విశాఖ నగర శివారులో బిగ్‌బాస్ కంటెస్టెంట్, జనసేన నాయకుడు, పవన్‌కల్యాణ్ వీరాభిమాని నూతన్‌నాయుడి ఇంట్లో దళిత యువకుడు శ్రీకాంత్‌కు శరోము్ండనంతో పాటు చితకబాదడం తీవ్ర సంచలనమైంది. ఈ కేసును విశాఖ సీపీ మనీష్‌కుమార్ సిన్హా సీరియస్‌గా తీసుకున్నారు.
ఈ కేసులో ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. నిందితుల్లో నూతన్‌నాయుడు భార్య మధుప్రియతో పాటు ఏడుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నూతన్‌నాయుడు ఇంట్లో శిరోముండనం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండే ఈ ఘటనపై జనసేనాని పవన్‌కల్యాణ్ ఇంత వరకూ స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు చేయడానికి మాత్రం ముందుండే పవన్‌కల్యాణ్…ఇప్పుడు తన పార్టీ నేత, వీరాభిమాని ఇంట్లో జరిగితే ఎందుకు నోరెత్తడం లేదని ప్రత్యర్థులు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇదే పోలీస్‌స్టేషన్‌లో శిరోముండనం కేసులో పోలీస్ ఉన్నతాధికారులను సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్ చేసి కటకటాల పాలు చేసిన విషయాన్ని వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.
పవన్‌కల్యాణ్‌పై రాంగోపాల్‌వర్మ పవర్‌స్టార్ అనే సినిమా తీస్తే…దానికి కౌంటర్‌గా నూతన్‌నాయుడు పరాన్నజీవి పేరుతో వర్మపై సినిమా తీసిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. తన పరమ భక్తుడి ఇంట్లో దళితునికి అవమానం జరిగితే…అది పవన్ మనసును కదిలించకపోయిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రతిపక్షంలో ఉన్న జనసేనానికి…ఒక చిన్న సమస్య వస్తే మాట్లాడలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ జనసేన అధికారంలోకి వస్తే అణగారిన వర్గాలను బతకనిస్తారా అంటూ నెటిజన్లు ప్రశ్నించడం కొసమెరుపు.