అట్ హోం.. వేర్ ఈజ్ పవన్ కల్యాణ్?!

ఒక పార్టీ అధ్యక్షుడుగా తనకు రాజ్ భవన్ లో జరిగే అట్ హోం కార్యక్రమానికి వచ్చే ఆహ్వానాన్ని మాత్రం పవన్ కల్యాణ్ బాగానే వాడుకునే వారు. ప్రతియేటా మిస్ కాకుండా ఆ కార్యక్రమానికి హాజరయ్యేవారాయన.…

ఒక పార్టీ అధ్యక్షుడుగా తనకు రాజ్ భవన్ లో జరిగే అట్ హోం కార్యక్రమానికి వచ్చే ఆహ్వానాన్ని మాత్రం పవన్ కల్యాణ్ బాగానే వాడుకునే వారు. ప్రతియేటా మిస్ కాకుండా ఆ కార్యక్రమానికి హాజరయ్యేవారాయన. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ తప్పకుండా అట్ హోం కార్యక్రమానికి వెళ్తూ వచ్చారు. పవన్ కల్యాణ్ ఎక్కడ కనిపించినా, కనిపించపోయినా అట్ హోం కార్యక్రమంలో మాత్రం తప్పకుండా కనిపించేవారు.

అక్కడ రాజకీయ నేతల మధ్యన పవన్ కల్యాణ్ ఉత్సాహంగా కనిపించేశారు. ఆ కార్యక్రమానికి అన్నిపార్టీల వాళ్లూ వచ్చేవారు. పవన్ కూడా వెళ్లేవారు. అయితే అదంతా గత ఐదేళ్ల ముచ్చటలాగుంది. ఈసారి పవన్ కల్యాణ్ కూడా అట్ హోం కార్యక్రమానికి హాజరుకాలేదు. ఈసారి ఏపీకి సంబంధించి ఆ కార్యక్రమాన్ని అమరావతిలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరుకాలేదు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కమ్యూనిస్టు పార్టీల ఏపీ విభాగం నేతలు, బీజేపీ ఏపీ విభాగం అధ్యక్షుడు తదితర పార్టీల నేతలు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతియేటా ఆ ప్రోగ్రామ్ కు మిస్ కాకుండా హాజరవుతూ వచ్చిన పవన్ కల్యాణ్ మాత్రం ఈసారి అటెండ్ కాలేదు. 

గవర్నర్ గా నరసింహన్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పవన్ ఆ ప్రోగ్రామ్ కు హాజరవుతూ వచ్చారు. ఇప్పుడు కొత్త గవర్నర్ వచ్చారు. కొత్త ముఖ్యమంత్రి ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అయితే పవన్ మాత్రం ఆ ఛాయలకు వెళ్లలేదు! రొటీన్ ఇన్విటేషన్ అయితే ఆయనకు వెళ్లి ఉంటుంది. అయినా ఆ ప్రోగ్రామ్ కు పవన్ ఎందుకు హాజరుకాలేదో మరి!

దేవరకొండ షేక్‌ అయ్యాడు

సినిమా రివ్యూ: ఎవరు   సినిమా రివ్యూ: రణరంగం