గంజాయి పై ఉక్కు పాదమే…

గంజాయి విషయంలో ఏపీ సర్కార్ సీరియస్ గా ఉంది. ఇదే విషయాన్ని కొద్ది రోజుల కిందట డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. విశాఖ జిల్లా కేంద్రంగా గంజాయి రవాణా…

గంజాయి విషయంలో ఏపీ సర్కార్ సీరియస్ గా ఉంది. ఇదే విషయాన్ని కొద్ది రోజుల కిందట డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. విశాఖ జిల్లా కేంద్రంగా గంజాయి రవాణా పెద్ద ఎత్తున సాగుతోంది అంటూ టీడీపీ సహా విపక్షాలు భారీ ఎత్తున ఆరోపిస్తున్న నేపధ్యంలో పోలీసులు దీన్ని సవాల్ గా తీసుకున్నారు.

విశాఖ ఏజెన్సీలో గంజాయిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు అన్ని రకాల చర్యలను చేపడుతున్నారు. దీని మీద విశాఖ నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా మాట్లాడుతూ గంజాయి పైన ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. విశాఖ సిటీలో గంజాయి రవాణా పెద్దగా లేదని కూడా క్లారిటీ ఇచ్చారు.

ఇక గంజాయి సహా అన్ని మాదక ద్రవ్యాల వినియోగాన్ని మానాలంటూ యువతను చైతన్యం చేస్తామని చెప్పారు. గంజాయి వద్దు, చదువే ముద్దు అంటూ కళాశాలలలో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. మరోవైపు లిక్విడ్ గంజాయి మీద కూడా పూర్తి అవగాహన ఉందని, దాన్ని అరికట్టేందుకు కంప్లీట్ యాక్షన్ ప్లాన్ రెడీ అయిందని చెప్పారు.

ఒక వైపు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న వారి మీద కేసులు పెడుతూనే వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామని సిన్హా వెల్లడించారు. మొత్తానికి గంజాయి విషయంలో పోలీసులు డేగ కళ్ళతోనే చూస్తున్నారు. సో..మత్తు బాబులు చిత్తు కాక తప్పదంతే.