Advertisement

Advertisement


Home > Politics - Political News

తప్పులు ఒప్పుకున్న చంద్రబాబు

తప్పులు ఒప్పుకున్న చంద్రబాబు

వైసీపీ రాజీనామాలకు 48 గంటలు డెడ్ లైన్ పెట్టిన చంద్రబాబు తన డిమాండ్ ని అధికార పక్షం నెరవేర్చకపోయేసరికి ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నారు. ప్రతి రోజూ జూమ్ యాప్ లో బైటకొచ్చి అరగంట  సేపు సుదీర్ఘ సుత్తి కొట్టి మరీ విసిగిస్తున్నారు. తాజా జూమ్ మీట్ లో ఐదేళ్ల పాలనలో వివిధ జిల్లాలకు తాను ఏం చేశాననే విషయాన్ని ఏకరువు పెట్టారు బాబు.

అంతా బాగానే ఉంది కానీ.. ఆయన ప్రసంగం విన్నవారెవరికైనా చంద్రబాబు ఏం చేశారనే విషయం అర్థం కాలేదు. ఏం చేయలేకపోయారనేదే తెలుస్తోంది. ఎందుకు చేయలేకపోయారనే ప్రశ్న వస్తోంది. అలా ఉన్నాయి చంద్రబాబు మాటలు. ఐదేళ్ల కాలంలో తాను వివిధ పోర్ట్ లకు నాంది పలికానన్నారు బాబు. ఒక్క పోర్ట్ పనులు కూడా మొదలు కాలేదు. అంతా పేపర్ వర్క్ మాత్రమే. ఐదేళ్లలో అసలు ఏ ఒక్క కొత్త ఓడరేవునీ అభివృద్ధి పరచలేకపోయారు బాబు.

ఇక సాగునీటి ప్రాజెక్ట్ ల విషయానికొద్దాం. పోలవరం సహా అనేక ఇతర ప్రాజెక్ట్ లు చంద్రబాబు హయాంలో నత్తనడకన ముందుకు సాగాయి. ఈ విషయాన్ని చంద్రబాబే ఒప్పుకున్నారు. తాము ప్రారంభించిన ప్రాజెక్ట్ లకు వైసీపీ నిధులు కేటాయించకపోవడంతో పూర్తి కాలేకపోయాయి అన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు పూర్తి చేయలేని ప్రాజెక్టుల్ని, 14 నెలల్లో వైసీపీ ఎలా చేస్తుంది? ఆమాత్రం లాజిక్ తెలియకుండా తన తప్పులన్నీ ఒప్పుకున్నారు బాబు.

పోలవరాన్ని ఫలహారంగా మార్చుకున్న చంద్రబాబు.. మిగతా ప్రాజెక్ట్ లతో ఎలా జేబులు నింపుకుందీ ఇప్పుడు జనాలకు అర్థమైంది.

నదుల అనుసంధానానికి ప్రణాళికలు రచించామని కూడా చెప్పారు చంద్రబాబు. ఆమాత్రం ప్రణాళిక రచించడానికి ఐదేళ్లు అవసరమా? అసలు ఆ దిశగా ఎంతమేరకు పనులు జరిగాయో చంద్రబాబుకే తెలియాలి. ఇక పెట్టుబడుల కోసం అనేక సమావేశాలు పెట్టామని, ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పుకొచ్చారు బాబు. కేవలం ఎంఓయూల కోసమే చంద్రబాబు ఐదేళ్లు ఖర్చు చేశారు. మరి ఏడాదిన్నరలో జగన్ ఏంచేయాలి, ఎలా చేయాలి.

ఇలా ప్రతి విషయంలో చంద్రబాబు సెల్ఫ్ గోల్స్ వేసుకున్నారు. ఐదేళ్లలో తాను ఏమీ చేయలేకపోయానని, తాను వదిలి పెట్టిన పనుల్ని జగన్ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తెలియకుండానే తన తప్పుల్ని నిస్సిగ్గుగా జూమ్ లో ఒప్పేసుకున్నారు. వైసీపీ నేతలు కనీసం విమర్శించడానికి కూడా ఏమీ లేకుండా తన బండారం తానే బైటపెట్టుకున్నారు.

10 ప్యాక్ తో వస్తున్నా

మెగాస్టార్ అస్సలు తగ్గట్లేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?