అది జగన్ చేస్తున్న తప్పంటావా పవన్!

ఒకవైపు దేశంలో పక్క రాష్ట్రాల్లో ఉల్లిపాయల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. కర్ణాటకలో ఉల్లిపాయల ధర 180 రూపాయలకు చేరుకుంది. మిగతా దేశంలోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో దేశమంతా వినియోగదారులు గగ్గోలు…

ఒకవైపు దేశంలో పక్క రాష్ట్రాల్లో ఉల్లిపాయల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. కర్ణాటకలో ఉల్లిపాయల ధర 180 రూపాయలకు చేరుకుంది. మిగతా దేశంలోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో దేశమంతా వినియోగదారులు గగ్గోలు పెడుతూ ఉన్నారు!

గమనించాల్సిన అంశం ఏమిటంటే.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఉల్లిపాయల ధరలను ప్రభుత్వాలు సమీక్షించడం లేదు. అది కేంద్రం పని అన్నట్టుగా వదిలేశాయి. ఎక్కడా వినియోగదారులకు ఉల్లిపాయలను తక్కువ ధరకు అందిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 

దేశంలో వివిధ పార్టీలు ఏలుతున్న రాష్ట్రాలున్నాయి. అయితే ఎక్కడా సబ్సిడీ ధరలకు ఉల్లిపాయల ముచ్చటే లేదు. ఏపీ ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రయత్నిస్తూ ఉంది.

రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలను 25 రూపాయలకు అందిస్తూ ఉంది. రాష్ట్రంలోని చాలా చోట్ల ఆ మేరకు పంపకాలు జరుగుతున్నాయి. ఆధార్ కార్డుకు రోజుకు కేజీ చొప్పున అమ్మకం సాగుతున్నాయి. ఇది స్వాగతించాల్సిన అంశం.

అయితే శ్రీమాన్ పవన్ కల్యాణ్ కు ఏమనిపిస్తోందంటే.. వినియోగదారులను అలా క్యూల్లో నిలబెట్టడం తప్పు అట. ఈ విషయంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయ్యిందట. బారుల కొద్దీ ఉన్న క్యూల వీడియోలను పోస్టు చేసి పవన్ నిరసన వ్యక్తం చేశారు. వీటికీ మతమార్పిడిలకు లింక్ పెట్టేశారనుకోండి!

రేషన్ లా ఉల్లిపాయలను ఇస్తున్నందుకు ప్రజలు కళ్లకు అద్దుకుని తీసుకుంటున్నారు. దేశంలో జనాభా ఎక్కువ మిస్టర్ పవన్ కల్యాణ్. నీ సినిమా టికెట్లకు అయినా సగటు మనుషులు క్యూల్లో నిలబడాల్సిందే.

నీకు దేశం గురించి అవగాహన ఎక్కువ కాబోలు.ప్రభుత్వం అందిస్తున్నందుకు మెచ్చుకోవాల్సింది పోయి, క్యూలు బారుగా ఉన్నాయని అంటున్నారీ పెద్ద మనిషి. 

అయితే ఈ రోజే పవన్ కల్యాణ్ ఇలా ఉల్లి క్యూల వీడియోలు పోస్టు చేయడానికి మరో లెక్క ఉంది. అదేమిటంటే.. వీళ్ల పార్ట్ నర్ అసెంబ్లీలో ఉల్లిపాయలు ఎత్తుకున్నారు.

అందుకని పవన్ బయట గోల చేస్తూ ఉన్నారు. యథా చంద్రబాబు, తథా పవన కల్యాణ్.. వీళ్లే చాటుకుంటున్నారు బంధాన్ని అని పరిశీలకులు అంటున్నారు!