ఎన్టీఆర్ తర్వాత నేనే.. పవన్ సెల్ఫ్ డబ్బా

పార్టీ పెట్టి ఏడాది తిరిగేలోగా అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్ ది, అదే సినీ పరిశ్రమ నుంచి వచ్చాం కదా అని పార్టీ పెట్టి, అర్హత లేకపోయినా అధికారం కోసం అర్రులు చాచి, చివరకు…

పార్టీ పెట్టి ఏడాది తిరిగేలోగా అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్ ది, అదే సినీ పరిశ్రమ నుంచి వచ్చాం కదా అని పార్టీ పెట్టి, అర్హత లేకపోయినా అధికారం కోసం అర్రులు చాచి, చివరకు చేతగాక పార్టీని అమ్మేసిన ఘనత మెగా ఫ్యామిలీది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఈ విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గేట్టు లేరు. ఏకంగా ఎన్టీఆర్ తో పోల్చుకుంటూ తన ఇగో శాటిస్ ఫై చేసుకుంటున్నారు.

ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ తర్వాత బహుశా పార్టీని ఇంతకాలం నడిపిన సినీ నటుడ్ని నేనే నంటూ కార్యకర్తల ముందు బిల్డప్ ఇచ్చారు పవన్. చిరంజీవి ప్రజారాజ్యం ఫెయిల్యూర్ ని మాత్రం నాయకులపైకి నెట్టేశారు. ఆరోజు మాకు అంత బలం, బలగం ఉండి కూడా స్వార్థపరుల వల్లే పార్టీని విలీనం చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ మాటలు వింటే.. జనసైనికుల్ని ఇంకా ఏమార్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు స్పష్టమవుతోంది.

పాతికేళ్ల ప్రస్థానం అని కబుర్లు చెప్పి.. ఇప్పుడు సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటూ పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తున్న పవన్ కల్యాణ్ కార్యకర్తల ముందుకొచ్చే సరికి మాత్రం మాటలు కోటలు దాటించేస్తున్నారు. తాను సినిమాల్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్పడానికి, తనపై విమర్శలు చేసే వారిని ఎలా ఎదుర్కోవాలో చెప్పడానికి మాత్రమే రెండు నియోజకవర్గాల కార్యకర్తలను పిలిపించుకుని మాట్లాడారు. కార్యకర్తల్లో ఉన్న అపోహలు పోగొట్టే ప్రయత్నం చేయలేదు కానీ, తన ఓవర్ కాన్ఫిడెన్స్ ని మరోసారి వారిముందుంచారు.

మనం తగ్గేదే లేదు, మన నిజాయితీ, మనలో ఉన్న ఫైర్ వల్లే ఇన్నాళ్లూ రాజకీయాల్లో ఉన్నామని చెప్పిన పవన్ కల్యాణ్.. పార్టీని నడపడంలో తనని తాను ఎన్టీఆర్ తో పోల్చుకున్నారు. ఎప్పట్లానే సుదీర్ఘ ప్రసంగం చేసిన పవన్.. తన రీఎంట్రీపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

ఇప్పుడు చల్లారిందా