ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా చానల్స్ నడిపేవారి విషయంలో కొత్త చట్టాలు తీసుకురావాలని చెప్పారు. అదేమంత కష్టమైన పని కానే కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి చట్టసభలో ఉన్న మెజారిటీతో ఎన్ని చట్టాలైనా చేసుకోవచ్చు. అడ్డుపడే వాడు, అడిగేవాడు లేనే లేడు. అయితే ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలసిన విషయం ఒకటుంది. “చట్టాలు సరే..అమలు ఎలా?” అని!
మనకి ఎన్నో చట్టాలున్నాయి. దిశా చట్టమని ఒకటి చేసుకున్నాం. దాని అమలు ఎలా ఉంది?
అలాగే సుప్రసిద్ధమైన 498ఎ అనబడే గృహహింస చట్టం ఏ రేంజులో మిస్-యూజ్ అవుతోందో తెలుసు. కొన్ని కేసుల్లో స్వయంగా న్యాయమూర్తులే ఆ చట్టంలో సవరణలు, మార్పులు అవసరమని పేర్కొన్నారు. మిస్ యూజ్ అవుతున్న విషయాన్ని వారే చెప్పారు.
అలాగే ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం. నిజమైన కేసులతో పాటూ మిస్ యూజ్ చేయబడిన, బడుతున్న కేసులు కూడా అనేకం. ఏ వ్యక్తిగత సమస్యో తీరకపోతే అన్యాయంగా ఈ కేసు బనాయించడం, లేదా ఈ కేసు పెడతామని బ్లాక్ మెయిల్ చేసి ప్రత్యర్థిని లొంగదీసుకునే ప్రయత్నాలు చేయడం.. దేశవ్యాప్తంగా అనేకం వెలుగు చూసాయి.
వీటితో పాటూ స్త్రీలకి సంబంధించిన చట్టాలు. ఇవి కూడా పలు సందర్భాల్లో మిస్ యూజ్ అవుతున్నాయి.
ఇక 61ఎ ఐటీ యాక్ట్. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఎన్ని అరెస్టులు జరిగాయో లెక్కించడం కష్టం. సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఇది దారుణంగా మిస్ యూజ్ అవుతోందని చెప్తే తప్ప కొన్ని సవరణలు జరగలేదు.
ఇక్కడ చెప్పేదేంటంటే, చట్టాలు ఎన్ని చేసుకున్నా వాటిని అనుకున్నట్టుగా అమలు పరచలేకపోవడమో, అమలుపరిచినా అవి భయంకరంగా మిస్ యూజ్ అవడమో జరుగుతోంది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పేర్కొన్న సోషల్ మీడియా విషయానికొద్దాం. ఆయన ఎంతో విప్లవాత్మకంగా సోషల్ మీడియా చట్టాల గురించి మాట్లాడారు కానీ, కాస్త ఆలోచించి ఉంటే ఆయన నుంచి ఇంకాస్త బెటర్ ఆలోచన వచ్చేదేమో అనిపిస్తుంది. అదేమిటో చెప్పుకుందాం.
వ్యాధికి ఉపశమనం కోసం మందేయడం ఒకటి- అదే వ్యాధికి మూలకారణమేంటో తెలుసుకుని నిర్మూలించడం ఒకటి- అసలా వ్యాధి రాకుండా నివారించే ఆరోగ్య పద్ధతులు పాటించడం, వ్యాక్సీన్లు తీసుకోవడం మరొకటి. ఈ మూడూ వైద్యశాస్త్రంలో ఉన్నట్టే, న్యాయశాస్త్రంలో కూడా ఉంటాయి.
యూట్యూబ్, ఫేస్ బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్- ఈ నాలుగూ పాపులర్ సోషల్ మీడియా వేదికలు. జనాభాలో ఉన్న ప్రతి ఒక్కరూ వీటిల్లో ఏదో ఒక ప్లాట్ఫాం మీద ఉంటున్నారు. తమ భావ ప్రకటనా స్వేచ్ఛని వారి సంస్కారానికి తగిన రీతిలో వ్యక్తపరుస్తున్నారు.
