu. lekapothe ledu.. producer ki paisalu vachevi…Ippudu katha veru naayana.. Cinema theesi andarni including Industry ni kooda champesthunnaru..

      2. అప్పట్లో ఏడాది లో పదుల కొద్దీ సినిమాలు నటించేవాళ్ళు కనుక బోరింగ్ సినిమా లు ఉండడం లో ఆశ్చర్యం లేదు, ఇప్పుడు ఏడాది కి ఒకటైనా చేస్తున్నారా?

  6. సినిమా ఎలా ఉందిరా అంటే గోడలకేసి , పైపులకేసి చూస్తావేమిటిరా ఊడల జుట్టు “కంగువ” అనేవారు మన జంధ్యాల బ్రతికిఉంటే ఒక్కమాటలో

  7. Next time వేరే సినిమాలు సమీక్ష చేస్తా అని వెళ్లకండి sir ముసలి గుండె ఆగిపోగలదు.. పైగా వస్తుంది గేమ్ చేంజర్

  8. రేయ్ ముసలోడు మూసుకొని ఇంట్లో కుర్చోరా నీకేందుకురా సినిమాలు వాటి రివ్యూలు

  9. దయచేసి తెలిసి తెలియక మీ సొంత అభిప్రాయంతో రివ్యూలు ఇవ్వకండి ఎందుకంటే సినిమా అనేది ఎంతోమంది కష్టం ఎంతోమందికి ఒక ఉద్యోగం ఇందులో మహేష్ పాయింట్లు ఉన్నాయి మరియు ప్లస్ పాయింట్లు ఉన్నాయి కానీ మీరు ఒక్క మైనస్ పాయింట్ల గురించి మాత్రమే చెప్పు అది కూడా హేళనగా చాలా బాధాకరంగా ఒక గొప్ప నటుడు గురించి మీరు ఆ విధంగా మాట్లాడటం ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ గురించి మీరు ఆ విధంగా చెప్పడం నిజానికి చాలా బాధనిపిస్తుంది ఈ సినిమా చాలా బాగుంది ఇందులో ఎమోషన్ చాలా ఎక్సలెంట్ సూర్య గారు పండించారు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకానొక టైంలో మాత్రం చాలా చాలా బాగుంది కొన్ని సీన్లలో అయితే హార్ట్ కి అవుతుంది అక్కడక్కడ కన్నీళ్లు కూడా వస్తాయని అయితే చెప్పొచ్చు దయచేసి రివ్యూలు చూసి సినిమాలోకి వెళ్ళకండి సినిమాకి వెళ్ళిన తర్వాతనే రివ్యూ ఇవ్వండి

  10. ఏరా నువు చూసింది చెప్పావా లేక విన్నది చెప్పావా?

    రివ్యూ రాయడమంటే తెలుగు రాయడం వచ్చినంత ఈజీ అనుకున్నావా ? లేక ఒక తమిళ్ వాడి సినిమా విజయవంతం అవకూడదని ఈ నెగెటివ్ రివ్యూ రాసావా ?

    అసలు నీకున్న అర్హత ఎంటి ? విమర్శించడానికి. నచ్చకపోతే నచ్చలేదు. డైరెక్టర్ బాగా తీయాలేదు ఇలా చెప్పు అంతేకాని ఇలా అడ్డగోలుగా రాసి సాధించిన డబ్బులతో తిండి తింటే అది అరగదు బిడ్డా జాగ్రత్త

Comments are closed.