ప‌గ సాధిస్తా

ప్రేక్ష‌కుడి తాట తీయాలంటే ఈ డోస్ చాల‌దు. వెళ్లి ఇంకో ఆరునెల‌లు క‌థ మీద కూచో. పైల్స్ వ‌చ్చినా లేవ‌కు

ప్రేక్ష‌కుల‌పై ప‌గ ప‌ట్టిన నిర్మాత దివాళ‌య్య ద‌గ్గ‌రికి ద‌ర్శ‌కుడు క‌త్తి మొన వ‌చ్చాడు. అస‌లు పేరు అత‌నికీ తెలియ‌దు. తాను క‌త్తిలాంటి వాడ‌ని, ఈ పేరు త‌గిలించుకున్నాడు. ప్రేక్ష‌కుల‌కి ఇంకా గాటు ప‌డ‌లేదు.

త‌న సినిమాల్ని ప్లాప్ చేసిన ప్రేక్ష‌కుల అంతం చూడ‌డ‌మే దివాళ‌య్య పంతం. బ్ర‌హ్మాస్త్రం లాంటి క‌థ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయుధాన్ని వెతుక్కుంటూ యుద్ధం రానే వ‌చ్చింది.

“ఆరు నెల‌లు క‌థ మీద కూచునికూచుని చివ‌రికి పైల్స్ వ‌స్తే లేచి వ‌చ్చా” అన్నాడు క‌త్తి మొన‌.
“ఫైల్స్‌లో వుండాల్సిన క‌థ పైల్స్ వ‌ర‌కూ వ‌చ్చింది. ప్రేక్ష‌కుడు కుర్చీలో కూచోకూడ‌దు, లేవ‌కూడ‌దు. ఆస‌నం వేయించి మ‌రీ చావ‌కొట్టాలి తీయ్ క‌త్తి” ఉత్సాహంగా అడిగాడు దివాళ‌య్య‌.
“ఇది విల‌న్ క‌థ‌, ఆ క‌థ‌లోకి హీరో వ‌స్తాడు”
“న‌డిపిస్తూ తీసుకురా, ట్రాన్స్‌పోర్ట్ బ‌డ్జెట్ లేదు”
“హీరో న‌డిస్తే క‌థ ముందుకు పోదు, గాలిలో ఎగురుతూ వ‌స్తాడు”
“గ్రాఫిక్సా”

హీరో అంటేనే గ్రాఫిక్స్‌, గ్రాఫిక్స్ అంటేనే హీరో. మ‌న విల‌న్‌కి చిన్న‌ప్పుడు పాట‌లు పాడే అల‌వాటు వుంటుంది. స్కూల్లో పాడితే సెల‌వు ప్ర‌క‌టించేవాళ్లు. ట్యూష‌న్‌లో పాడితే మేస్టారు ఆస్ప‌త్రిలో చేరేవాడు. ఈ భూకంపాన్ని గుర్తించిన అత‌ని త‌ల్లి ఒక రోజు నీతిబోధ చేసింది”

బాబూ, పాట వేట‌లాంటిది. హింస‌కి కూడా వారం, వ‌ర్జం చూసుకోవాలి. ప్ర‌తి శ‌నివారం మాత్ర‌మే పాడతాన‌ని మాటివ్వు. విల‌న్ మాట ఇచ్చాడు.

క‌ట్ చేస్తే బోకుల‌పాలెం అనే ఊరు. అక్క‌డ అంద‌రికీ చెవులు వాచిపోయి ఉన్నాయి. కొంద‌రికి కుందేలులాగా భుజాల వ‌ర‌కూ సాగాయి. ఆ ఊరికి హీరోయిన్ లేడీ కానిస్టేబుల్ వ‌చ్చింది. జ‌నాల‌కి క‌ర్ణాభ‌ర‌ణాలు ఎందుకున్నాయో అర్థం కాక , ఒక‌న్ని ఆపి అడిగింది.

“అదంతా మా ఖ‌ర్మ త‌ల్లి. ప్ర‌తి శ‌నివారం ఒక‌డొచ్చి పాట పాడుతాడు. ఆ ప‌వ‌ర్‌కి ప‌శువులు గొలుసులు తెంచుకుని పారిపోతున్నాయి. మా చెవులు చాట‌ల‌వుతున్నాయి” అని చెవులు త‌డుముకుంటూ చెప్పాడు.