అయితే చాలాసార్లు అవి ఉద్రేకాలకి, గొడవలకి, అశాంతికి తావు ఇస్తుంటాయి. అవి కులమతాలకి చెందిన పోస్టులు కావొచ్చు, రాజకీయాంశాలు కావొచ్చు, ఇల్లీగల్ ఎఫైర్స్ కి సంబంధించిన అశ్లీల విషయాలు అవ్వొచ్చు.. ఇంకేమైనా కావొచ్చు. పోస్ట్ ఏదైనా పైన పేర్కొన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి కమ్యూనిటీ గైడ్ లైన్స్ కొన్ని ఉంటాయి. వాటికి లోబడి లేకపోతే వెంటనే వీడియో లేదా పోస్టుని డిలీట్ చేయమంటూ అలర్ట్ వస్తుంటుంది.
అదేంటో గానీ ఈ అలర్ట్లు, వార్ణింగులు అనామకులైన సోషల్ మీడియా చానల్స్ వారికి చిన్న చిన్న విషయాల మీద వస్తుంటాయి. కానీ పాపులర్ టీవీ చానల్స్ కూడా తమ యూట్యూబ్ చానల్లో జుగుప్సాకరమైన హెడింగుతో థంబ్ నెయిల్ పెట్టినా ఏం కాదు. అది అలాగే ఉంటుంది. బాధిత వర్గాన్ని రెచ్చకొడుతూ ఉంటుంది. పర్యవసానంగా అటువర్గం నుంచి అలాంటి థంబ్ నెయిల్స్ తో పది వీడియోలొస్తాయి. దానికి సమాధానంగా ఇటునుంచి ఒక యాభై థం నెయిల్స్ బయలుదేరతాయి. సోషల్ మీడియా మొత్తం ఆ టాపిక్ మీద అల్లకల్లోలంగా ఉంటుంది. అశాంతి రాజ్యమేలుతూ ఉంటుంది. ఈ మంటల్లో చలికాచుకునేది విదేశాలకి చెందిన ఆయా సోషల్ మీడియా ప్లాట్ ఫాంస్ మాత్రమే. వాటికి కావాల్సింది ప్రజాదరణ, వ్యూవ్స్. కనుక అలాంటి వాతావరణాన్ని సైలెంటుగా గమనిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటాయి ఆ ప్లాట్ఫామ్స్. పెద్దగా సమస్య లేని, ఎవడూ పట్టించుకోని పోస్టుల విషయంలో మాత్రం ఏదో కమ్యూనిటీ నార్మ్ అని చెప్పి స్ట్రైకులు కొడుతుంటాయి అప్పుడప్పుడు..తమకి ఆ వ్యవస్థ ఉందని చెప్పడానికన్నట్టుగా!
కనుక చట్టాలు చేయాలంటే ఎవరి మీద చేయాలి? కేవలం మనదేశ పౌరుల్ని ఇబ్బంది పెట్టేవిధంగా కాదు. ఏ ఇబ్బందికరమైన పోస్ట్ వచ్చినా దానిని డౌన్ చేసి, చానల్స్ పై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అన్ని విదేశీ సోషల్ మీడియా చానల్స్ కి అప్పజెప్పాలి. ఆ లీగాలిటీకి లోబడి ఉంటేనే ఇండియాలో వాటి మనుగడ అని చెప్పాలి.
