ఏపీ రాజకీయాలను జాగ్రత్తగా గమనిస్తే.. ఓ ఆసక్తికర విషయం కనిపిస్తుంది. కొన్ని రోజులుగా నారా లోకేష్ సైలెంట్ అయ్యారు. అదే టైమ్ లో కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ యాక్టివ్ అయ్యారు.
నోటికొచ్చిన ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. ఈ రెండు పరిణామాల మధ్య లింక్ ఏమైనా ఉందా? పవన్ కు మరో ప్యాకేజీ అందిందంటోంది సోషల్ మీడియా.
గడిచిన 4 రోజులుగా లోకేష్ ఏం చేస్తున్నారు..?
నారా లోకేష్ ఆమధ్య శవ రాజకీయాలు మొదలుపెట్టారు. ఎవరు, ఎక్కడ, ఏ రూపంలో మరణించినా వెంటనే అక్కడ వాలిపోయేవారు. శవయాత్రల్లో పాల్గొని వైసీపీ ప్రభుత్వంపై ఎగిరెగిరి పడేవారు. ఆఖరుకి ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్యాలను కూడా తమ పార్టీ మైలేజీ కోసం వాడుకోవాలని చూసి అభాసుపాలయ్యారు. ఓసారి కావాలని అరెస్ట్ అయి హీరోగా బిల్డప్ ఇచ్చారు.
లోకేష్ ఫుల్ జోష్ లోకి వచ్చేశారనుకున్న టైమ్ లో ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు. మళ్లీ ట్విట్టర్ కే పరిమితం అయ్యారు. లోకేష్ పరోక్షంలో మిగతా నాయకులు సోషల్ మీడియాలో ఎగిరెగిరి పడుతున్నారు. లోకేష్ మాత్రం పుట్టినరోజు శుభాకాంక్షలు, జయంతులు, వర్థంతులతోనే కాలక్షేపం చేస్తూ కాస్త తగ్గారు.
గడిచిన 4 రోజులుగా పవన్ ఏం చేస్తున్నారు..?
ఇలా లోకేష్ పొలిటికల్ గా కాస్త తగ్గారో లేదో అలా పవన్ అందుకున్నారు. వాడివేడి ఆరోపణలతో వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. వకీల్ సాబ్ సినిమా ప్రీమియర్ షోలను ఆపేసినప్పుడు కూడా పవన్ నోరు తెరవలేదు.
సినిమా టికెట్ల ఆన్ లైన్ అమ్మకాల గురించి వార్తలొచ్చినప్పుడు పవన్ సైలెంట్ గానే ఉన్నారు. కానీ సడన్ గా రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన గొంతు చించుకున్నారు. తనమీద కోపాన్ని ఇండస్ట్రీపై చూపిస్తున్నారంటూ మండిపడ్డారు.
పవన్ లో అంత ఆవేశాన్ని, అన్ని సెటైర్లను జనసేన నాయకులు కూడా ఈమధ్య చూడలేదు. అంత స్పాంటేనియస్ గా అవతలివాళ్ల విమర్శలకు ఆయన రియాక్ట్ అయింది కూడా లేదు.
అసలు పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ లో పొలిటికల్ కామెంట్స్ పెట్టి కూడా ఏళ్లు గడిచిపోయింది. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా పవన్ తను యాక్టివ్ అవ్వడమే కాకుండా, తన పర్సనల్ ట్విట్టర్ ఖాతాను కూడా యాక్టివేట్ చేశారు.
ప్యాకేజీ చేతులు మారిందా..?
సడన్ గా పవన్ ఎందుకు శివాలెత్తారు. పూనకం వచ్చినట్టు ఎందుకు ఊగిపోయారు. అదే టైమ్ లో లోకేష్ కాస్త లో-ప్రొఫైల్ మెయింటైన్ చేయడం అనుమానాలకు తావిస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కి అందాల్సిందేదో అందింది అని అంటున్నారు నెటిజన్లు. అలాంటిదేదో లేకపోతే పవన్ బాడీలోంచి ఇంత ఆవేశం, ఆయన ఎకౌంట్ నుంచి ఇన్ని ట్వీట్లు బయటకు రావంటున్నారు చాలామంది.
వైసీపీ విమర్శలకు తోడు ఇప్పుడు సోషల్ మీడియాలో పడుతున్న కౌంటర్లు పవన్ ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేస్తున్నాయి. ప్యాకేజీ స్టార్ అనే పేరుని పవన్ ఫిక్స్ చేసుకున్నారని, అందుకే ఆయన మరోసారి ప్యాకేజీకి అమ్ముడుపోయారని పోస్టులు పడుతున్నాయి.
సడన్ గా పవన్ సినిమా టికెట్ల వ్యవహారాన్ని అడ్డు పెట్టుకొని, వైసీపీపై విరుచుకుపడ్డానికి.. ఇటు లోకేష్ ఉన్నట్టుండి సైలెంట్ అవ్వడానికి తెరవెనక కుదిరిన ఒప్పందమే కారణం అంటున్నారు.