“మ‌రి వాడినైనా త‌రిమేయాలి. మీర‌న్నా ఊరు వ‌ద‌లాలి క‌దా”
“స్క్రిప్ట్‌లో ఈ విష‌యం రాయ‌లేద‌మ్మా”
“మీ స్క్రిప్ట్ మీరే రాసుకోవాలి క‌దా”
“సినిమాల‌కి డైరెక్ట‌ర్‌, జీవితాల‌కి దేవుడు స్క్రిప్ట్ రాస్తాడు”

హీరోయిన్ దీర్ఘంగా ఆలోచించి , హీరోకి క‌థ చెప్పింది. హీరో సుదీర్ఘంగా ఆలోచించి మైమ్‌లో ఏదో చెప్పాడు.

శ‌నివారం రానే వ‌చ్చింది. విల‌న్ మెడ‌లో హార్మోనియంతో రావ‌డంతో పాటు వెంట ఒక త‌బ‌లిస్ట్‌ని కూడా తెచ్చుకున్నాడు. అత‌ని పేరు ద‌రువుల మోత‌య్య‌. ఒక‌సారి త‌బ‌లా మీద వేలు పెడితే ప్రాణం పోయినా తీయ‌డు.

విల‌న్ హార్మోనియం స‌వ‌రించేలోగా , మోత‌య్య త‌బ‌లా స‌ర్దుకునేలోగా భూమి ద‌ద్ద‌రిల్లింది. వేధించేవాన్ని సాధిస్తామ‌ని హీరో పాట ఎత్తుకుంటే జ‌నం కోర‌స్ అందుకున్నారు. భూకంపానికి అదీ కార‌ణం.

పులికే పులిహోర తినిపించే స‌రికి విల‌న్ షాక్ అయ్యాడు. వాయించే అవ‌కాశం చేజారే స‌రికి త‌బ‌ల‌య్య మూర్ఛపోయాడు. పాట‌కి అంత శ‌క్తి వుంద‌ని తెలియ‌ని విల‌న్ ఆర్త‌నాదాలు చేశాడు. ఈ సీన్‌లో వ‌చ్చే బీజీఎంకి ప్ర‌తి థియేట‌ర్‌లో ఆరేడు స్పీక‌ర్లు ప‌గిలిపోవాలి.

“జీఎస్టీకి అద‌నంగా ఇదో ఖ‌ర్చు” దిగులుప‌డ్డాడు నిర్మాత‌.
“ఎలా వుంది క‌థ” అడిగాడు క‌త్తి.
నిర్మాత చెయ్యి గిల్లుకుంటే స్ప‌ర్శ త‌గిలింది.

“ఇది ఆనదు. చ‌ర్మం మొద్దుబారే క‌థ చెప్పు” అని అడిగాడు.
క‌త్తిమొన బుర్ర‌కి సాన‌పెట్టి ఇంకోటి ఎత్తుకున్నాడు.

“హీరో ఒక ఇన్‌క‌మ్‌ట్యాక్స్ అధికారి. గ‌తంలో రికార్డ్ డ్యాన్స‌ర్‌. విల‌న్ అల‌వాటు ప్ర‌కారం క్రూరుడు. త‌న ఇంటి త‌లుపు ఏ అధికారి త‌ట్టినా వాడి చిటికెన వేలు న‌రికి ఫ్రిజ్‌లో పెడ‌తాడు”
“చిటికెన వేలే ఎందుకు?”
“సుల‌భంగా తెగుతుంది కాబ‌ట్టి”