140 కోట్ల మంది జనాభా ఉన్న దేశానికి ఆ ప్లాట్ ఫాంస్ ని అదుపులో పెట్టడం కష్టం కానే కాదు. ప్రపంచంలో 36% జనాభా చైనా, ఇండియాల్లోనే ఉంది. చైనాలో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్ లు అసలు పనిచేయవు. అక్కడి ప్రభుతం “గ్రేట్ ఫైర్వాల్” పెట్టుకుని మీడియాని పూర్తిగా నియంత్రిస్తుంది. కనుక ఆ ప్లాట్ ఫాంస్ కి దిక్కల్లా ఇండియానే. మనం “గ్రేట్ ఫైర్వాల్” పెట్టక్కర్లేదు కానీ సెన్సార్ మాత్రం చేసుకోమని చెప్పాలి ఆ ప్లాట్ ఫాంస్ కి. అది ఆల్రెడీ అమెరికాలో జరుగుతోంది. ట్రంప్ మీద ఏ మార్ఫింగ్ వీడియోనో పెడితే క్షణాల్లో అది బ్లాక్ అవుతుంది. అదే నరేంద్ర మోదీ మీద వస్తే దిక్కులేదు.
నిజానికి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ రోజుల్లో ఫలానా ఫోటో లేదా వీడియో మార్ఫింగ్ అవునో కాదో చెప్పే విధానాలు సామాన్యులకి కూడా అందుబాటులో ఉన్నాయి. అలాంటిది యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి వ్యవస్థలకి ఎంతసేపు పట్టుకోవడం? కనుక ఆ ప్లాట్ఫాం అధినేతలే బాధ్యత వహించాలి.
ఉదాహరణకి చంద్రబాబు నాయుడు మీదనో, జగన్ మోహన్ రెడ్డి మీదనో, పవన్ కళ్యాణ్ మీదనో ఏ సోషల్ మీడియా పోస్టో అసభకరంగా వస్తే ప్లాట్ ఫాం ఇండియా-హెడ్ లేదా రీజినల్ హెడ్ మీద కేస్ పెట్టి ప్రాసిక్యూట్ చేయించగలిగే చట్టం తేవాలి. ఎందుకంటే లోకల్ గా ఉండి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్లని అరెస్ట్ చేయగల్గుతున్నారు కానీ ఏ అమెరికాలోనో, దుబాయిలోనో కూర్చుని ఆంధ్ర రాజకీయనాయకులపై అసభంగా పోస్టులు, వీడియోలు పెడుతున్న వారిని ఏం చేయగలగుతున్నారు? అందుకే ఆ ప్లాట్ ఫాం హెడ్స్ మీదనే చట్టాలు రావాలి. పవన్ కళ్యాణ్ ఈ దిశగా ఆలోచించి ఏమైనా చేయగలిగితే దేశం మరిచిపోలేని గొప్ప నాయకుడవుతాడు. ఇప్పుడు ప్రజల, నాయకుల మనశ్శాంతి సోషల్ మీడియాతో మిళితమై ఉంది. కనుక ఆ సోషల్ మీడియా ప్లాట్ ఫాం హెడ్స్ ని లయబుల్ చేయాలి.
ఇదొక కథైతే, సంబంధం లేని పోలీస్ స్టేషన్స్ లో కేసులు పెట్టి హరాస్ చేయడం. ఒక ప్రాంతంలో ఏ నేరమో జరిగితే ఆ ప్రాంత పోలీస్ స్టేషన్లో కేసు నమోదవుతుంది, విచారణ మొదలవుతుంది. కానీ సోషల్ మీడియా కేసులు అలా కాదు. దేశంలో ఎక్కడైనా పెట్టేయొచ్చు. అయినా ఒక చోట కాదు…ఏ స్టేషన్లో పడితే ఆ స్టేషన్లో కేసు. ఒకే పాయింట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా 10-15 కేసులు. ఇది హరాస్ మెంట్ కాదా? చట్టాన్ని మిస్ యూజ్ చేయడం కాదా! ఇందులో సవరణ పవన్ కళ్యాణ్ గారు కోరరా?
