కేసీఆర్ కు పేర్ని కౌంట‌ర్.. రండి రండి!

ఏపీలో తెలంగాణ రాష్ట్ర స‌మితి అంటున్న తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత కేసీఆర్ కు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంట‌ర్ ఇచ్చారు. కేసీఆర్ కు స్వాగ‌తం ప‌లికారు పేర్ని. ఏపీలో కేసీఆర్ నిరభ్యంత‌రంగా…

ఏపీలో తెలంగాణ రాష్ట్ర స‌మితి అంటున్న తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత కేసీఆర్ కు ఏపీ మంత్రి పేర్ని నాని కౌంట‌ర్ ఇచ్చారు. కేసీఆర్ కు స్వాగ‌తం ప‌లికారు పేర్ని. ఏపీలో కేసీఆర్ నిరభ్యంత‌రంగా పోటీ చేసుకోవ‌చ్చ‌ని, అలాగే రాష్ట్రాల‌ను కూడా క‌లిపేస్తే ఇంకా మంచిద‌ని నాని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.రెండు రాష్ట్రాలూ క‌లిసి పోతే కేసీఆర్ హ్యాపీగా పోటీ చేసుకోవ‌చ్చ‌ని.. గ‌తంలో రాష్ట్రం విడిపోకూడ‌ద‌ని వైఎస్ జ‌గ‌న్ రెడ్డి ఆకాంక్షించార‌ని నాని గుర్తు చేశారు.

ఒక‌వైపు హుజూరాబాద్ బై పోల్ లో నెగ్గుకు రావ‌డానికి శ‌త‌థా ప్ర‌య‌త్నిస్తూ.. మ‌రోవైపు ఏపీలో త‌న పార్టీ విస్త‌ర‌ణకు జ‌నాలు ఎదురుచూస్తున్నార‌న్న‌ట్టుగా చెప్పుకొచ్చిన కేసీఆర్ ఈ కౌంట‌ర్ బాగానే ఉంది. ఏపీని కూడా ఏలాల‌ని ఉబ‌లాటంతో ఉన్న కేసీఆర్ .. తెలంగాణ‌ను ఏపీలోకి విలీనం చేసేస్తే లేదా.. ఏపీని క‌లిపి.. పేరుకు తెలంగాణ గానే పెద్ద రాష్ట్రంగా ఏర్ప‌డ‌టానికి సానుకూలంగా ఉన్నా మంచిదే!

విభ‌జ‌న కోసం పోరాడిన వారికి ఇప్పుడు మ‌ళ్లీ ఏపీపై గాలి మ‌ళ్లిన‌ట్టుగా ఉంది. ఉమ్మ‌డి ఏపీ రాష్ట్ర ప్ర‌జ‌ల క‌ష్టార్జితమైన హైద‌రాబాద్ కోస‌మైనా ప్ర‌జ‌లకు రాష్ట్రాల విలీనం ప‌ట్ల ఎలాంటి అభ్యంత‌రం ఉండ‌దు. ప్ర‌త్యేక రాష్ట్రం కోసం పోరాడిన తెలంగాణ ప్ర‌జ‌లకు ముఖ్య‌మంత్రి అయిన కేసీఆరే.. ఏపీ లో పోటీ అంటున్నారు కాబ‌ట్టి.. ఎంచ‌క్కారాష్ట్రాల విలీన‌మే మంచిది!

విలీనం జ‌రిగితే.. ఎంచ‌క్కా కేసీఆర్ పార్టీ ఉమ్మ‌డి ఏపీ వ్యాప్తంగా పోటీ చేసుకోవ‌చ్చు. అలాగే ఏపీ పార్టీలు కూడా తెలంగాణ‌లో పోటీకి  సై అంటాయి. ప్ర‌జ‌లు ఎవ‌రిని ఎన్నుకుంటే వాళ్లు పాల‌కులు. ఇందుకు కేసీఆర్ స‌మ్మ‌తిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టేస్తే స‌రి! మ‌రి దానికి ఆయ‌న రెడీగా ఉన్న‌ట్టేనా?.