బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా దర్శనానికి పవర్ స్టార్, జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ఏకంగా 48 గంటల సమయం పట్టింది. నిజంగా ఇది పవన్‌ను అవమానించడమే. తెలుగు రాష్ట్రాల్లో సినిమా స్టార్‌గా పెద్ద సంఖ్యలో అభిమానులను కలిగిన పవన్ విషయంలో బీజేపీ నిర్లక్ష్యం ప్రదర్శించిందని చెప్పొచ్చు.
బీజేపీ అగ్రనేతలను కలవడానికి పవన్‌కల్యాణ్ ఆకస్మికంగా శనివారం ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఆ రోజు రాత్రికే నడ్డాను కలుస్తారని మీడియాలో బాగా ప్రచారం జరిగింది. అయినా కుదరలేదు. ఆ మరుసటి రోజు కూడా బీజేపీ నేతలెవ్వరూ పవన్‌కు అపాయింట్మెంట్ ఇవ్వలేదు.
సోమవారం మధ్యాహ్నం నడ్డా అపాయింట్మెంట్ ఇచ్చాడు. దీంతో నడ్డా నివాసంలోనే ఆయన్ను పవన్‌తో పాటు నాదెండ్ల మనోహర్ కలిశారు. అయితే ఏం మాట్లాడారో బయటికి తెలియలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుస్తారనే ప్రచారం జరిగినా వీలు కాలేదు. ఆర్ఎస్ఎస్ నేతలను ఆదివారం కలిశారని తెలిసింది. బీజేపీ చీప్ అమిత్‌షా మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిసింది. కాగా జనసేన, వైసీపీ నేతల మధ్య గొడవ జరుగుతున్న కాకినాడకు పవన్ బయల్దేరినట్టు సమాచారం