Advertisement

Advertisement


Home > Politics - Political News

అంత్యక్రియల తర్వాత అసలు నిజం తెలిసింది

అంత్యక్రియల తర్వాత అసలు నిజం తెలిసింది

వయసు 65 సంవత్సరాలు కావడంతో గుండెపోటు వచ్చి ఉంటుందని భావించారు. వెంటనే అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత అనుమానం వచ్చి చూస్తే అసలు విషయం బయటపడింది. అది గుండెపోటు కాదు, రోడ్డు యాక్సిడెంట్. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.

జిల్లాలోని మాచర్లకు చెందిన దానం శివప్రసాద్ కు మంచి పేరుంది. ఆయన ఓ రచయిత, రిటైర్డ్ టీచర్ కూడా. ఈనెల 12న మార్నింగ్ వాక్ కు వెళ్లిన శివప్రసాద్ రోడ్డు పక్కన పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గుండెపోటు వచ్చి ఉంటుందని అంతా భావించారు. అంతిమ సంస్కారాలు కూడా పూర్తిచేశారు.

అయితే 65 ఏళ్లొచ్చినా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే వ్యక్తికి హార్ట్ ఎటాక్ రావడం ఏంటని బంధువులు అనుమానం వ్యక్తంచేశారు. దీంతో కుటుంబ సభ్యులే రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు. సమీపంలోని పెట్రోల్ బంకులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అసలు విషయం బయటపడింది.

ఆరోజు మార్నింగ్ వాక్ కు వెళ్లిన శివప్రసాద్ యాక్సిడెంట్ కు గురయ్యారు. ఓ వ్యక్తి బైకుతో వేగంగా వచ్చి అతడ్ని ఢీకొచ్చాడు. దీంతో శివప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి కూడా కిందపడ్డాడు. లేచి మళ్లీ బైక్ పై వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

నిశ్శబ్దం క‌ధ అనుష్క కోసం రాసింది కాదు

చిరంజీవి ఎప్పుడూ లేనంతగా ఏడ్చారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?