Advertisement

Advertisement


Home > Politics - Political News

అందుబాటులోకి మరో కరోనా టీకా.. వచ్చే వారం నుంచి

అందుబాటులోకి మరో కరోనా టీకా.. వచ్చే వారం నుంచి

అయితే కొవాక్సిన్, లేకపోతే కొవిషీల్డ్. ఇప్పటి వరకూ భారతీయులకు ఈ రెండు టీకాలు తప్ప వేరే ఆప్షన్ లేదు. దేశ అవసరాల మేరకు టీకాను ఉత్పత్తి చేయడంలో ఈ రెండు టీకాల తయారీ సంస్థలు చేతులెత్తేశాయి. 

భారత్ బయోటెక్, సీరమ్ సంస్థలు డిమాండ్ కి తగ్గట్టు సరఫరా చేయలేకపోతున్నాయి. దీంతో విదేశీ టీకాల పంపిణీ కోసం రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. రష్యా నుంచి దిగుమతి అయిన స్పుత్నిక్-వి టీకా వచ్చే వారం నుంచి మార్కెట్ లో అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.

రష్యా తయారీ స్పుత్నిక్-వి టీకాను భారత్ లో పంపిణీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న డాక్టర్ రెడ్డీస్ సంస్థకు ఇటీవల డీసీజీఐ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నేరుగా రష్యా నుంచి 1.5 లక్షల వయెల్స్ హైదరాబాద్ కు చేరుకున్నాయి. 

వ్యాక్సిన్ ని మార్కెట్ లోకి తెచ్చేందుకు తుది అనుమతి కోసం వేచి చూస్తున్న డాక్టర్ రెడ్డీస్ సంస్థకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే వారం నుంచి స్పుత్నిక్ టీకా మార్కెట్లోకి తీసుకు రావచ్చని తెలిపింది. ఈ మేరకు నీతి ఆయోగ్ (ఆరోగ్య విభాగం) సభ్యుడు డాక్టర్ వీకేపాల్ ప్రకటన చేశారు.

స్పుత్నిక్ తో పాటు మరిన్ని టీకాలు..

స్పుత్నిక్ మాత్రమే కాదు.. అమెరికా ఎఫ్.డి.ఎ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదించిన ఏ టీకానైనా దిగుమతి చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. దరఖాస్తు చేసుకున్న ఒకటి రెండు రోజుల్లోనే వీటికి అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ ల దిగుమతి కోసం తమ వద్ద ఇప్పటి వరకు ఎలాంటి దరఖాస్తులు పెండింగ్ లో లేవని చెప్పింది. 

భారత్ లో టీకా పంపిణీ కోసం ఇప్పటికే ఫైజర్, మోడర్నా సంస్థలు సంప్రదించాయని కేంద్రం తెలిపింది. అటు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ భారత్ లో టీకా ఉత్పత్తికి రెడీగా ఉందని కేంద్రం చెబుతోంది. కొవాక్సిన్ తయారీని ఇతర సంస్థలకు అప్పగించే ప్రతిపాదన కూడా ఉన్నట్టు కేంద్రం తెలిపింది. ఇతర సంస్థల్లో కొవాక్సిన్ ఉత్పత్తిపై భారత్ బయోటెక్ తో చర్చలు జరుపుతున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.

మొత్తమ్మీద.. ఇప్పటి వరకూ కొవాక్సిన్, కొవిషీల్డ్ పై మాత్రమే ఆధారపడి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆలస్యం చేసిన కేంద్రం ఎట్టకేలకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. విదేశీ టీకాలకు వెంటవెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తామంటోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?