కరోనా లాక్డౌన్ సమయంలో సోను సూద్ ని రియల్ హీరో అన్నారు. తెర మీద విలన్ వేషాలేసినా తన దయాహృదయంతో ఒక్కసారిగా నేషనల్ హీరో అయిపోయాడా నటుడు.
కానీ తెర మీద హీరోగా కనిపిస్తూ బయట మాత్రం రౌడీయిజాన్ని, సంఘవ్యతిరేకుల్ని ప్రోత్సహించే విలనొకడు తయారయ్యాడు. అతనికొక ప్రబుద్ధుడు కూడా తోడయ్యాడు.
తాజాగా కొందరు ఆన్లైన్ రౌడీమూకలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి ఫేక్ లెటర్ హెడ్స్ మీద ఇకనుంచి అమ్మఒడి ఆపేస్తున్నామనే సందేశంతో ఒక ప్రెస్ నోట్ లాంటి దానిని సృష్టించి సోషల్ మీడియాలో వదిలారు. అది చక్కర్లు కొట్టి ప్రజల్ని అయోమయానికి గురి చేసే లోపు నిఘావ్యవస్థలు వాటిని సృష్టించి సర్క్యులేట్ చేస్తున్న వారిని గుర్తించి అరెస్టు చేసారు.
అంతే వెంటనే పుత్రుడు, దత్తపుత్రుడు కలిసి ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. అరెస్టుల్ని అన్యాయమన్నారు. వారిని చట్టం చెరలోంచి విడిపిస్తామని మాటిచ్చారు.
ఇలా సంఘవిద్రోహులకి అండగా నిలిచేవారిని ఏమంటారు? సంఘవిద్రోహులనే కదా?
పదవనేది తమ సీటు కిందే ఉండాలి తప్ప ఇంకెవరి దగ్గరున్నా వాళ్లని పని చేయకుండా భ్రష్టుపట్టించేసే గుణాన్ని రౌడీయిజమనక ఏమంటారు?
ఇలాంటి వాళ్లని చూస్తుంటే… యజ్ఞకుండంలో రక్తమాంసాలు వేసి యజ్ఞభంగం చేసే మారీచ, సుబాహులు గుర్తొస్తారు.
అంటే వీళ్లకి కావల్సింది అశాంతి. జగన్ మోహన్ రెడ్డి సంక్షేమపథకాలే తమ పాలిటి మృత్యుశకటాలుగా భావిస్తున్నారు ఈ దుష్టులు. అవి ఎప్పుడెప్పుడు ఆగిపోతాయా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆగకపోయినా ఆగిపోతున్నాయన్న పుకారుతో అలజడి సృష్టించే వాళ్లకి వెన్నుదన్నునిస్తున్నారు.
మీరు ఆన్లైన్ రౌడీయిజం చేయండి..వెనుక మేమున్నాం అని భరోసా ఇస్తున్నారు.
మొన్నటికి మొన్న పేపర్ లీకు కేసులో దొరికిన ఒకడ్ని కనీసం పూట కూడా రిమాండుకు పంపకుండా వదిలేసారు. దాని వెనుక ఏవో చాణక్యాలున్నాయన్నది బహిరంగ రహస్యం.
కుదిరితే క్రిమినల్స్ కి దొరక్కుండా జాగ్రత్తలు చెప్పడం, దొరికితే తప్పించుకునే ఉపాయాలు ముందే రాసుకోవడం, రెడ్ హ్యాండెడ్ గా దొరికితే తాత్కాలిక స్నేహాన్ని నటించి శత్రువునైనా శరణు వేడి జైల్లో పడకుండా కాపాడుకోవడం…ఇదే వీళ్ల తంతు.
ఇక్కడ రెండో విషయానికి ఎగ్జాంపుల్ పేపర్ లీకు కేసైతే, ఆ చివరి విషయానికి ఉదాహరణ సుప్రసిద్ధమైన ఒక హీరోగారి గన్ షూటింగ్ కేసు.
ఇన్ని దరిద్రాలు తగలడ్డాయి ఈ పచ్చ పార్టీలో. వీళ్లేమో జగన్ ని విలననడం వింతల్లోకెల్లా వింత..అక్కడికి వీళ్లేదో మహాసాత్వికుల్లాగ!
వెన్నుపోటు మాటెత్తితే బాబాయి హత్య అంటారు.
ఓరేయ్ బాబులు! వెన్నుపోటు సీన్లో విలనెవడో అందరికీ తెలుసు. పొడిపించుకున్నవాడే “జామాతా దశమగ్రహం” అనే వీడియో వదిలి మరీ వెళ్లాడు. అయినా సిగ్గు లేని తెలుగు తమ్ముళ్ళు ఆ జామాతగాడికే భజన చేస్తుంటారు. ఆ జామాత సీ.ఎం అయినప్పుడల్లా పైనున్న వెన్నుపోటు బాధితుడి ఆత్మ క్షోభిస్తూనే ఉంటుంది. ఓడినప్పుడల్లా మనశ్శాంతిగా ఉంటుంది. ప్రెస్మీట్లో ఏడ్చినప్పుడు మాత్రం పగలబడి నవ్వుంటుంది.
కానీ బాబాయి హత్య ఎవరు చేసారో ఎవరికీ తెలీదు. ఎవడి ఊహాగానాలు వాళ్లవి. పైగా సీబీయై విచారణ చేపట్టి చాలామందిని పట్టుకుంటోంది. నేరస్థుడు దొరికినప్పుడు దొరుకుతాడు…ఎవరైనా సరే లోపలికెళ్తాడు! ఎందుకంటే వేరే మేనేజుమెంటులు చేతకావు ఈ వర్గానికి. అందాకా ఆపుకోలేరా పచ్చకామెర్లోళ్లు?
టీవీ చానల్లో ఒకడు సంఘవిద్రోహ చర్చాగోష్టులు, ఢిల్లీలో కూర్చుని ఒకడు ప్రభుత్వాన్ని వెక్కిరిస్తూ ప్రెస్ మీట్, మరో చానల్లో ఒకడు ఆముదం తాగిన మొహం వేసుకుని నిత్యం ప్రభుత్వం మీద విషం కక్కుతూ యాంకరింగు.
అందరూ విలన్లే. అందరూ సంఘవిద్రోహులే. రాష్ట్రమంతా తగలబడిబోతోందనే అబద్ధపు వార్తలు వండి వడ్డించడమే వీళ్ల దినచర్య. తమకి తిన్నది అరక్కపోతే రాష్ట్రంలో ఎవ్వరికీ అరగనట్టే. తమకి ఎక్కడో మండుతుంటే రాష్ట్రంలో అందరికీ మండుతున్నట్టే.
ఒకవేళ రాష్ట్రం కాలుతున్నట్టు వాసనొస్తే అది కచ్చితంగా పచ్చతమ్ముళ్ల కడుపులో అసూయ మంటే తప్ప ఇంకోటి కాదని వీళ్లకెవరన్నా చెప్పండయ్యా!
ఈ రాష్ట్రం వదిలించుకోవల్సిన దరిద్రం ఏదైనా ఉందా అంటే అది సంఘవిద్రోహులైన పైన చెప్పుకున్న దుష్టుల్నే.
– మహేష్ కుమార్ తటవర్తి