Advertisement

Advertisement


Home > Politics - Political News

జగన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి

జగన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి

మీకు నచ్చకపోవచ్చు కానీ ఇది నిజం. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ చాలా ప్రమాదకరం - వ్యాప్తిలో, ప్రాణాపాయంలో. కేసులు కోకొల్లలు, మన హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోవడం లేదు. నిమ్మగడ్డ, చంద్రబాబు, కోర్టుల నిర్వాకంతో వాక్సిన్ విషయంలో కూడా రాష్ట్రం తన లక్ష్యాలను చేరుకోలేదు.

నాతో మాట్లాడిన అందరూ చెప్పేది టెన్త్ ఇంటర్ పరీక్షలు పెట్టడం వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, మీకూ వ్యక్తిగతంగా చాలా పెద్ద మచ్చ తెచ్చిపెడుతుందని. ఏదో మిలిటరీ ఉద్యోగాల కోసమని మీ వాదన. కానీ, తల్లిదండ్రులు పిల్లలూ భయపడే స్థితిలో ఈ పరీక్షలు పెట్టడం అవసరమా అనేది ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ. 

చాలా మంది పిల్లలు గ్రామీణ ప్రాంతాల నుండి దగ్గరున్న పట్టణాలకు వెళ్లి పరీక్షలు రాయాలి, తీసికెళ్ళి రాయించాల్సినది తల్లిదండ్రులు. వీళ్లలో కొంతమందికైనా కరోనా సోకి వాళ్ళ ఇళ్ళల్లో, ఊరిలో కరోనా వ్యాప్తి చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మగడ్డ చంద్రబాబు కోర్టులు చేసిన నిర్వాకమే ప్రభుత్వం కూడా చెయ్యడమేనని అనిపిస్తున్నది.

దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి గుంట నక్కలు రెడీగా ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షలను రద్దుచేసినప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎందుకు తలపైన వేసుకుని ఏదన్నా జరగరానిది జరిగితే అభాసు పాలవ్వడం అనేది అందరికీ అర్ధం కానిది. 

కందకు లేని దురద కత్తికి ఎందుకు? ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేస్తున్నారు. అవన్నీ ఒక ఎత్తు ఈ పరీక్షల విషయంలో నిజంగా తప్పు జరిగితే అదో ఎత్తు. నాకు తెలిసి ప్రజలకు అన్యాయం జరిగితే మీ మనసు క్షోభిస్తుంది, రాజకీయంగా కూడా పెద్ద దెబ్బవుతుంది.

లోకేశం అన్నాడనో లేక ఇంకెవడో ఏదో అన్నాడనో ఈగో ప్రాబ్లమ్స్ పెట్టుకోకుండా దయచేసి కొంచెం ఆలోచన చేసి ఈ పరీక్షలను ముందు వాయిదా వేసి ఆ తర్వాత కరోనా పరిస్థితులను బట్టి రద్దు చేయాలని నా మనవి. ఒకవేళ కరోనా తీవ్రత తగ్గితే అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్వహించండి, పిల్లల భవిష్యత్తును బాగుచేయండి.

గురవా రెడ్డి, అట్లాంటా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?