జగన్ లో మోడీ మరో కేజ్రీవాల్ ని చూశారా..?

చాలా కాలంగా వేచి చూస్తున్న అపాయింట్ మెంట్ ఢిల్లీ ఫలితాల తర్వాత హడావిడిగా సెట్ కావడం, అందులోనూ గంటన్నర సేపు ఏ ముఖ్యమంత్రికీ కేటాయించనంతగా.. ఎక్కువ సమయం వెచ్చించి మరీ ఏపీ సీఎం జగన్…

చాలా కాలంగా వేచి చూస్తున్న అపాయింట్ మెంట్ ఢిల్లీ ఫలితాల తర్వాత హడావిడిగా సెట్ కావడం, అందులోనూ గంటన్నర సేపు ఏ ముఖ్యమంత్రికీ కేటాయించనంతగా.. ఎక్కువ సమయం వెచ్చించి మరీ ఏపీ సీఎం జగన్ తో ప్రధాని మాటలు కలపడం.. ఇవన్నీ చూస్తుంటే ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం మోదీపై గట్టిగానే పడినట్టు కనిపిస్తోంది. అంతేకాదు, జగన్ లో మరో కేజ్రీవాల్ ని కూడా మోదీ చూస్తున్నారనే విషయం అర్థమవుతోంది.

లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినా.. రాష్ట్రాల ఎన్నికల్లో మాత్రం వరుసగా ఎదురవుతున్న ఘోర పరాభవాలు మోదీని అభద్రతా భావంలో పడేశాయి. అదే మోదీలో పరివర్తనకు కారణమైంది. ఎవరెవరు, ఏంటనే విషయాన్ని అర్థం చేసుకుంటున్నట్టున్నారు. ఇందులో భాగంగానే జగన్ కి హడావిడిగా అపాయింట్ మెంట్ ఇచ్చి, అంతసేపు ఆయన మాటలు విన్నారు. వినడమే కాదు.. జగన్ ప్రతిపాదనలన్నిటికీ మోదీ సానుకూలంగా స్పందించారు.

ఇక మోదీ జగన్ ఆహ్వానం మేరకు ఏపీకి వచ్చినా, ఉప్పు భూముల్ని ఇళ్ల స్థలాల కోసం కేటాయించినా అది వైసీపీ విజయమే అవుతుంది. మొత్తమ్మీద ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మోడీలో మార్పునకు శ్రీకారం చుట్టాయంటున్నారు విశ్లేషకులు. ఇప్పటివరకు ఒకెత్తు, ఇకపై మోదీ-షా ద్వయం చేసే పనులు మరో ఎత్తు అని అంచనా వేస్తున్నారు. ఇకపై రాష్ట్రాలకు అనుకూలంగా వ్యవహరించడంతో పాటు, ఒంటెత్తు పోకడలకు వెళ్లరని భావిస్తున్నారు. జగన్ తో సుదీర్ఘంగా మాట్లాడ్డమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఏదైమైనా ఇకనైనా మోడీ-అమిత్ షా రాష్ట్రాల అభ్యంతరాలను పట్టించుకోవాలి. సీఏఏ, ఎన్ఆర్సీ వంటి వాటిపై మొండి వైఖరిని విడనాడాలి. రాష్ట్రాల ఆత్మాభిమానాన్ని అర్థం చేసుకుని, వారి ఆశలకు అనుగుణంగా ప్రవర్తించాలి. ఇదే క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలి.

థ్యాంక్ గాడ్ ఆమెను పెళ్లి చేసుకోలేదు