మళ్లీ ఆగిన ఉరి.. భగ్గుమంటున్న భారతదేశం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు. మరికొన్ని గంటల్లో దోషులను ఉరి తీస్తారని దేశమంతా ఎదురుచూస్తుండగా, అనూహ్యంగా ఆ ఉరిశిక్ష తాత్కాలికంగా ఆగిపోయింది. దీంతో దేశం యావత్తూ మరోసారి…

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు. మరికొన్ని గంటల్లో దోషులను ఉరి తీస్తారని దేశమంతా ఎదురుచూస్తుండగా, అనూహ్యంగా ఆ ఉరిశిక్ష తాత్కాలికంగా ఆగిపోయింది. దీంతో దేశం యావత్తూ మరోసారి భగ్గుమంది.

ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు చట్టపరంగా ఉన్న అన్ని రకాల మార్గాల్ని అన్వేషిస్తున్నారు దోషులు. ఈ క్రమంలో ఆఖరి నిమిషంలో రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు దోషి వినయ్ శర్మ. ఈ అభ్యర్థన ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. దీంతో ఉరిశిక్షపై స్టే విధించాలంటూ దోషులు పటియాలా హౌజ్ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో జడ్జి ఉరిశిక్షపై స్టే విధించారు.

డెత్ వారెంట్ పై ఇలా స్టే ఇవ్వడం ఇది రెండోసారి. నిజానికి 22నే ఉరితీయాల్సి ఉంది. కానీ అప్పుడు స్టే పడింది. ఇక రేపు ఉరి తీయడానికి అంతా ఓకే అనుకున్న టైమ్ లో మరోసారి ఇలా స్టే పడింది. తాజా తీర్పుతో యావత్ దేశం భగ్గుమంటోంది. దుర్ఘటన జరిగి ఏడేళ్లయినా, దోషులుగా నిర్థారణ జరిగినా, ఇప్పటివరకు ఉరి శిక్ష విధించకపోవడాన్ని అంతా నిరసిస్తున్నారు. ఇలాంటి చట్టాలు తమకు అక్కర్లేదని అంటున్నారు.

మరోవైపు ఈ కేసుకు సంబంధించి తాను మైనర్ నంటూ దోషి పవన్ గుప్తా, సుప్రీంకోర్టు లో పిటిషన్ వేశాడు. దీన్ని అత్యున్నత ధర్మాసనం కొట్టేసింది. అర్థరహితమని తేల్చింది. అటు నిర్భయ తల్లి, పటియాలా తీర్పుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. దోషులకు ఉరిశిక్ష పడేంతవరకు పోరాడతానని స్పష్టంచేశారు.

ఇది అర్జున్ రెడ్డి సినిమా కాదు

వాళ్లిద్దరూ నన్ను ఎలా పడేయాలా అని చూసారు