cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

అలా కళాకు ఎలివేషన్...?

అలా కళాకు  ఎలివేషన్...?

ఉత్తరాంధ్రా జిల్లాల్లో టీడీపీకి పెద్ద నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి కళా వెంకటరావు గత కొద్ది రోజులుగా వార్తల్లో నలుగుతున్నారు. ఆయన బీజేపీలో చేరుతారు అంటూ ఈ మధ్య వచ్చిన వార్తలు టీడీపీ హై కమండ్ ని కొంత షేక్ చేశాయి.

దాని మీద ఆయన వివరణ ఇచ్చుకోవడంతో ఆ ఎపిసోడ్ అలా ఆగింది. ఇక తాజాగా కళా వెంకటరావుని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఏపీ రాజకీయాల్లో మళ్ళీ  కొంత సంచలనం రేగినట్లు అయింది

అయితే కళాను ఇలా అరెస్ట్ చేసి అలా స్టేషన్ బెయిల్ తో విడుదల చేయడంతో టీడీపీ హై కమాండ్ ఆందోళనలకు అవకాశం లేకుండా పోయింది. మరో వైపు కళాని విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు కూడా గర్జించారు.  

అయితే ఆ అవసరం లేకుండానే కళా కూల్ గానే బయటకు వచ్చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో టీడీపీకి ఏమీ పొలిటికల్ మైలేజ్ రాలేదు కానీ కళాకు మాత్రం బాగానే ఎలివేషన్ వచ్చిందని అంటున్నారు. 

ఇప్పటికే టీడీపీలో అధినాయకత్వం  తీరు మీద గుస్సా మీదున్న కళా తాజా అరెస్ట్ తో హై కమాండ్ ఆయన వైపు చూడాల్సిన సీన్ క్రియేట్ అయింది. మొత్తానికి కళాకు మేలు చేసేలాగా ఈ అరెస్ట్ పర్వం ఉంటే టీడీపీలో కళా హవా పెరుగుతుందా అన్నదే చూడాలి.

ఆ ముగ్గురూ ముగ్గురే

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

 


×