“హీరో త‌న టీమ్‌తో విల‌న్ త‌లుపు త‌ట్ట‌గానే, హీరో చిటికెన వేలు న‌రికేస్తాడు. హీరో న‌వ్వి నీ సంగ‌తి తెలిసే నేను ఆర్టీఫిషియ‌ల్ వేలితో వ‌చ్చాను అని హాఫ్ కిలో మీట‌ర్ డైలాగ్ చెప్పి ఇల్లంతా వెతికే ప‌నిలో ప‌డ్డాడు. ప‌నిలో ప‌నిగా ఆ ఇంట్లో ముస‌ల‌మ్మ‌కి రికార్డ్ డ్యాన్స్‌లు చేసి చూపిస్తుంటాడు. ఇలా 12 ఏళ్లు ఆ ఇంట్లో సోదాలు చేస్తూనే వుంటాడు. హీరో ఆ ఇంట్లో నుంచి బ‌య‌టికి రాడు. ప్రేక్ష‌కులు బ‌య‌టికి పోలేరు. ఎందుకంటే మ‌నం త‌లుపుల‌కి గొల్లెం వేసి వుంటాం కాబ‌ట్టి.

క్లైమాక్స్‌లో డ‌బ్బులు, బంగారం దొరికితే హీరో బ‌య‌టికి వస్తే షాకింగ్ న్యూస్‌. అప్ప‌టికి విల‌న్ చ‌నిపోయి ఆరేళ్లు. అద్దంలో చూసుకున్న హీరోకి ఇంకో షాక్‌. తాను ముస‌లివాడై ఐదేళ్లు.

సొమ్ముతో ఇన్‌క‌మ్‌ట్యాక్స్ ఆఫీస్‌కి వెళితే అక్క‌డ పేరే మారిపోయింది. జ‌నాల్ని బాదిబాది అది డ‌బుల్ ఇన్‌క‌మ్‌ట్యాక్స్‌గా మారిపోయింది. ఆఫీస్‌లో హీరో ఫొటోకి దండ క‌నిపించింది.

మీ కోసం వెతికి వెతికి పేప‌ర్ ప్ర‌క‌ట‌న ఇచ్చి ఫొటోల‌కి దండ‌లు వేశాం. రేయిడింగ్‌కి వెళ్ల‌మంటే సింగింగ్‌, డ్యాన్సింగ్‌ల‌తో 12 ఏళ్లు వుంటారా? ఖ‌జానాలో డ‌బ్బు క‌ట్టి పింఛ‌న్ తీసుకుని వెళ్లండి అని అధికారులు చెబితే హీరో తెల్ల‌గ‌డ్డం క్లోజ‌ప్ మీద నిజాయితీకి ఇదేనా న‌జ‌రానా అని బ్యాగ్రౌండ్ సాంగ్‌. ఇక బీజీఎమ్‌కి…”

“మ‌న ల‌క్ష్యం స్పీక‌ర్లు ప‌గ‌ల‌డం కాదు, ప్రేక్ష‌కుల‌కి ప‌గ‌ల‌డం. వాళ్ల‌కి ఇమ్యూనిటీ పెరిగింది. ఇది కూడా ఆన‌దు. ఇంకొక‌టి చెప్పు”

“ఈ క‌థ వినండి. హీరో మెద‌డులో చిప్ పోయింది. చిప్ మార్పిడికి విల‌న్ ప్లాన్‌. ఆప‌రేష‌న్ టేబుల్ మీద హీరో. డాక్ట‌ర్ క‌ళ్ల‌జోడు ప‌గిలింది. క‌న్ఫ్యూజ‌న్‌లో ఫోన్ చిప్‌ని హీరో మెద‌డుకి, మెద‌డు చిప్‌ని త‌న ఫోన్‌లో బిగించాడు. క‌ట్ చేస్తే డాక్ట‌ర్ ఫోన్‌లో చిత్ర‌విచిత్రాలు క‌నిపిస్తున్నాయి. డాక్ట‌ర్‌కి వ‌చ్చే ఫోన్‌కాల్స్ హీరో మెద‌డుకి చేరి చెవుల్లోంచి ట్రింగ్ ట్రింగ్‌మ‌ని శ‌బ్దం”

“ఆప‌హే, ఇవ‌న్నీ అరిగిపోయాయి. ప్రేక్ష‌కుడి తాట తీయాలంటే ఈ డోస్ చాల‌దు. వెళ్లి ఇంకో ఆరునెల‌లు క‌థ మీద కూచో. పైల్స్ వ‌చ్చినా లేవ‌కు” అన్నాడు నిర్మాత‌.

