Advertisement

Advertisement


Home > Politics - Political News

ఝ‌ల‌క్...జ‌గ‌న్‌కా? ఎల్లో బ్యాచ్‌కా?

ఝ‌ల‌క్...జ‌గ‌న్‌కా? ఎల్లో బ్యాచ్‌కా?

కేంద్రం ప్రకటించిన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)తో ఏపీ సీఎం జ‌గ‌న్‌కు మోడీ స‌ర్కార్ ఝ‌ల‌క్ ఇచ్చింద‌ని రెండురోజులుగా ఎల్లో బ్యాచ్ తెగ హ‌డావుడి చేయ‌డాన్ని చూస్తున్నాం. దీనికి కార‌ణం ప్ర‌భుత్వ బ‌డుల్లో ఒక‌టి నుంచి ఆరో త‌ర‌గ‌తి వ‌ర‌కు ఆంగ్ల మాధ్య‌మంలో చ‌దువు చెప్పించాల‌నే జ‌గ‌న్ నిర్ణ‌యానికి మోడీ స‌ర్కార్ నూత‌న విద్యా విధానంతో మోకాల‌డ్డింద‌ని ప్ర‌తిప‌క్షాలు, ఎల్లో మీడియా త‌మ పైశాచిక ఆనందాన్ని ప్ర‌ద‌ర్శించాయి.

అయితే 48 గంట‌లు కూడా గ‌డ‌వ‌క‌నే త‌మ వార్త‌ల్ని తాము ఖండించుకునేలా ఎల్లో ప‌త్రిక‌లు వార్త‌ల‌ను ప్ర‌చురించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. రెండురోజులుగా ఐదో త‌ర‌గ‌తి వ‌ర‌కు మాతృభాష‌లోనే ఇక విద్య అంటూ ఊద‌ర‌గొట్టిన ఎల్లో చాన‌ళ్లు, ప‌త్రిక‌లు...ఆ త‌ర్వాత వాస్త‌వం బోధ‌ప‌డి తోక ముడిచాయి.

శుక్ర‌వారం త‌మ ప‌త్రిక‌ల్లో  కేంద్రం ప్రకటించిన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో భాగంగా.. ఐదోతరగతి వరకూ అమ్మ భాషలోనే విద్యావిధానం అమలు సాధ్యమేనా? ఈ డిమాండ్‌ 1964 నుంచే ఉన్నా.. పలు కమిషన్లు, కమిటీలు సిఫారసులు చేసినా.. ఇప్పటి వరకు ఎందుకు అమలు కాలేదు? అంటూ ప్ర‌శ్నిస్తూ క‌థ‌నాలు రాయ‌డం వాటికే చెల్లింది.

‘మాతృభాష/స్థానిక భాషలో ఐదో తరగతి వరకూ విద్యాబోధన ఉండాలనేదే జాతీయ విద్యావిధానం ఉద్దేశం., అయితే.. అది సలహా మాత్రమే. తప్పని సరి కాదు.  త్రిభాషా విధానం ఉంటుందని, నిర్ణయాధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలదే’ అని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ అధికారి చెప్పుకొచ్చార‌ని నిన్నంతా జెజ్జ‌న‌క తొక్కిన ప‌త్రిక‌లు శుక్ర‌వారం యూట‌ర్న్ తీసుకుంటూ రాశాయి. అలాగే మ‌రో ప్ర‌ముఖుడి అభిప్రాయాన్ని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. ‘ఏ భాషనూ ఎవరిపైనా రుద్దడం లేదు. బోధనా మాధ్యమంలో ఏ భాషనైనా ఎన్నుకోవచ్చు’ అని జాతీయ విదావిధానం ముసాయిదా కమిషన్‌ చైర్మన్‌ కస్తూరి రంగన్ అన్న‌ట్టు ఇవే ప‌త్రిక‌లు రాయ‌డం గ‌మ‌నార్హం.  

అయినా ఏపీలో ఆంగ్ల మాధ్య‌మం అమ‌లు కాకూడ‌ద‌నే ప‌ట్టుద‌ల ప్ర‌తిప‌క్షాలు, ఎల్లో మీడియాకు ఎందుకు?  త‌మ పిల్ల‌ల మాదిరిగానే బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు చ‌దువుకోకూడ‌దా? ఇంగ్లీష్ చ‌దువు కేవ‌లం చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రామోజీ, రాధాకృష్ణ త‌దిత‌ర జ‌గ‌న్ వ్య‌తిరేక పిల్ల‌ల హ‌క్కా? ఇంత‌కూ  తాజాగా కేంద్రం ప్ర‌క‌ట‌న‌తో ఝ‌ల‌క్‌...జ‌గ‌న్‌కా? ఎల్లో బ్యాచ్‌కా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?