గ్రీన్ ఎనర్జీకి ఏపీ దిక్సూచి

విశాఖలో రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో మొత్తం ఇరవై దాకా ప్రాధాన్యత రంగాలకు సంబంధించి 352 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇందులో ఎనర్జీ రంగానికి సంబంధించి నలభై దాకా ఒప్పందాలు జరిగాయి. ఇవన్నీ కూడా గ్రీన్ ఎనర్జీకి…

విశాఖలో రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో మొత్తం ఇరవై దాకా ప్రాధాన్యత రంగాలకు సంబంధించి 352 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇందులో ఎనర్జీ రంగానికి సంబంధించి నలభై దాకా ఒప్పందాలు జరిగాయి. ఇవన్నీ కూడా గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఏపీ ఫోకస్ చేస్తోంది అని చెప్పాలి. ఒక విధంగా ఈ రంగానికి ఏపీ పెద్ద పీట వేసినట్లు అయింది. 

ఈ రోజున ప్రపంచం అంతా గ్రీన్ ఎనర్జీ వైపు చూస్తోంది. భారత దేశం కూడా గ్రీన్ ఎనర్జీ కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటోంది. సోలార్, విండ్ వంటి వాటి ద్వారా పవర్ ప్రొడక్షన్ కోసం  గ్రీన్ ఎనర్జీ ఫీల్డ్ కి సంబంధించి అనేక ఒప్పందాలు కుదరడం ద్వారా రానున్న రోజుల్ల సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ దేశానికే మార్గదర్శకత్వం వహిస్తోంది అని అంటున్నారు. 

ఈ ఫీల్డ్ లో అనేక పెద్ద సంస్థలే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం శుభ పరిణామం అని అంటున్నారు. దీని వల్ల సమీప భవిష్యత్తులో ఏపీలో సమృద్ధిగా విద్యుత్ లభించడమే కాకుండా సరసమైన ధరకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే నేచర్ ఫ్రెండ్లీగా ఉంటూ విద్యుత్ రంగం ప్రగతిపధంలో సాగడానికి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రెండవ రోజు సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఉత్పత్తి వ్యయం తగ్గించేందుకు ప్రభుత్వం తరఫున పరిశ్రమలకు హామీ ఇచ్చారు. గ్రీన్ ఎనర్జీ ద్వారా చాలా వరకూ విద్యుత్ ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని పారిశ్రామికవేత్తలు సైతం ఆశాభావం వ్యక్తం చేశారు.

రెన్యూవబుల్ ఎనర్జీ ఫీల్డ్ లో పెద్ద ఎత్తున ఏపీకి పెట్టుబడులు రావడం ఈ సమ్మిట్ లో ఒక ప్రత్యేకత. అలాగే ఫార్మాస్యూటికల్ రంగంతో పాటు హెల్త్ కేర్ ఫీల్డ్ లో కూడా పెట్టుబడులు భారీగా వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో హెల్త్ ఫీల్డ్ లో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తిని చూపించారు.

టూరిజానికి ఏపీలో భవిష్యత్తు ఉందని భావిస్తున్న నేపధ్యంలో పాతిక కోట్ల రూపాయల దాకా ఆ రంగంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులకు ఆయా సంస్థలు ముందుకు రావడం మంచి పరిణామంగా చూస్తున్నారు.పెట్టుబడుల సదస్సుకు వచ్చిన స్పందనను చూసిన ముఖ్యమంత్రి జగన్ ఏపీని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.