cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఫస్ట్ వికెట్ పడింది.. చినబాబులో టెన్షన్ మొదలైంది

ఫస్ట్ వికెట్ పడింది.. చినబాబులో టెన్షన్ మొదలైంది

ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణంలో ఫస్ట్ వికెట్ పడింది. ఇప్పటి వరకూ ఆరోపణలే వినిపించగా ఇప్పుడు అరెస్ట్ లు మొదలయ్యాయి. తొలి అరెస్ట్ తో టీడీపీలో, ముఖ్యంగా చినబాబులో టెన్షన్ మొదలైంది. ఇన్నాళ్లూ మా అవినీతి నిరూపించండి, సాక్ష్యాలు చూపించండి అంటూ గోల చేసిన లోకేష్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు.

టీడీపీ హయాంలో జరిగిన అనేక అవినితీ అక్రమాల్లో ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం కూడా ఒకటి. నీరు-చెట్టు లాంటి స్వయం ప్రకటిత కార్యక్రమంలో ఎలా మేత మేశారో, కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పిన ఫైబర్ నెట్ ప్రోగ్రామ్ తో కూడా అలాంటి అక్రమాలకే తెరతీశారు టీడీపీ నేతలు. అయితే ఇది పెద్ద స్థాయిలోనే ఆగిపోయింది. మొత్తం లోకేష్ దీన్ని తన కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు. అప్పట్లో ఐటీ శాఖ మంత్రి కూడా కావడంతో లోకేష్ కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగింది.

ఈ వ్యవహారంలో ఇటీవల సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో లోకేష్ లో వణుకు మొదలైంది. ఏ-1, ఏ-2 అందరూ చినబాబు సన్నిహితులే. అయితే ముందుగా ఏ-2 స్థానంలో ఉన్న ఇన్ ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ కె.సాంబశివరావు అరెస్ట్ కావడం విశేషం. కోర్టు అక్టోబర్ 1 వరకు రిమాండ్ విధించడంతో ఆయన్ను మచిలీపట్నం సబ్ జైలుకి పంపించారు.

పెద్ద తలలందరికీ బ్యాండ్ బాజానే..

సాంబశివరావుతో కదలిన తీక.. మొత్తం డొంకనే బయటపెట్టబోతోంది. టెరా సాఫ్ట్ అనే కంపెనీకి అర్హత లేకపోయినా సెట్ టాప్ బాక్స్ లు సమకూర్చే కాంట్రాక్ట్ కట్టబెట్టారనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించారని, అవి ఫేక్ అని తెలిసినా కూడా సాంబశివరావు టెరా సాఫ్ట్ కి అనుకూలంగా వ్యవహరించారని స్పష్టమైంది. దీంతో ఆయనను మొదటగా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ గవర్నెన్స్ అథారిటీ మాజీ సభ్యుడు వేమూరి హరి ప్రసాద్ కి కూడా త్వరలోనే జైలు గతి పడుతుందని అంటున్నారు.

మొత్తం 19మందిపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సీఐడీ విచారణ తర్వాత ఈ కుంభకోణానికి బాధ్యులైనవారందర్నీ బయటకు రప్పిస్తామని అన్నారు ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి. వారిలో ఐఏఎస్ అధికారులు కూడా ఉండొచ్చని ఆయన చెప్పారు. దీంతో మరికొందరిలో గుబులు మొదలైంది.

లోకేష్ ఊచలు లెక్కబెట్టాల్సిందేనా?

అయితే అంతిమంగా ఇది లోకేష్ మెడకే చుట్టుకుంటుందనేది మాత్రం వాస్తవం. ఫైబర్ నెట్ కుంభకోణంపై టీడీపీ వాదన మరోలా ఉంది. 24 వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టికల్ లైన్ వేయడానికి 4వేల కోట్ల రూపాయలు ఖర్చవు అవుతుందని, ఇలాంటిది దాన్ని 330 కోట్లతోనే టీడీపీ పూర్తి చేసిందని, అప్పట్లో ప్రధాని మోదీ కూడా తమకు కితాబిచ్చారని టీడీపీ నేతలంటున్నారు. 

టెరా సాప్ట్ కుంభకోణంపై స్పందించకుండా తప్పించుకుంటున్నారు. ఇప్పటికే గత మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర.. ఊచలు లెక్కబెట్టి బయటకొచ్చారు. ఇక లోకేష్ కి కూడా ఆ సత్కారం జరుగుతుందని అంటున్నారు. 

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×