జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని అని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పవన్‌ను రాజకీయ నాయకుడు అనాలో.. నటుడు అనాలో అర్థం కావడం లేదన్నారు.
తెలుగుదేశం అదినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు మతిస్థితమితం పోయి ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదనుకుంటే.. పవన్ కూడా మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ద్వజమెత్తారు.
నమ్ముకున్న సిద్ధాంతం కోసం సోనియా గాంధీని ఎదురించిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని అనిల్ అన్నారు. వైఎస్ జగన్ దమ్ము, ధైర్యం గురించి ప్రజలందరికీ తెలుసనని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమ పచ్చని డెల్టాగా మారిందన్నారు.
వైఎస్ జగన్‌పై కడుపు మంటతోనే పవన్, చంద్రబాబు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు. అందుకే 2017లో కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటనను పట్టుకుని సీఎం వైఎస్ జగన్ పాలనలో జరిగనట్టుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అది చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన ఘటన అని తెలియదా అని నిలదీశారు. పవన్ ముందు న్యూస్ పేపర్ చదవడం నేర్చుకోవాలని సూచించారు.
ఎన్నికల్లో ప్రజలు ఎవరి తోలు తీసారో అందరికీ తెలుసనని వ్యాఖ్యానించారు. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్‌కు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని అన్నారు. డిసెంబర్ 26న కడపలో ఉక్కు పరిశ్రమకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు.