పవిత్ర ‘జ్యోతి’

కరోనా ప్రభావం ప్రింట్ మీడియా మీద కూడా పడుతోంది. జనాలు ప్రతికలు ముట్టుకోవడానికి భయపడుతున్నారు. అదే సమయంలో ఇళ్లలోనే వుంటూ రోజంతా టీవీలు చూస్తున్నారు. దీంతో మర్నాడు న్యూస్ పేపర్లలో న్యూస్ పాత చింతకాయపచ్చడి…

కరోనా ప్రభావం ప్రింట్ మీడియా మీద కూడా పడుతోంది. జనాలు ప్రతికలు ముట్టుకోవడానికి భయపడుతున్నారు. అదే సమయంలో ఇళ్లలోనే వుంటూ రోజంతా టీవీలు చూస్తున్నారు. దీంతో మర్నాడు న్యూస్ పేపర్లలో న్యూస్ పాత చింతకాయపచ్చడి అవుతోంది. పైగా ఖర్చు తగ్గించుకోవడానికి న్యూస్ పేపర్లు వదిలేస్తున్నారు. అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లు న్యూస్ పేపర్లను లోపలి వరకు రానివ్వడం లేదు. ఇవన్నీ సర్క్యులేషన్ మీద ప్రభావం చూపిస్తున్నాయి.

దీంతో న్యూస్ పేపర్లు సేఫ్ అని, వాటికి కరోనా కల్మషం అంటదని వార్తా పత్రికలు టముకేస్తున్నాయి. కానీ జనం నమ్మడం లేదు. దాంతో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కొత్త మార్గం ఎంచుకుంది,. ప్రింట్ అయి పత్రికలు బయటకు వస్తుంటే, శానిటైజర్ లాంటి ద్రవాన్ని పిచికారీ చేస్తున్నట్లు ఓక విడియో విడుదల చేసారు. 

నిజానికి లక్షల కాపీలపై చల్లడానికి ఎన్నివేల లీటర్లు కావాలో తెలియదు. ఆ సంగతి వుంచితే న్యూస్ పేపర్ అన్నది ప్రింట్ అయ్యేవరకు చేత్తో టచ్ కాకుండానే వుంటుంది. ఎందుకంటే న్యూస్ ప్రింట్ రోల్ ను ఓసారి తగిలిస్తే ప్రింట్ చేసుకుంటూ పోతుంది. కానీ ఆ తరువాతే మాన్యువల్ వర్క్ స్టార్ట్ అవుతుంది.

మెషీన్ మీంచి కాపీలు తీయడం, ప్యాకింగ్ బాయ్ లకు సర్దడం, వాళ్లు దాన్ని లెక్క పెట్టడం, ప్యాక్ చేయడం, ఆ తరువాత రవాణా, ఆపై డెలివరీ ఏజెంట్, డెలివరీ బాయ్ ఇలా చాలా చేతులు పడతాయి మరి చేసిన ఈ శానిటేషన్ అంతా అప్పటివరకు వుంటుందా? అన్నది అనుమానం. 

మొత్తం మీద ప్రజలు నమ్మినా నమ్మకున్నా, తాము అనుకున్నట్లే వార్తలు అందించుకుంటూ వెళ్తున్న పత్రికలు, ఇప్పుడు జనాలు అసలు కొనకుంటే రాసి ఏం ప్రయోజనం అని భయపడుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అంతా కరోనాకాలం కదా.

బన్నీ ఎంత ఇచ్చాడో తెలుసా