ఆధారం లేనిదే అభియోగం చేయకూడదు. సాక్ష్యం లేనిదే తీర్పు చెప్పకూడదు. ఒకవేళ చెప్పినా అది నిలబడదు. అందుకే ముందు అభియోగం లాంటి పచ్చినిజం చెప్పుకుని ఆ తర్వాత ఆధారాల్లోకి వెళ్దాం.
ఎక్కడ తెదేపా నీడ ఉంటుందో, ఎక్కడ తెదేపా కనీసం మొలకగానైనా బతికుంటుందో అక్కడ కులకంపు, కులాధిపత్యధోరణి, స్వకులమర్దనం, కులం పేరుతో ద్వేషించుకోవడం, కులరాజకీయం నడపడం, గొడవలు, గలాటాలు ఇవన్నీ క్యాన్సర్ లా పెరిగిపోతాయి.
దీనికి అనేక ఆధారాలున్నాయి. ఉదాహరణకి తెలంగాణా తీసుకుందాం. విభజన తర్వాత అసలు తెదేపా అక్కడ నామరూపాల్లేకుండా భూస్థాపితమైపోయింది. అప్పటి నుంచి కులకంపు లేకుండా ప్రశాంతంగా ఉంది ఆ ప్రాంతం. రాజకీయాలున్నా పార్టీల మధ్యన ఉంటున్నాయి తప్ప కులాల మధ్యన కనపడవక్కడ.
అదే ఆంధ్రాలో చూస్తే చెప్పక్కర్లేదు. తెదేపా ఇంకా ఊపిరితో ఉంది కనుక కులగజ్జితో కూడిన కుమ్ములాటలు, ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అశాంతి, అల్లకల్లోలం, గొడవలు..ఇలా అన్నీ జరిగిపోతున్నాయి.
అమెరికాలో తానా ఎన్నికలప్పుడు రిగ్గింగుల నుంచి ఇంకా ఎన్నో దరిద్రాలతో కొట్టుకోవడం బహిరంగంగానే కనిపిస్తుంటాయి. సభల్లో కూడా వర్గాలుగా విడిపోయి కేవలం ధనాశతో కూడిన ఆధిపత్య పోకడలతో కొట్టుకుచస్తుంటారు. మొన్న తానా వేడుకల్లో కూడా అలాంటి దృశ్యాలు చూసాం. కారణమేంటంటే దశాబ్దాలుగా తానా తెదేపా నీడలో బతుకుతున్న సంస్థ.
అదే తెలంగాణా తెలుగు అసోషియేన్ లో ఈ దరిద్రం ఉండదు. ఎందుకంటే అందులో తెదేపా వాళ్ల వేలుండదు. ఆ సంస్థ హుందాగా అందర్నీ కలుపుకుపోతుంటుంది. అలాగే తెదేపా నీడలేని ఇతర తెలుగు సంఘాల్లో కూడా ప్రశాంతత ఉంటుంది.
అమెరికా సంగతి పక్కన పెట్టి సింగపూర్ సంగతి చూడండి. అక్కడ తెలుగు వాళ్లున్నా తెదేపాకి చెందిన సామాజికవర్గం తక్కువగా ఉండడంతో అక్కడ తెలుగు సంఘాలు చిన్నగా ఉన్నా ప్రశాంతంగా ఉన్నాయి. అదే విధంగా దుబాయ్, షార్జా వంటి ప్రాంతాల్లో కూడా తెదేపా గ్రూపుల ప్రాబల్యం తక్కువగా ఉండడంతో పెద్దగా అశాంతి లేదక్కడి తెలుగు సంఘాల్లో. యూకే, కెనెడా, ఆష్ట్రేలియాల్లో కూడా అంతే.
ఎక్కడైతే తెలుగు సంఘాల్లో తెదేపా నీడ పడుతుందో అక్కడ వాతావరణమంతా విషపూరితమైపోతుంది. ఇది అక్షర సత్యం. అన్నిటికీ ఆధారాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి!
తెదేపా తీవ్రవాదులు ఎక్కడైతే సంఖ్యాపరంగా తక్కువగా ఉంటారో అక్కడ ప్రశాంతత వెల్లివిరుస్తుంటుంది. అందుకే తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కంటే ప్రశాంతంగా ఉంటున్నాయి. అక్కడున్న సమస్యలు వేరే ఉన్నా, ఆంధ్రలో తెదేపా సృష్టించే లాంటి సమస్యలు అక్కడుండవు.
ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోబడాలి. పాత రోజుల్లో ఊళ్లల్లో అందరూ కులాలకి అతీతంగా అత్తా, మామా అంటూ పలకరించుకుంటూ ఉండేవాళ్లు. తెదేపా ఆవిర్భవించినప్పటి నుంచి ఆ కులాంతర పిలుపులు తగ్గిపోయాయి. సొంతకులం వాళ్లని తప్ప మిగిలిన వాళ్లని వరసలు పెట్టి పిలుచుకునే సంస్కృతి చంకనాకిపోయింది. ఏ మనిషిని చూసినా “వీడి కులమేంటి?” అని ఆలోచించడం అలవాటు చేసింది తెలుగుదేశమే.
అందుకే తెదేపా సమూలంగా నామరూపాల్లేకుండా ఆంధ్రలోంచి కూడా పోతే తప్ప పాజిటివ్ వాతావరణం కనపడదు. ఒక పార్టీని ఇంతలా అసహ్యించుకోవడానికి కారణం కళ్ల ముందు కనిపిస్తున్న సాక్ష్యాలే.
నెగిటివిటీకి కాలం ఎక్కువనాళ్లు బతకనీయదు. అందుకే తెలంగాణాలో తెదేపా పీకని కాలమే నొక్కేసి, సగం మంది తెలుగువాళ్లకి ప్రశాంతతనిచ్చింది. రానున్న ఎన్నికల్లోనైనా తెలంగాణా ప్రజలు అనుభవిస్తున్న తెదేపారహిత వాతావరణాన్ని ఆంధ్రప్రజలు కూడా అనుభవించాలని అధికశాతం ఆంధ్రులు కోరుకోవాలి. తెలంగాణా మాదిరిగా తెదేపాకి కనీసం ప్రతిపక్షహోదా కూడా లేకుండా, ఉనికి కూడా లేకుండా పోతే తప్ప ఆ సుదినాలు రావు. తెదేపా ప్రతిపక్షంగా ఉన్నా కూడా క్యాన్సర్ కణం శరీరంలో ఉన్నట్టే.
బియ్యపు మధుసూదన్ రెడ్డి, MLA, శ్రీకాళహస్తి