Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎవరికి వారే కళ్యాణ్ రామ్ తీరే

ఎవరికి వారే కళ్యాణ్ రామ్ తీరే

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ చేస్తున్న లేటెస్ట్ సినిమా ఎంత మంచి వాడవురా. సాధారణంగా నందమూరి హీరోలకు అంటూ ఓ పీఆర్ టీమ్ అంటూ వుంది. కానీ ఇప్పుడు ఆ టీమ్ ఇతరత్రా బిజీ అయిపోయి, తమ హీరోని వదిలేసినట్లు కనిపిస్తోంది. ఎంత మంచివాడవురా సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి వుంది. దాంతో పాటు వస్తున్న అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ సినిమాల పీఆర్ టీమ్ లు చురుగ్గా పని చేస్తూ ఆ సినిమాలకు సూపర్ బజ్ తీసుకువచ్చాయి.

కళ్యాణ్ రామ్ సినిమా అనేది ఒకటి వస్తోంది అనే జనాలకు తెలియని పరిస్థితి వుంది. నిన్నటికి నిన్న ఎస్పీబీ పాడిన పాట విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ఏ మీడియా కూడా ఆ పాటను పట్టించుకున్నట్లు కానీ, అలా పట్టించుకునేలా పీఆర్ టీమ్ కృషి చేసినట్లు కానీ కనిపించలేదు.

పైగా సినిమాకు రెండు బ్యానర్లు. ఆ రెండు బ్యానర్లకు రెండు పీఆర్ టీమ్ లు వున్నాయి. కళ్యాణ్ రామ్ సినిమాకు వేరేవారిని పనిచేయనివ్వరు కదా అని ఆ టీమ్ లు సైలంట్ అయిపోయాయి. ఇటు కళ్యాణ్ రామ్ టీమ కూడా ఎందుకో ఈ సినిమాను సీరియస్ గా తీసుకున్నట్లు లేదు. 

మరోపక్క గుజరాతీ ఫీల్ గుడ్ సినిమాను తీసుకుని, కళ్యాణ్ రామ్ ఇమేజ్ కోసం ఫైట్లు గట్రా యాడ్ చేసి, నలభై శాతం సినిమాను మార్చేసారని, మంచి సినిమాను యాక్షన్ సినిమాగా మార్చేసారని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పండగ పోటీలో కళ్యాణ్ రామ్ పరువు ఎలా నిలబడుతుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?