ప‌వ‌న్ వైవాహిక సంస్కారాలు…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అధికార‌ వైసీపీతో అన‌వ‌స‌రంగా గొడ‌వ పెట్టుకున్నందుకు త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తోంది. నువ్వొక‌టంటే…మేము ప‌ది మాట‌లంటామ‌నే రీతిలో వైసీపీ నేత‌లు రంగంలోకి దిగారు. ప‌వ‌న్ మాట్లాడినా, ట్వీటాడినా వెంట‌నే దీటైన కౌంట‌ర్లు…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అధికార‌ వైసీపీతో అన‌వ‌స‌రంగా గొడ‌వ పెట్టుకున్నందుకు త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తోంది. నువ్వొక‌టంటే…మేము ప‌ది మాట‌లంటామ‌నే రీతిలో వైసీపీ నేత‌లు రంగంలోకి దిగారు. ప‌వ‌న్ మాట్లాడినా, ట్వీటాడినా వెంట‌నే దీటైన కౌంట‌ర్లు ఇస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం తెర‌పైకి తెచ్చేందుకు మంత్రులు, వైసీపీ నేత‌లు వెనుకాడ‌డం లేదు.

తాజాగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైవాహిక సంస్కారం గురించి ప్ర‌స్తావిస్తూ మంత్రి పేర్ని నాని ట్వీట్ చేయ‌డం గ‌మనార్హం. అయితే ఇదంతా ప‌వ‌న్ యాక్ష‌న్‌కు రియాక్ష‌న్ మాత్ర‌మే అని వైసీపీ నేత‌లు చెబుతుండ‌డం విశేషం.

త‌న‌పై మంత్రులు, ర‌చ‌యిత పోసాని కృష్ణ‌ముర‌ళి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న‌దైన వ్యంగ్య ధోర‌ణిలో ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు. దానికి ప్ర‌తిగా పేర్ని నాని అదే స్థాయిలో వెట‌కారం చేశారు.

‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైకాపా గ్రామ సింహాల గోంకారాలు సహజమే’’ అంటూ సోమవారం రాత్రి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. దీంతో పాటు 'హూ లెట్ ద డాగ్స్ ఔట్స‌ అనే పాటను ట్వీట్ చేస్తూ.. ఇది తనకు ఇష్టమైన పాటల్లో ఒకటిగా ప‌వ‌న్‌ పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.

ట్వీట్‌కు ట్వీట్ రూపంలోనే పేర్ని నాని కౌంట‌ర్ ఇవ్వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ‘జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు’ అని ట్వీట్ చేశారు. అలాగే పవన్ కల్యాణ్‌పై ఓ ట్రోల్ వీడియోనూ పోస్ట్ చేశారు. దీంతో వీడియోకు వీడియో, ట్వీట్‌కు ట్వీట్‌…అన్నీ లెక్క‌లు స‌రిపెట్టిన‌ట్టైంది. మొత్తానికి ప‌వ‌న్ యాక్ష‌న్ కంటే, వైసీపీ రియాక్ష‌నే ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉన్న‌ట్టు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది.