Advertisement

Advertisement


Home > Politics - Political News

పదవి రెన్యూవల్ కాగానే అయ్యన్న ఆయాసం

పదవి రెన్యూవల్ కాగానే అయ్యన్న ఆయాసం

బీసీలు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అయితే ఇది ఒకప్పటి మాట. గత ఏడాది నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో బీసీలు గంపగుత్తగా వైసీపీకి ఓట్లేశారు. ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల్లో 80 శాతానికి పైగా బీసీలు జగన్ కి జై కొట్టారు.

దీంతో టీడీపీ కంచుకోట కాస్తా మంచుకోట అయిపోయింది. ఆ తరువాత కూడా జగన్ సర్కార్ లో  బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. తాజాగా 56 కార్పోరేషన్లను ప్రత్యేకంగా బీసీల కోసం ఏర్పాటు చేసి దేశంలోనే కొత్త చరిత్ర సృష్టించారు.

దాంతో టీడీపీ గంగవెర్రులెత్తుతోంది. విజయదశమికి ప్రకటించాలనుకున్న టీడీపీ కార్యవర్గాలు కూడా ఆదరాబాదరాగా ఇపుడే ప్రకటించడం వెనక జగన్ దూకుడే కారణమని చెబుతారు. మొత్తానికి బీసీలకు టీడీపీ అధినేత‌ పార్టీ పదవులు ఇచ్చారు.కానీ అధికార పదవులు జగన్ ఇవ్వడాన్ని చూసి టీడీపీ తమ్ముళ్ళకు వణుకు పుడుతోంది.

టీడీపీ అధినాయకత్వం సైతం బీసీ నేతలను రంగంలోకి దించుతోంది. దీంతో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు బీసీలకు వైసీపీ ఏమీ చేయలేదంటూ తనదైన విమర్శలు స్టార్ట్ చేశారు. ఓట్లు వేయించుకుని బీసీలను అలా వదిలేయడమేనా అంటూ నిగ్గదీస్తున్నారు.

బీసీలకు నిన్నగాక మొన్ననే పెద్ద ఎత్తున పదవులు జగన్ సర్కార్ ఇస్తే అలా వదిలేస్తారా అంటూ అయ్యన్న అభాండాలు వేయ‌డాన్ని ఫస్ట్రేషన్ గానే చూడాలని వైసీపీ నేతలు అంటున్నారు.

ఇక అయ్యన్నకు పొలిట్ బ్యూరో పదవి మరోమారు రెన్యూవల్ అయింది. దాంతో ఆ ఉత్సాహంతో ఆయాసం తెచ్చుకుని మరీ వైసీపీ మీద బురద జల్లేందుకు రెడీ అయ్యారని వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.  మరి చూడాలి ఈ బీసీ యుద్ధం ఎంతదాకా సాగుతుందో. 

ఈ విష‌యంలో సీజేఐ మౌనాన్ని వీడ‌టం మంచిది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?