ప్ర‌స్తుతానికి వైసీపీలో క‌ల్లోలం ఆగిన‌ట్టే!

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులంతా క‌ట్ట క‌ట్టుకుని టీడీపీ, బీజేపీలో చేరుతున్నార‌నే ప్ర‌చారానికి తెర‌ప‌డిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇద్ద‌రుముగ్గురు మిన‌హాయిస్తే మిగిలిన ఎంపీలంతా జంప్ చేస్తున్నార‌నే ప్ర‌చారం వైసీపీలో క‌ల్లోలానికి దారి తీసింది. వైసీపీలో ఎవ‌రు ఉంటారో,…

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులంతా క‌ట్ట క‌ట్టుకుని టీడీపీ, బీజేపీలో చేరుతున్నార‌నే ప్ర‌చారానికి తెర‌ప‌డిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇద్ద‌రుముగ్గురు మిన‌హాయిస్తే మిగిలిన ఎంపీలంతా జంప్ చేస్తున్నార‌నే ప్ర‌చారం వైసీపీలో క‌ల్లోలానికి దారి తీసింది. వైసీపీలో ఎవ‌రు ఉంటారో, ఎవ‌రు పోతారో తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితి. అయితే వైసీపీ క‌ల‌వ‌ర‌ప‌డినంత‌గా ఏమీ జ‌ర‌గలేదు.

వైసీపీ ఎంపీలు ఒక్కొక్క‌రుగా మీడియా ముందుకొచ్చి తాము పార్టీని, జ‌గ‌న్‌ను విడిచి వెళ్ల‌డం లేద‌ని తేల్చి చెప్పారు. దీంతో వైఎస్ జ‌గ‌న్‌తో పాటు వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఊపిరి పీల్చుకున్నారు. ఇలా ఎంత కాలం మాట‌పై నిల‌బడుతారో చెప్ప‌లేని ప‌రిస్థితి. రాజ‌కీయాల్లో ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు స‌ర్వ‌సాధార‌ణ‌మే. పార్టీ మారాల‌ని నిర్ణ‌యించుకుంటే, ఆ రోజుకు ఏదో ఒక సాకు, కార‌ణాన్ని సిద్ధం చేసుకుని వుంటారు.

భ‌విష్య‌త్‌లో ఏం జ‌రుగుతుంద‌నేది ప‌క్క‌న పెడితే, ప్ర‌స్తుతానికి మనోళ్లు మ‌న పార్టీలోనే ఉన్నార‌ని వైఎస్ జ‌గ‌న్ ధీమాగా వుంటున్నారు. ఇదే సంద‌ర్భంలో ఎమ్మెల్సీలు చేజారుతున్నారు. ఇప్ప‌టికి ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. అధికారం కోల్పోయిన మొద‌ట్లో ఎమ్మెల్సీల‌తో ప్ర‌త్యేకంగా జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యారు. ఎమ్మెల్యేలు పెద్ద‌గా లేర‌ని, మండ‌లిలో మ‌నం బ‌లంగా ఉన్నామ‌ని, భార‌మంతా మీదే అని జ‌గ‌న్ చెప్పారు.

టీడీపీ నేత‌లు ప్ర‌లోభ‌పెడ‌తార‌ని, గ‌ట్టిగా నిల‌బ‌డాల‌ని, క‌ళ్లు మూసుకుంటే ఐదేళ్ల స‌మ‌యం అలా గ‌డిచిపోతుంద‌ని జ‌గ‌న్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే జ‌గ‌న్ మాట‌ల్ని కొంత మంది చెవికెక్కించుకోలేద‌ని ముగ్గురు రాజీనామా చేయ‌డాన్ని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఎమ్మెల్సీల మార్పును వైసీపీ పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. రాజ్య‌స‌భ స‌భ్యుల్ని నిలుపుకుంటే చాల‌న్న‌ట్టుగా ఆ పార్టీ తీరు వుంది.

9 Replies to “ప్ర‌స్తుతానికి వైసీపీలో క‌ల్లోలం ఆగిన‌ట్టే!”

  1. ప్యాలస్ పులకేశి గాడి రోజు వారీ దినచర్య:

    11 గంటలు : నిద్ర లేవడం

    11:01: గజ్జల కి ఫోన్ చేసి ఈ రోజు టార్గెట్ ఎన్ని వందల కోట్లు అని కనుక్కోడం.

    రోజు మొత్తం: పబ్జి ఆడుకోవడం.

    8 :00 రాత్రి: గజ్జల వసూల్ చేసిన ఆ డబ్బు లెక్క పెట్టుకోవడం, ప్యాలస్ లో కంటైనేర్ లో దాచుకోవడం.

    4 ఏళ్లు ఇదే పని.

  2. ఉంటే ఉండండి పోతే పోండి అనే పొజిషన్ నుండి, ప్లీజ్ నన్నూ పార్టీనీ వదిలి వెళ్లొద్దని అడుక్కునే పొజిషన్ కి వచ్చాడు..

Comments are closed.