Advertisement

Advertisement


Home > Politics - Opinion

ధర్మరాజు రాజసూయం- వైఎస్ జగన్ వైజాగ్ సమిట్

ధర్మరాజు రాజసూయం- వైఎస్ జగన్ వైజాగ్ సమిట్

అభివృద్ధికి నిర్వచనం చెప్పమని బాబు మనసుని అడిగితే "కమ్మే జనా సుఖినో భవంతు" అని చెబుతుంది. ఎందుకంటే ఆయనగారి గతమంతా అదే.కమ్మవారిలో జీడిపప్పు అమ్ముకునే వాళ్లని, పల్లీలు అమ్ముకునే వాళ్లని తీసుకొచ్చి వాళ్లకి సూటు బూటు వేసి ఐటీ వ్యాపారులని చెప్పి వాళ్ల చేత వందల కోట్ల ఎం.ఓ.యు లు చేయించి ఎకరాలకెకరాలు ధారాదత్తం చేసిన చరిత్ర ఆయనగారిది. విద్యాసంస్థలు నడిపేది స్వకులవర్గమైతే చాలు వందలాది ఎకరాలు కాలేజీల కోసం కేటాయించడం కూడా ఆయన ఘనతే. 

నిజానికి ప్రభుత్వ భూముల్ని ఒక వ్యాపారానికి కేటాయించినప్పుడు అది గణనీయమైన రాబడి తెప్పించేది అయ్యుండాలి. మనదేశంలో చట్టరిత్యా విద్య అనేది వ్యాపారం కాదు. మరి అలాంటప్పుడు వందలాది ఎకరాలు కాలేజీలకు కేటాయించడం వెనుక మతలబేంటి? 

అదలా ఉంచితే సాఫ్ట్ వేర్ కంపెనీలు నడిచేది ప్రధానంగా మనుషుల మెదళ్లతోనే. రెండు మూడు ఎకరాల స్థలంలో ఒక పెద్ద టవర్ నిర్మాణం చేస్తే చాలు అందులో ఎన్నో కంపెనీలు పడతాయి. నేదురుమల్లి జనార్దన రెడ్డి హయాములో మాదాపూర్ హైటెక్ సిటీ బిల్డింగ్ నిర్మాణం జరిగింది ఆ లెక్కల్లోనే. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆ హైటెక్ సిటీ క్రెడిట్ పూర్తిగా లాగేసుకున్నాడు కానీ నిజానికి అతనికి, దాని శంకుస్థాపనకి సంబంధమే లేదు. 

కానీ క్రమంగా సాఫ్ట్ వేర్ కంపెనీ అంటే చాలు పదుల ఎకరాలు కేటాయించేయడం రివాజైపోయింది బాబుకి. అదే కంపెనీ అదే వ్యాపారాన్ని ఎకరం స్థలంలో ఉన్న టవర్లో కూడా చేయవచ్చు. అయినా పెట్టుబడిదారుల్ని ఆకట్టుకునే నెపంతో ప్రజాభూముల్ని దుర్వినియోగం చేసినట్టే కదా!

జగన్ మోహన్ రెడ్డి అందుకే ఐటీ మీద మాత్రమే పూర్తి దృష్టి పెట్టడంలేదు. జగన్ దృష్టంతా సోలార్, పవర్, ఎనెర్జీ మరియు ఇతర ఉత్పత్తి రంగాలకు చెందిన పరిశ్రమల మీదే ఉంది.  

తాజా వైజాగ్ సమిట్ కి వచ్చింది మామూలు వ్యక్తులు కాదు, సాధారణ కంపెనీలు కాదు. ఒకేసారి అంతమంది దిగ్గజాలు ఒకచోట కనిపించడమంటే సాధారణ విషయం కాదు. చంద్రబాబు కూడా తన జీవితంలో ఆ స్థాయి పారిశ్రామికవేత్తలతో సామూహిక ఎం.ఓ.యు లు చెయ్యలేదు. అంబానీలు, అదానీలు, మిట్టల్స్, జిందాల్స్...ఇలా ఒకరని ఏమిటి.. దేశంలో కాకలు తీరిన హేమాహేమీలంతా వచ్చారు. 

