పవన్ కల్యాణ్ క్లియర్.. బాబు ఫియర్

మూడు రాజధానులు మాకొద్దు, కావాలంటే కర్నూలులోనో, విశాఖపట్నంలోనో రాజధానిని కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు.. అని కుండబద్దలు కొట్టారు పవన్ కల్యాణ్. ఏపీకి ఒకే రాజధాని కావాలని, అది అమరావతి అయితే మంచిదని తన…

మూడు రాజధానులు మాకొద్దు, కావాలంటే కర్నూలులోనో, విశాఖపట్నంలోనో రాజధానిని కట్టుకోండి మాకు అభ్యంతరం లేదు.. అని కుండబద్దలు కొట్టారు పవన్ కల్యాణ్. ఏపీకి ఒకే రాజధాని కావాలని, అది అమరావతి అయితే మంచిదని తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటించారు. కాని చంద్రబాబు అలా కాదు.

మూడు రాజధానులపై ఇన్నిరోజులైనా తన పార్టీ అభిప్రాయాన్ని, స్థిర నిర్ణయాన్ని ప్రకటించ లేదు బాబు. కర్నూలుకు హైకోర్టు వద్దు అని చెప్పడం లేదు, విశాఖకు సెక్రటేరియట్ తరలిస్తే ఎలా అని ఆందోళన వెలిబుచ్చడం లేదు. అమరావతికి అన్యాయం జరుగుతోందని మాత్రమే మొసలి కన్నీరు కారుస్తున్నారు. రైతుల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారు.

అటు రాయలసీమ, ఉత్తరాంధ్రలో పార్టీ ఇమేజ్ డ్యామేజీ కాకూడదు, ఇటు అమరావతి ప్రాంతంలో తన పట్టు కోల్పోకూడదు.. అనే ఆలోచనతోనే చంద్రబాబు ఆచితూచి మాట్లాడుతున్నారు. విశాఖకు రాజధాని వస్తే కలిగే ప్రయోజనాలు చెప్పకుండా, ఇప్పటికే అక్కడకు వచ్చిన కంపెనీలను తరిమికొట్టారంటూ విద్వేష ప్రసంగాలిస్తున్నారు. అటు రాయలసీమ వెనకబాటు గురించి మాట్లాడకుండా.. కేవలం హైకోర్టు వస్తే ఏమవుతుందంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇంతకంటే కుటిల రాజకీయం ఇంకోటి ఉంటుందా? అనుకూల మీడియా అండతో తాను అన్ని ప్రాంతాల వాడినని కలరింగ్ ఇస్తూ, జగన్  మాత్రం అమరావతి అభివృద్ధికి వ్యతిరేకం అనేలా చిత్రీకరిస్తున్నారు.

వైసీపీ నేతలు ఈ విషయంపై చంద్రబాబుని సూటిగా ప్రశ్నించాలి. గుంటనక్కలా వ్యవహరిస్తున్న బాబు బండారం బైటపెట్టాలంటే మూడు రాజధానులపై సమాధానం చెప్పాల్సిందేనంటూ పట్టుబట్టాలి. పవన్ కల్యాణ్ అయినా తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పారు, కనీసం చంద్రబాబుకి ఆ పాటి ధైర్యం కూడా లేకపోయింది. చివరికి కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి కూడా వెనకాడటం లేదంటే.. బాబు ఎంతలా భయపడుతున్నారో అర్థమవుతోంది.