Advertisement

Advertisement


Home > Politics - Political News

మళ్లీ తెరపైకి పవన్ కల్యాణ్ బ్యానర్

మళ్లీ తెరపైకి పవన్ కల్యాణ్ బ్యానర్

పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు వస్తుంటాయి. అయితే ఈసారి వరుసపెట్టి ఈ బ్యానర్ పై సినిమాలు రాబోతున్నాయి. ఈ మేరకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కల్యాణ్ మధ్య భారీ ఒప్పందం కుదిరింది.

ఒప్పందం ప్రకారం.. ఈ రెండు బ్యానర్లు కలిసి 6 చిన్న సినిమాలు, మరో 6 మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు, ఇంకో 3 భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తాయి. ఈ 15 సినిమాల్లో దాదాపు 10 సినిమాలతో కొత్త టాలెంట్ ను పరిచయం చేయాలని ప్రాధమికంగా నిర్ణయించారు.

పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా ప్రపోజల్ చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉంది. ఇప్పుడు పీపుల్ మీడియా బ్యానర్ భాగస్వామిగా మారడంతో.. పవన్ బ్యానర్ పై చరణ్ సినిమా కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.

ఈ రెండు నిర్మాణ సంస్థల భాగస్వామ్యంలో రాబోయే 3 భారీ బడ్జెట్ సినిమాల్లో కనీసం ఒక దాంట్లోనైనా పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తారా లేదా అనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?