ధర్మరాజు రాజసూయయాగం చేసినప్పుడు దుర్యోధనుడు అసూయపడినట్టు నేడు కచ్చితంగా చంద్రబాబు వైజాగ్ సమిట్ ని చూసి జగన్ పై అసూయపడుతూనే ఉండాలి. అందులో సందేహం లేదు. 

నిన్నటివరకు అన్నీ స్కీముల పేరుతో అప్పులు చేసి పంచడమే తప్ప పెట్టుబడులు తేవడం తెలియని ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేసిన నోళ్ళు నేడు మూసుకుపోయాయి. ఒకటా రెండా ఏకంగా 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. ఆ అంకెలో సున్నాలెన్నో లెక్కేయడానికే సమయం సరిపోతుంది పచ్చ తమ్ముళ్లకి.

అందుకే ఆ నొప్పి తట్టుకోలేక సోషల్ మీడియాలో వింత రాతలు రాస్తున్నారు. జగన్ ని గొప్పగా చూపించి తెదేపాని చిత్తు చేసే యోచనతో మోదీయే ఈ అంబానీల్ని, అదానీల్ని, మిట్టల్స్ ని, జిందాల్స్ ని వైజాగ్ కి పంపించి ఉత్తుత్తి ఎం.ఓ.యు లో చేయమన్నాడట. అదంతా ఉత్తిదే తప్ప నిజానికి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాదని ప్రచారం మొదలుపెట్టారు. 

కమెడీకైనా హద్దుండాలి. లేకపోతే పిచ్చెక్కిందనుకుంటారు జనం. అంబానీలు, అదానీలు ఏమైనా చంద్రాబు దొంగ ఎం.ఒ.యు లు చేయించడానికి పిలుచుకొచ్చిన జీడిపప్పు వ్యాపారులా? అయినా చంద్రబాబు ప్రాబల్యాన్ని తగ్గించడాడానికి మోదీ ఇంత యాక్షన్ ఎపిసోడ్ కండక్ట్ చెయ్యాలా? అసలు ఎక్కడుంది ప్రాబల్యం? పూర్తిగా చచ్చిపోయిన పార్టీలో కూడా ఇంకా జవసత్వాలున్నాయన్నది ఒక్క పచ్చతమ్ముళ్ల భ్రమ తప్ప అది వాస్తవం కానే కాదని ఎంత చెప్పినా కొందరికి అర్ధం కావట్లేదు. 

ఏ బుద్ధి ఉంటే ఆ ఆలోచనలు వస్తాయంటారు. 13 లక్షల కోట్ల పెట్టుబడుల్ని చంద్రబాబు ఆడిన భ్రమరావతి డ్రామా అనుకుంటున్నారు పచ్చ బాబులు. వాళ్లు మారరు. 

అభివృద్ధి అనేది ఒక్క సాఫ్ట్ వేర్ రంగంలోనే లేదు. దేశం సర్వతోముఖాభివృద్ధి చెందడానికి అనేక రంగాలున్నాయి. వాటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, ప్రజలది. ఆ పని జగన్ చేస్తున్నాడు. అందుకే దేశంలోని దిగ్గజవ్యాపారాలుంతా ఆ మహాక్రతువులో భాగం కావడానికి మహర్షుల్లా విచ్చేసారు. తమ పెట్టుబడులు ప్రకటించారు. వాళ్ల మాట వమ్ముకాదు. అనుకున్నదాంట్లో సగం పెట్టుబడి రానున్న రోజుల్లో వచ్చినా రాష్ట్రం స్థాయి దేశ పటంలో ఉన్నతంగా ఉంటుంది. 

హరగోపాల్ సూరపనేని

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా