ఇకపై నో గ్యాప్.. పవన్ కల్యాణ్ 2 పడవల థియరీ

జనసేన పార్టీని స్థాపించినప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. 2014 ఎన్నికలకు వెళ్లినప్పుడు కూడా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల టైమ్ లో ఏకంగా సినిమాలు ఆపేస్తానని కూడా ప్రకటించారు. ఇప్పుడు వరుసగా…

జనసేన పార్టీని స్థాపించినప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. 2014 ఎన్నికలకు వెళ్లినప్పుడు కూడా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల టైమ్ లో ఏకంగా సినిమాలు ఆపేస్తానని కూడా ప్రకటించారు. ఇప్పుడు వరుసగా సినిమాలతోనే తీరిక లేకుండా గడిపేస్తున్నారు పవన్ కల్యాణ్. అలా తన నిర్ణయాలతో విపక్షాలు విమర్శలు చేసేందుకు అవకాశం ఇచ్చారు. అయితే ఇకపై ఈ విషయంలో పవన్ ఫుల్ క్లారిటీకి వచ్చేశారు.

ఎన్నికల టైమ్ లో సినిమాలు ఆపడం.. ఎన్నికల తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకోవడం లాంటివి ఇకపై ఉండవు. ఏ పని దానిదే. ఓవైపు సినిమాలు చేస్తారు, మరోవైపు పాలిటిక్స్ చేస్తారు. ఇలా 2 పడవల ప్రయాణానికి సిద్ధమైపోయారు పవన్ కల్యాణ్.

ఇకపై ఏదీ పక్కనపెట్టరట..!

2022 అంతా సినిమాలు చేసి, 2023 నాటికి పవన్ సినిమాలు పక్కనపెడతారని.. ఏడాది పాటు ఎన్నికల కోసం పనిచేస్తారని ప్రచారం జరిగింది. కానీ పవన్ మాత్రం మరోసారి సినిమాలకు గ్యాప్ ఇచ్చే ఉద్దేశంలో లేరని తెలుస్తోంది. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల్ని పూర్తిచేయడంతో పాటు.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సినిమాలు నిర్మించే బాధ్యతల్ని కూడా భుజానికెత్తుకుంటున్నారు.

2022 చివరి వరకు సినిమాలు చేసి, ఆ తర్వాత నిర్మాతగా మారే ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. అంటే, పవన్ ఓ వైపు పాలిటిక్స్ తో బిజీ అయినప్పటికీ, అతడి బ్యానర్, అతడి సినిమా పనులు మరోవైపు నడుస్తూనే ఉంటాయన్నమాట. దీనికి సంబంధించి ఇప్పట్నుంచే ఓ సెటప్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు పవన్ కల్యాణ్.

గతంలో సినిమాలకు గ్యాప్ ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చారు. ఓడిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వెళ్లారు. ఇప్పుడు మరోసారి అలా గ్యాప్స్ ఇవ్వకుండా రాజకీయాలు చేస్తూనే, సినిమాలు కూడా కొనసాగించాలనుకుంటున్నారు. కాకపోతే ఎన్నికల టైమ్ లో మాత్రం ఫుల్ లెంగ్త్ రాజకీయాలపైనే దృష్టి పెట్టేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఓవైపు నటించడంతో పాటు..నిర్మాతగా కూడా మారి డబ్బు సంపాదించాలనుకుంటున్నారు.

సో.. పవన్ రెండు పడవల ప్రయాణానికి సిద్ధమైపోయారు. ఇకపై ఆయన సినిమాలు చేస్తే రాజకీయాలు చేయరని, పాలిటిక్స్ లోకి వస్తే సినిమాలు చేయరని అనడానికి వీల్లేదు. రెండూ సమాంతరంగా నడుస్తాయన్నమాట. 2024లో ఆయన గెలిచినా, ఓడినా సినిమాలు మాత్రం ఆగవు.