కొన్ని సార్లు అంతే. ఏదో అనుకుంటాం, ఇంకేదో జరుగుతుంది. కమెడియన్ షకలక శంకర్ విషయంలో కూడా అదే జరిగింది. దర్శకుడు అనీల్ రావిపూడి ఇతడి కోసం మంచి కామెడీ ట్రాక్ రాసుకున్నాడు. దాని ఔట్ పుట్ కూడా చాలా బాగా వచ్చింది. కానీ ఫైనల్ వెర్షన్ నుంచి షకలక శంకర్ ట్రాక్ మొత్తం లేపేశారు. ఈ విషయాన్ని నిర్మాత అనీల్ సుంకర స్వయంగా ప్రకటించాడు.
కథలో మిక్స్ అయ్యేలా కమెడియన్ సత్యతో సిచ్యుయేషనల్ కామెడీ ట్రాక్ ఒకటి పెట్టుకున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. దీంతో పాటు కథతో సంబంధం లేకుండా, సెపరేట్ గా షకలక శంకర్ తో మరో కామెడీ ట్రాక్ షూట్ చేశాడు. సత్య కామెడీ సూపర్ గా వచ్చిందట. దీంతో షకలక శంకర్ కామెడీ ట్రాక్ అవసరం లేదనే నిర్ణయానికొచ్చారు. పైగా షకలక శంకర్ ట్రాక్ తీసేస్తే రన్ టైమ్ కూడా కలిసొస్తోంది.
అందుకే షకలక శంకర్ ట్రాక్ మొత్తే లేపేసినట్టు ప్రకటించాడు అనీల్ సుంకర. సినిమాలో దాదాపు 30 నిమిషాల పాటు వచ్చే ట్రయిన్ ఎపిసోడ్ హిలేరియస్ గా ఉంటుందంటున్నాడు. మొత్తమ్మీద సరిలేరు సినిమాలో షకలక శంకర్ కు అలా అన్యాయం జరిగిందన్నమాట. ఇక అతడి కామెడీ చూడాలంటే.. డిలీటెడ్ సీన్స్ అంటూ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసేవరకు వెయిట్ చేయాల్సిందే.
షకలక శంకర్ ట్రాక్ తీసేసిన తర్వాత కూడా సరిలేరు రన్ టైమ్ దాదాపు 2 గంటల 48 నిమిషాలు వచ్చింది. ఇదే రన్ టైమ్ ఉంచాలా లేక మరో 8-10 నిమిషాలు తగ్గించాలా అనే అంశంపై ప్రస్తుతం కిందామీద పడుతున్నారు. మహేష్ ఓకే అంటే ఇదే నిడివితో సెన్సార్ కు పంపించేస్తారు