అభిమానం పేరుతో ఉండే కొన్ని వర్గాలు ప్రతిదీ పైవాళ్లకి చెప్పి చేయరు. వాళ్ల ఇంగితానికి తగ్గట్టుగా, సంస్కారానికి తగినట్టుగా మాట్లాడతారు, పోస్టులు పెడతారు. అవన్నీ జగనో, చంద్రబాబో, లోకేషో, పవన్ కళ్యాణో స్వయంగా చెప్పి చేయిస్తున్నారనుకోవడం సరికాదు. ఒకవేళ అదే నిజమని నమ్మితే తగిన ఆధారాలు చూపిస్తే జనం కూడా వాళ్లు తిప్పికొట్టడానికి చేసే చర్యలని ఆమోదిస్తారు. అంటే లీగల్ గా అయినా కాకపోయినా, సోషల్ గా సపోర్ట్ వచ్చే అవకాశముంటుంది. ఎవరో అనామకులు తమ ఇంట్లో వాళ్లని ఏదో అన్నారని కలత చెంది, నాయకులని వారి భార్యలని పబ్లిక్ గా అనేయడం అనర్ధాలకి దారి తీస్తుంది. ఇటువంటి అనర్ధాలు జరగకుండా ఆదిలోనే నియంత్రణ ఉండాలన్నది ఇక్కడ చెబుతున్నది. అది చట్టంతోనే సాధ్యం. ప్లాట్ ఫాం హెడ్లని బాధ్యులని చేయడమే మార్గం.
కొత్త చట్టాలు చేయడం కంటే ముందు ఉన్న చట్టాల్లో లొసుగులు ఏవిటి? వాటిని సరిచేయడం ఎలా? దీనిపై చట్టసభల్లో చర్చలు జరగాలి. తర్వాత కొత్త చట్టాలు చేసే విషయంలో శిక్షలకంటే నియంత్రణ మీద దృష్టి పెట్టాలి. సోషల్ మీడియా ప్లాట్ ఫాంస్ కి మార్గనిర్దేశకాలు పెట్టాలి.
నచ్చని వాళ్ల మీద హరాస్మెంట్ కేసులు పెట్టుకుంటూ.. అదే మీడియాలో చెప్పుకుంటూ ఉంటే ఆ రాష్ట్రం ఇమేజ్ ఎలా ఉంటుంది? ఇలాంటి వ్యవస్థలు, పోలీసులు, నాయకులు, వాళ్ల గ్యాంగులు ఉన్న చోట పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో తెలీదు కనుక పెట్టుబడులెందుకులే అని అమరావతికి దూరంగా జరగరా?
శాంతిని, సౌహార్ద్రాన్ని, పౌరులపై బాధ్యతని నమ్ముకుని శాంతిభద్రతలపై దృష్టిసారిస్తే ఏ ప్రభుత్వమైనా మనుగడ సాధిస్తుంది. ఆ రాష్ట్రం క్రమంగా ఎదుగుతుంది. తమ పౌరుల ఎమోషన్స్ తో ఆడుకునే సోషల్ మీడియా ప్లాట్ ఫాంస్ పై దృష్టి పెట్టాలి కానీ పౌరుల మీద కాదు. విదేశాలకి చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫాంస్ “డివైడ్ అండ్ రూల్” పాలసీతో దేశపౌరుల్ని విడదీసి ఎలా సంపాదించుకుంటున్నాయో చూస్తున్నాం. వాటి మీద నియంత్రణ చట్టం చేయొద్దా?
ఒకవేళ అలాంటి నియంత్రణ సాధ్యపడదు..అ ది “భావ స్వేచ్చ”కి విరుద్ధం అనుకుంటే.. మరి ఇంక చట్టాలు, అరెస్టులు చేసే పనే పెట్టుకోకూడదు. దేశం, ప్రజలు ఎటు పోయినా “జై భావ స్వేచ్ఛ” అని చూస్తూకూర్చోవడమే.
– శ్రీనివాసమూర్తి
that’s not harassment, harassment అనేది మనషులు context లో వాడే పదం, ja*** గాడి “సైతాన్ కా ఫౌజీ” కి వర్తించదు!!
సోషల్ మీడియా కాకుండా…. ఇంటర్నెట్ నే బ్యాన్ చేస్తే …అసలు గొడవే ఉండదు కదా
Good suggestion G.A.
vc available 9380537747
vc estanu 9380537747
దిశా చట్టం లేదు.కేంద్ర హోమ్ శాఖ అడిగిన వాటికి ఇంతవరకు సమాధానమే ఇవ్వలేదు.
ఈ ప్లాట్ఫారం ల నుండి కమ్యూనిటీ నిబంధనమేర చర్య అంటూ అక్కౌంట్ మీద బురద.అంతా వాళ్ళ చేతకానితనమే….భహిరంగారహాస్యం..ఎందుకంటే వాళ్ళు డెవలప్ అయ్యింది అంటీ అతి జుగుప్సాఅక్రమయిన పోస్టులని పట్టించుకోకుండా వదిలేయడం వలనే వ్యూవర్స్ పెరిగి వీటికి లాభాలు వస్తున్నాయి…పైగా వాళ్లంతా కుమ్ముక్కే అనిపిస్తుంది చాలాసార్లు..
Call boy works 9989793850
Call boy jobs available 9989793850
ఎగస్పార్టీ ట్రోలింగ్ ఆర్మీ పుణ్యమా యని తన ఫీలింగ్స్ ను యధాతధంగా చెప్పుకున్న ఒక అమాయకురాలు ఆత్మహత్య చేసుకుంది గత ప్రభుత్వ హయాంలో
Bahubharya Chatham teraa pavalaa saripothundi
ఎంత అన్యాయం.. ?
కర్ణాటక గవర్నమెంట్ కి 500 పీజీ మెడికల్ సీట్స్ ని allocate చేసింది సెంట్రల్ గవర్నమెంట్
ఆంధ్ర లో allot చేసిన 50 మెడికల్ సీట్స్ ని కూడా మాకు వద్దు అని ఆ మెడికల్ కాలేజీ ఓపెనింగ్ ని ఆపేసారు..
ఇప్పుడు దాంతో పాటు మిగతా మెడికల్ colleges కలిపి ప్రైవేట్ కి అప్పచెప్పే పని లో ఉన్నారు.. టీడీపీ గవర్నమెంట్
ఎంతన్యాయం.. .? ఎంత ఘోరం.. ? ఎవరిది గొప్ప అడ్మినిస్ట్రేషన్.. ?
బద్దలైన అబద్దం..
===========
ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత కూడా గత ప్రభుత్వం 14 లక్షల కోట్లు అని ఊరూ వాడా అబద్దాలు ప్రచారం చేశారు.. చంద్రబాబు, పవన్, ఇంకా మిగతా..
==========
ఇప్పుడు అసెంబ్లీ లో రాష్ట్ర మొత్తం అప్పు 6 .5 లక్షల కోట్లు అని అనౌన్స్ చేశారు. మరి ఇన్నాళ్లు చెప్పిన 14 లక్షల కోట్లు అని ఊరూ వాడా చెప్పిన ప్రచారం అబద్దం…
అలా చెప్పి జనాల్ని ఎధవల్ని చేశారు..
===========
బద్దలైన ఇంకో అబద్దం ..
బద్దలైనమరోఅబద్దం..
================
వాలంటీర్స్ 34 వేలమందిని కిడ్నప్చేసిఅమ్మేశారుఅనిస్వయానాడీసీఎంచెప్పారు..
ఇప్పుడు అసెంబ్లీ లోగతఅయిదేళ్లలోకేవలం 34 మందిమాత్రమేఆక్రమరవాణాకుగురిఅయ్యారుఅనికూటమిప్రభుత్వంచెప్పింది
================
జనాలని ఎన్ని విధాలాగాఅబ్బద్దలతోమోసంచెయ్యొచ్చుఅన్నీచేశారు.