విశాఖ రాజధానికి కాంగ్రెస్ జై…!

విశాఖపట్నం రాజధాని అంటే అభివ్రుధ్ధిని కోరుకునేవారు ఎవరైనా ఇష్టపడతారు. శరవేగంగా అభివ్రుధ్ధి జరగాలనుకునేవారు సైతం సై అంటారు. వ్యక్తిగత స్వార్ధాలు, ఇతర ప్రయోజనాల కోసం పాకులాడేవారే వద్దంటారు. Advertisement ఎందుకంటే విశాఖకు ఆ అర్హత…

విశాఖపట్నం రాజధాని అంటే అభివ్రుధ్ధిని కోరుకునేవారు ఎవరైనా ఇష్టపడతారు. శరవేగంగా అభివ్రుధ్ధి జరగాలనుకునేవారు సైతం సై అంటారు. వ్యక్తిగత స్వార్ధాలు, ఇతర ప్రయోజనాల కోసం పాకులాడేవారే వద్దంటారు.

ఎందుకంటే విశాఖకు ఆ అర్హత ఉంది,  హక్కు కూడా  ఉంది. విశాఖ రాజధాని అన్నది  అందరికీ మంచిది, ఏపీ ప్రగతికి అది దిక్సూచి వంటిదని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. ఆ పార్టీ సీనియర్ నేతలు విశాఖ బెస్ట్ ప్లేస్ అంటూ జై కొడుతున్నారు.

కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు  విశాఖ రాజధాని మంచి నిర్ణయం అంటున్నారు. విశాఖలో మంచి వాతావరణం ఉంది. నగరం అభివ్రుధ్ధి చెందింది, రాజధానికి కావాల్సిన వసతులు అన్నీ ఉన్నాయని ఆయన మెచ్చుకుంటున్నారు. విశాఖని రాజధానిగా ఎంపిక చేయడం గొప్ప నిర్ణయంగా ఆయన పేర్కొంటున్నారు.

చంద్రబాబు రాజధాని ఎంపిక విషయంలో తప్పు చేశారని కూడా ఆయన విమర్శిస్తున్నారు. బాబు సంకుచితంగా ఆలోచన చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కూడా ఆయన హాట్ కామెంట్స్ చేసారు. రాష్ట్రం విభజన తరువాత ఆర్ధికంగా ఇబ్బందులో ఉందని, అందువల్ల పొదుపుగా ఒడుపుగా పాలన చేసుకోవాలని, విశాఖ వంటి రాజధాని ఉంటే పెద్ద ఖర్చు లేకుండానే అభివ్రుధ్ధి కల సాకారం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరో వైపు చాలా రోజుల క్రితమే విశాఖ రాజధానికి కాంగ్రెస్ దిగ్గజ నాయకుడు టి సుబ్బరామిరెడ్డి జై కొట్టేశారు. విశాఖను రెడీమేడ్ రాజధాని అని కూడా ఆయన కితాబు ఇచ్చారు. అన్నీ అందుబాటులో ఉన్న విశాఖను రాజధానిగా చేసుకోవాలనుకోవడం తెలివైన నిర్ణయం అని కూడా టీఎస్సార్ చెప్పారు.

ఇక ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి కూడా విశాఖ రాజధానిని స్వాగతిస్తున్నారు. ఏపీలో మిగిలిన ఏకైన మహానగరం విశాఖను రాజధానిగా చేసుకుంటే అభివ్రుధ్ధి పరుగులు పెట్టడం ఖాయమని కూడా ఆమె పక్కా క్లారిటీతో చెప్పుకొచ్చారు.

మరి మేధావులంటే  తామేనని టీడీపీ సహా కొన్ని విపక్షాలు రాజధాని మార్పు, అధికార వికేంద్రీకరణపైన గగ్గోలు పెట్టడం చూస్తూంటే ఇంతకంటే దారుణమైన రాజకీయం వేరొకటి ఉండబోదేమో.

వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాలి