పవన్ ప్రసంగం.. కండిషన్స్ అప్లై

అన్ కండిషనల్ గా బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని గతంలో చెప్పారు పవన్ కల్యాణ్. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం పవన్ కి కొన్ని కండిషన్లు పెట్టింది. అలా అయితేనే పార్టీకి ఆర్థిక సాయం అందిస్తామని…

అన్ కండిషనల్ గా బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని గతంలో చెప్పారు పవన్ కల్యాణ్. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం పవన్ కి కొన్ని కండిషన్లు పెట్టింది. అలా అయితేనే పార్టీకి ఆర్థిక సాయం అందిస్తామని మెలిక పెట్టింది. ఆ కండిషన్లలో ప్రధానమైనది సీఏఏ గురించి మాట్లాడటం. నువ్వు ఎక్కడికైనా వెళ్లు, ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకో, ఎవరినైనా విమర్శించు.. కానీ మీటింగ్ లో కచ్చితంగా సీఏఏ, ఎన్ఆర్సీలను ప్రస్తావించాలి. వాటిపై అపోహలు పెంచుకోవద్దని చెప్పాలి.

ఈ కండిషన్ వల్లే తనకు సంబంధం లేకపోయినా కేంద్రం తీసుకొచ్చిన చట్టాల గురించి మాట్లాడుతున్నారు పవన్ కల్యాణ్. వాటి అమలుపై ముస్లింలెవరూ అపోహలు పెట్టుకోవద్దని, కేంద్రం అందరి మంచికే ఆలోచిస్తోందని కర్నూలు సభలో కూడా చెప్పారు పవన్. సుగాలి ప్రీతికి న్యాయం చేయండి అంటూ ర్యాలీ, సభ నిర్వహించిన జనసేనాని.. సందర్భం లేకపోయినా, ఎవరూ అడక్కపోయినా బీజేపీ ఇచ్చిన టాస్క్ పూర్తి చేసిన తర్వాతే స్టేజ్ దిగారు.

ఇక్కడే కాదు, కార్యకర్తలు, నాయకుల మీటింగుల్లో కూడా పవన్ ఇవే విషయాలను పదే పదే గుర్తు చేస్తున్నారని అంటున్నారు. స్థానికంగా బీజేపీ నాయకులతో కలసి సీఏఏకి మద్దతుగా ర్యాలీలలో పాల్గొనాలని జిల్లాల నాయకత్వానికి హుకుం జారీ చేశారు పవన్. ఎక్కడ స్టేజ్ ఎక్కినా బీజేపీని పొగడటం, సీఏఏ కంటే మంచి చట్టం ఇంకేదీ లేదని గొప్పలు చెప్పడం.. ఇవన్నీ పవన్ కి అలవాటయ్యాయి.

జాతీయ, అంతర్జాతీయ అంశాలను కూడా పుస్తక పఠనంతో ఔపోసన పట్టేసే పవన్ కల్యాణ్, ఢిల్లీ ఫలితాలపై మాట్లాడకపోవడం మాత్రం హాస్యాస్పదం. సీఏఏ, ఎన్ఆర్సీ మంచి చట్టాలే అయితే.. మరి ఢిల్లీలో బీజేపీకి అలాంటి ఫలితాలెందుకొచ్చాయి. దేశ ప్రజందరికీ బీజేపీ మంచి చేస్తే, ఢిల్లీ ప్రజలు చీపురు తిరగేసి మరీ ఎందుకు తరిమికొట్టారు. వీటికి సమాధానం చెప్పిన తర్వాతే పవన్ సీఏఏ గురించి మాట్లాడితే బాగుండేది.

ఏకపక్షంగా బీజీపీని సపోర్ట్ చేస్తే వ్యక్తిగతంగా, పార్టీ పరంగా పవన్ చాలా నష్టపోతారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వకీల్ సాబ్.. మీకు అర్థమవుతోందా..?

థ్యాంక్ గాడ్ ఆమెను పెళ్లి చేసుకోలేదు