Advertisement

Advertisement


Home > Politics - Political News

విశాఖ రాజ‌ధానిపై.. ఒక ఉత్త‌రాంధ్ర వాసి స్పంద‌న ఇది!

విశాఖ రాజ‌ధానిపై.. ఒక ఉత్త‌రాంధ్ర వాసి స్పంద‌న ఇది!

విశాఖ మూడు రాజ‌ధానుల్లో ఒక‌టిగా వ‌ద్ద‌ని కొంత‌మంది తెలుగుదేశం సానుభూతి ప‌రులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్ర‌బాబు నాయుడు అయితే విశాఖ రాజ‌ధానిగా వ‌ద్దంటూ ఆ ఊరి వాళ్లే రోడ్డెక్కాల‌న్నారు‌. త‌న కుల‌ అమ‌రావ‌తి కోసం వాళ్లు పోరాడాలంటూ పిలుపులు ఇస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఒక ఉత్త‌రాంధ్ర వాసి, డాక్ట‌ర్ అయిన జీవితేశ్వ‌రరావు దువ్వాడ రాసిన ఒక ఫేస్ బుక్ పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. విశాఖ రాజ‌ధాని అనే అంశం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న‌దానికి, తెలుగుదేశం వాదిస్తున్న దానికి సంబంధించిన అనేక డౌట్ల‌ను క్లియ‌ర్ చేస్తూ, ఒక స‌గ‌టు ఉత్త‌రాంధ్ర వాసి ఈ అంశంపై ఎలా స్పందిస్తున్నారు అనేందుకు రుజువుగా ఆ పోస్టు.

''ఉత్తరాంధ్ర చివర ఉన్న ఆంధ్రప్రదేశ్ నుండి ఒరిస్సా రాజధాని భువనేశ్వర్190 కిలోమీటర్లు. అలాగే చత్తీస్ గడ్ రాజధాని రాయపూర్ 350 కిలోమీటర్లు. పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా600 కిలోమీటర్లు దూరం.అయితే ఉమ్మడి మద్రాసు ఉన్నపుడు మద్రాసు నగరం మాకు 1050కిలోమీటర్లు దూరం.

ఇదివరకు ఉన్న హైదరాబాద్ రాజధాని1000కిలోమీటర్లు దూరం ఉండేది.అప్పుడు మమ్మల్ని ఎవరూ ఎప్పుడూ అయ్యో మీకు రాజధాని అంత దూరంలో ఉందా..మీకు కనీసం హైకోర్టు బెంచ్ అయినా అవసరమేమో..కనీసం అసెంబ్లీ సమావేశాలు వేసవిలో విశాఖ లో పెట్టే ఆలోచన చేయలేదు.ఎందుకంటే ఇక్కడ నాయకత్వం లేదు.వలసల జిల్లాలు.ఇప్పుడు మాత్రం విశాఖ కార్యనిర్వాహక రాజధాని అని ప్రతిపాధన ప్రభుత్వం చేసేసరికి విశాఖ నుండి అల్లక్కడకు అంత దూరం ఇంత దూరం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కొందరు.

చంద్రబాబు ఏకపక్షంగా ఎటువంటి ముందు చర్చలు లేకుండా.. కనీసం 2014 ఎన్నికల ముందు ప్రచారంలోకూడా రాజధాని ఎక్కడ అనే అంశాన్ని చెప్పకుండా.. కోట్లరూపాయల ఖర్చు తో శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టును గాలికొదిలేసి డైరెక్ట్ గా అసెంబ్లీ లో అమరావతి అని నిర్ణయం చేసేస్తే ఎవ్వరూ కాదనలేకపోయారు.కాదు అని అనలేకపోయిన పరిస్థితి చంద్రబాబు కల్పించారు.

గత ప్రభుత్వ కాలంలో రాజధాని డిజైనింగ్ ..దానికి సినిమా సెట్టింగులు వేసుకునేవారితో సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులు చర్చలు మొదలగు జుగుప్సాకరమైనటువంటి చర్యలుచూశాం.ఇప్పటికే అమరావతి అంటే ఎక్కడ ఉందో ఏరైలెక్కి ఎక్కడ దిగి ఎక్కడ నుండి ఎక్కడకు వెళ్ళి ఎలా చేరాలో ఉత్తరాంధ్ర ప్రజలకు చాలమందికి తెలియదు.

చంద్రబాబు తన హయాంలో విశాఖ లో చాల సమిట్ లు నిర్వహించారు.విదేశీ పెట్టుబడులు విశాఖ లో పెట్టడానికి అనేక కంపెనీలు ముందుకు వచ్చేవి.అంతా అయిన తర్వాత చంద్రబాబు అమరావతి రమ్మని అక్కడ కంపెనీలు స్తాపించమని చెప్పేవారు.ఎవరూ వెళ్ళేవారు కాదు.ఈ వివక్షత మాకు తెలుసు.అయినా చేసేదేమీలేక ఊరుకున్నాం.

ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానులు ప్రకటించారు.ఉత్తరాంధ్ర ప్రజలు చాల సంతోషించారు.వలసల బ్రతుకులు ఎప్పుడూ తప్పవు.అయితే తమ కుటుంబానికి వారాంతరం కలుసుకోవచ్చు.తమ వ్వవసాయం తామే చేసుకోవచ్చు.ఉపాది దగ్గరగా ఉంటుందని సంతోషించే సమయంలో చంద్రబాబు అత్యంత కిరాతకంగా,నగ్నంగా, పచ్చిగా బరితెగించి విశాఖపట్నం ని కార్యనిర్వాహక రాజధానిగా వద్దంటే వద్దని చెప్పడం ఉత్తరాంధ్ర ప్రజలకు మింగుడు పడని అంశం.పైగా అయన తన వారి చానళ్ళలో పత్రికలలో 24 గంటలు విశాఖ పై విషం జల్లుతూ..చివరకు విశాఖపట్నం దగ్గర సముద్రం ముక్కలైపోతుందని...అసలు విశాఖపట్నమే ఉండదన్నట్టుగా అత్యంత దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారు.

ఈప్రచారకులు ఎవరంటే ...విశాఖ లో హోటళ్ళు..సినిమా హాల్లు..పరిశ్రమలు..సినిమా స్టూడియోలు..విద్యాసంస్థలు..హకార్పోరేట్ హాస్పిటల్స్ .. మీడియా సంస్థలు ఇంకా చెప్పుకొని పోతే ఇంకా ఎన్నో.

ఇదేకాక చంద్రబాబు చేయిస్తున్న ఇంకో గమ్మత్తు చూద్దాం. అమరావతి పరిశర ప్రాంత జిల్లాలలోనుంచి విశాఖ లో ఉపాది ఉద్యోగం వ్యాపారం చేయడానికి వచ్చినవారు తాము ఉత్తరాంధ్రులమని తమకు విశాఖ లో కార్యనిర్వాహక రాజధాని వద్దని..విశాఖ రాజధాని అయితే విశాఖ లో ప్రశాంతతకు భంగమని దుర్మార్గపు దుష్ప్రచారం తమ మీడియా ద్వారా చేయిస్తున్నారు.

ఇంకొంచం ముందుకడుగేసి విశాఖ రాజధాని అయితే రాయలసీమ నుంచి రౌడీలు వచ్చేసి విశాఖ నగరానికి ప్రశాంతత కు బంగమని ప్రచారం చేసి రాయలసీమ ప్రజలమనోభావాలను అవమానిస్తున్నారు.రౌడీలు అన్నిచోట్లాఉంటారు.అలా వారు అనుకున్నట్టైతే అమరావతి కి రాయలసీమే దగ్గర.వారనుకున్నట్టైతే అమరావతిలో నే రౌడీయిజం ఎక్కువగా పెరిగే అవకాశం ఉండొచ్చు. ఈ రాయలసీమ .....రౌడీయిజం అనే విషయం మేము అనుకోవడం లేదు.

రాజధాని ని మూడు భాగాలుగా విభజించి పంటపొలాల్ని అమరావతి అని నామకరణంచేయబడిన ప్రాంతంలో లెజిస్లేటివ్ రాజధాని ఉంటుంది అని ప్రభుత్వం చెబుతుంటే అక్కడే రాజ్ భవన్ ఉంటుంది.అందులో గవర్నర్ ఉంటారు.అక్కడే అసెంబ్లీ ఉంటుంది.అందులో సంవత్సరానికి సుమారు వందరోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి.

ఆసంధర్భంగా ఆ వందరోజులు ముఖ్యమంత్రి ..ప్రతిపక్షనాయకుడు..అసెంబ్లీ స్పీకర్.. మంత్రులు..ఎం.ఎల్.ఏలు..హైకోర్టు బెంచ్...మినిస్టీరియల్ స్టాఫ్ మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇంకా మరెన్నో ఉద్యోగ వాణిజ్య వ్యాపార సముదాయాలు ఉంటాయని ప్రభుత్వం చెపుతూ...సెక్రటేరియట్, ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖపట్నం లో ఉంటాయని చెపుతున్నారు.

అలాగే హైకోర్టు కర్నూలు లో ఉండేవిధంగా చేసి రాష్ట్రంలో ని మూడు ప్రాంతాలు విభిన్నమయినవి కాబట్టీ మూడు ప్రాంతాలలో అభివృద్ధి సమానంగా జరగాలి అని ప్రభుత్వం చెపుతుంటే.....అబ్బే అలాకాదు అన్నీ అమరావతి లోనే ఉండాలంటే ఎలా..ఎవరు ఒప్పుకుంటారు..ఆరోజులు పోయాయి...ఒకడైతే బ్యాంకులకు కన్నాలేసేసి రాజధాని అమరావతి నుంచి ఇంచీ కూడా కదలనివ్వనంటాడు.. గతంలో లా రాష్ట్రంలో బడ్జెట్ అంతా హైదరాబాద్ లో పెట్టేసి హైదరాబాద్ డవలప్ అయితే రాష్ట్రం డెవలప్ అయినట్టే అని అనుకుని రాష్ట్ర విభజనకు కారణమయ్యింది.

అందువలన.అన్ని మౌళిక వసతులున్న విశాఖ లో మూడోవంతు రాజధాని వద్దు...ఏమీలేని పంట పొలాల్లో రాష్ట్రంలో ఐదు కోట్లమందిని అడుక్కుతినమని రాష్ట్ర.ప్రజలు చంద్రబాబు చెప్పినట్టు ఊడిగం చేయడానికి ఎవరూ సిద్దంగా లేరు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించి ప్రజల మనోభావాలను ఆత్మగౌరవ ాన్ని సెంటిమెంట్ ను గౌరవించాలి.''

-జీవితేశ్వ‌రరావు దువ్వాడ‌

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?