cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

2 లక్షల 50వేలకు చేరువగా కరోనా కేసులు

2 లక్షల 50వేలకు చేరువగా కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 50వేలకు చేరువైంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9971 (ఒక రోజులో అత్యథికం) కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 246,628కు చేరుకుంది. మరోవైపు నిన్న ఒక్క రోజే 287 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 6929కు చేరుకుంది.

నిన్న దేశవ్యాప్తంగా 5220 మంది కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లారు. దీంతో డిశ్చార్జీల సంఖ్య 119,293కు చేరుకుంది. ప్రస్తుతం 120,406 మందికి చికిత్స కొనసాగుతోంది.

అటు మహారాష్ట్రలో కరోనా విజృంభన కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే ఆ రాష్ట్రంలో 2739 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82,968కు చేరుకుంది. తాజా సంఖ్యతో మహారాష్ట్ర, చైనాకు దగ్గరైంది. ప్రస్తుతం చైనాలో 83,036 కేసులున్నాయి.

నిన్న తమిళనాడులో కొత్తగా 1458 కేసులు, ఢిల్లీలో 1320 కేసులు, గుజరాత్ లో 498 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో తెలంగాణ 13వ స్థానంలో ఉన్నాయి.

టాప్-5 కరోనా రాష్ట్రాలు
మహారాష్ట్ర - మొత్తం కేసులు 82,968 - మృతులు 2969
తమిళనాడు - మొత్తం కేసులు 30,152 - మృతులు 251
ఢిల్లీ - మొత్తం కేసులు 27,654 - మృతులు 761
గుజరాత్ - మొత్తం కేసులు 19,592 - మృతులు 1219
రాజస్థాన్ - మొత్తం కేసులు 10,331 - మృతులు 231 

చెప్పినదానికన్నా ఎక్కువ చెయ్యడం మా బలహీనత

 


×