ఎన్ని కాపీల బలగం ఇది

బలగం సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. అంత వరకు బాగానే వుంది. కానీ ఇది కాపీ..కాపీ అంటూ కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. జర్నలిస్ట్ గడ్డం సతీష్ ఈ కథ తనదే అంటూ బాహాటంగానే వాదిస్తున్నారు.…

బలగం సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. అంత వరకు బాగానే వుంది. కానీ ఇది కాపీ..కాపీ అంటూ కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. జర్నలిస్ట్ గడ్డం సతీష్ ఈ కథ తనదే అంటూ బాహాటంగానే వాదిస్తున్నారు. ఆయన ఓపెన్ కావడానికి ముందే సోషల్ మీడియాలో బలగం సినిమా పచ్చికి అనే కథ ను కాస్త మార్చులు చేర్పులు చేసి తీసారనే వార్తలు కనిపించాయి. 

ఇప్పుడు సతీష్ నే మీడియా ముందుకు వచ్చి 2011లో తాను రాసిన పచ్చికి అనే కథను వాడేసుకున్నారని, మూల కథ గా తనకు క్రెడిట్ ఇవ్వాలని, లేదంటే న్యాయపోరాటం చేస్తా అని హెచ్చరించారు.

ఇదిలావుంటే కన్నడంలో వచ్చిన తిథి అనే సినిమా కు అనసరనే ఈ బలగం సినిమా అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. సినిమాలో కోర్ పాయింట్ ఆ సినిమా నుంచి తీసుకున్నట్లే అనిపిస్తోందని అంటున్నారు. అయితే ఈ విమర్శలు ఏవీ దిల్ రాజు పట్టించుకోరు. పైగా ఇది మరింత పబ్లిసిటీ అవుతుందని హ్యపీ ఫీలవుతారు.

బలగం సినిమా కలెక్షన్స్ శుక్రవారం కన్నా శనివారం కాస్త బెటర్ గా కనిపించాయి. సండే ఎలాగూ బాగుంటాయి. అంటే చిన్న సినిమాతో దిల్ రాజు, దర్శకుడు వేణు సక్సెస్ కొట్టేసినట్లే.