అరిగిపోయిన ముఖంతో, కొత్త క‌థ‌కి సాన ప‌ట్ట‌డానికి క‌త్తిమొన సిద్ధ‌మ‌య్యాడు.

“అడ‌విలో ఉన్న సింహం, వేట నుంచి త‌ప్పించుకుంటుందేమో కానీ, మ‌న వేటు నుంచి థియేట‌ర్‌లోని ప్రేక్ష‌కుడు త‌ప్పించుకోకూడ‌దు. ఇదే మ‌న అంతిమ ల‌క్ష్యం. కొత్త ప్ర‌పంచం కోసం ఉద్య‌మిద్దాం. సినిమాకి వ‌చ్చిన ప్ర‌తిసారీ ప్రేక్ష‌కుడు ప్రేయ‌ర్ చేస్తూ ర‌క్షించండి అని వేడుకోవాలి. శుక్ర‌వార‌మే కాదు, అన్ని వారాలు మ‌న‌వే” ఆవేశంగా అన్నాడు నిర్మాత‌.

జీఆర్ మ‌హ‌ర్షి

19 Replies to “ప‌గ సాధిస్తా”

  1. Look at your article..It defines how cheap you are..You dont have the talent to create something..you got a opportunity at a waste place greatandhra and we cant expect much better or sensible content from the team of Greatandhra..

    Only criticizing doesnt help in anyway..first you wash your ass properly,dont try to wash others always..

    Try to have some values and morals as you are working in media dept..

    Useless website..useless people..

    The money which you earn with these kind of articles will definetly not useful to your family…

    Dont be a waste person in the society..

    Be responsible..

  2. ఇంతకీ మీ సొంత డబ్బుతో టిక్కెట్ కొని వెళ్లి చూసి రాశారా

    లేక

    వెనుకటి రెడ్డి వేసే బిచ్చం కి కక్కుర్తి పడి చూడకుండానే మీ కపిత్వం వదిలార?

  3. Excellent Analysis…keep going. Now a days movies are started like trading horses. producers don’t have mind set that they are trading horses or Donkeys?

    Every one wants to become national lever personality .

    But they should realise all our stars are for us only.

    if they realise we can dominate all other industries like chiru and nag.

    now a days Friday heroes are coming Monday they are becoming villains

  4. ఎంత సొంత డబ్బులయిన ఆలా సినిమా వాళ్ళు థియేటర్లో చీకట్లో లాగేసుకుంటే ఆ మాత్రం బాధ ఉంటుంది లెండి

  5. తప్పు పూర్తిగా నిర్మాతలది దర్శకులదేనా. వాస్తవానికి తెలుగు ప్రేక్షకులు ఇటువంటి content కు అర్హులు. ఒక్కసారి ఇతర భాషా చిత్రాలతో పోల్చిచూడాలి మన తెలుగు ప్రేక్షకుల aesthetics సినిమాపరంగా ఎంత అధమ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది. పై మూడు సినిమాల్లో ఒక హీరో ముసలోడు, outdated. ఇంకో హీరో కనీసం చూడ్డానికి బాగుంటాడు. ఇక మిగిలిన ఆయన అసలు ఏ కోణంలో చూసినా హీరో మెటీరియల్ కాదు, పైగా సహజ తార అని బిరుదు. వీళ్ళు తీసే సినిమాలు కల్ట్ క్లాస్సిక్కులు, path బ్రేకింగ్ అని మీడియా బిల్డప్. తెలుగు సినిమా వైపు చూడాలంటే కూడా భయమేస్తోంది, రోత పుడుతోంది.

  6. వాళ్ళ తప్పు కాదు. సినిమాల పరంగా తెలుగు ప్రేక్షకుల aesthetics అంత అధమస్తాయిలో ఉన్నాయి. అది వాస్తవం.

  7. నీ మొడ్డకి దణ్ణం గాని, మా బాగా దేంగావురా.. నాకు 400 బొక్క ఈ సినిమాలు వల్ల.

  8. సరిపోదా డబుల్ బచ్చన్.

    మూడు 90 mm రాడ్లు.

    అద్ది లెక్క అలా దెంగు.

    డైరెక్టర్ ఎర్రిపూకు అయితే ప్రొడ్యూసర్ కొండేర్రీపూకు.

Comments are closed.