Advertisement

Advertisement


Home > Politics - Political News

చంద్రబాబు మీడియా మైండ్ గేమ్

చంద్రబాబు మీడియా మైండ్ గేమ్

సజ్జలకు, విజయసాయికి మధ్య విభేదాలు సృష్టించాలని చూశారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయికి మధ్య చిచ్చుపెట్టాలనుకున్నారు. ఏకంగా విజయసాయి-జగన్ మధ్యే అగాధం ఉన్నట్టు రాసుకొచ్చారు. మంత్రి పుష్పశ్రీవాణి ఓ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారని, మైనార్టీ మంత్రి ఓ సందర్భంలో జగన్ పైనే అసంతృప్తి వ్యక్తం చేశారని.. కథనాలు రాశారు. అయితే ఇవన్నీ వేటికవే వేర్వేరు సందర్భాలు. ఇదంతా టీడీపీ, దాని అనుకూల మీడియా మైండ్ గేమ్ అని అందరికీ తెలిసిన విషయమే.

కరడుగట్టిన పచ్చ మీడియా వైసీపీలో చిచ్చుపెట్టాలని చూసింది కానీ ఈనాడు పత్రిక మరీ ఇంత దిగజారకుండా కాస్త సంయమనం పాటించింది. కానీ ఇప్పుడు వారికి కూడా ఓ చిన్న లింక్ దొరికింది. వరుసగా వైసీపీలో సీనియర్ నాయకులు కాస్త స్వరం పెంచుతుండే సరికి.. "ఈనాడు"లో కూడా 'అధికార పార్టీలో అసంతృప్తి సెగలు' అనే ఆర్టికల్ పడింది. మిగతావాళ్లు ప్రతి చిన్నదాన్నీ రాద్ధాంతం చేశారు, "ఈనాడు" సరిగ్గా అవకాశం కోసం ఎదురు చూసింది అంతే తేడా.

మొత్తమ్మీద ఏడాది పాలన తర్వాత అధికార వైసీపీలో ఏదో జరుగుతోంది అనే మెసేజ్ అయితే ప్రజల్లోకి వెళ్లింది. అధికార పార్టీ అనుకూల మీడియాలో సహజంగానే మంత్రులు, వారి కార్యక్రమాలకి ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. మిగతా ఎమ్మెల్యేల వార్తలు పెద్దగా పట్టించుకునేవారు కాదు. అదే సమయంలో సీనియర్ల వాయిస్ కూడా పెద్దగా వినిపించేది కాదు. స్థానికంగా కొన్ని సమస్యలున్నా వాటిని లైట్ తీసుకునేవారు.  

ఇటు సొంతపార్టీ మీడియా పట్టించుకోక, అటు ప్రతిపక్ష మీడియాని పిలవలేక చాలామంది నాయకులు సతమతమయ్యారు. తమ సమస్యలు బైటకు చెప్పుకునే మార్గమే వారికి రాలేదు. అధికారులకు వినతిపత్రాలిచ్చినా అదంతా మీడియాలో రాకుండానే సైలెంట్ గా జరిగిపోయింది. కానీ ఏడాది కాలంలో కాస్తో కూస్తో నిర్లక్ష్యానికి గురయ్యామనే భావన రావడంతోనే సీనియర్లంతా ఒక్కసారిగా బైటపడాల్సి వచ్చింది.

అగ్నికి ఆజ్యం పోసినట్టు చంద్రబాబు మీడియా వీరందర్నీ ఒకేతాటిపై కలిపే ఆలోచన చేస్తోంది. అందరి సమస్యలను గుదిగుచ్చి వరుసగా కథనాలిస్తోంది. ఆయన మాట్లాడాడు కదా అని ఈయన, ఈయన ముందుకొచ్చాడు కదా అని ఇంకో ఆయన.. ఇలా అందరూ లేనిపోని ధైర్యం తెచ్చుకుని ప్రతిపక్షాల వలలో పడుతున్నారు, తమ అసంతృప్తిని పార్టీ వేదికపైనో లేదా పార్టీ పెద్దల దగ్గరో కాకుండా బహిరంగంగా వెళ్లగక్కారు. ఇదే ఇప్పుడు వైసీపీలో కలకలం రేపుతోంది.

కొంతమందికి ఇదొక చెడ్డ అలవాటుగా మారే ప్రమాదం ఉంది. అరె, మన నియోజకవర్గంలో కూడా ఇలాగే జరిగింది కదా, మనమెందుకు సైలెంట్ గా ఉన్నాం, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయాలి కదా అనే ఉద్దేశంతో మరికొంతమంది ఎమ్మెల్యేలున్నారు. అధికారంలో ఉన్నది మనమే కదా అనే నిజాన్ని మర్చిపోతున్నారు. సరిగ్గా ఈ బలహీనతనే ప్రతిపక్షం, వారి అనుకూల మీడియా అందిపుచ్చుకుంటున్నాయి. వీలైనంతగా సెగల్ని ఎగదోసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ మైండ్ గేమ్ కి ని వైసీపీ అధిష్టానం ఎంత త్వరగా ఎదుర్కుంటే అంత మంచిది. 

వెళ్ళేది ఎవరు? పిలిచేది ఎవరు?

గృహ‌మే లేకుండా ప్ర‌జ‌ల‌తో గృహ ప్ర‌వేశం చేయించిన ఘ‌నుడు చంద్ర‌బాబు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?