Advertisement

Advertisement


Home > Politics - Political News

'తానా' ఎన్నికలలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా 'శ్రీనివాస గోగినేని' మళ్ళీ పోటీ

'తానా' ఎన్నికలలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా 'శ్రీనివాస గోగినేని' మళ్ళీ పోటీ

'తానా ఎన్నికలలో ప్రెసిడెంట్ ఎలెక్ట్  పదవి కై 'శ్రీనివాస గోగినేని' పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు  గత 20 సంవత్సరాలుగా 'తానా' అనుబంధం ఉందని , అందులో 10 సంవత్సరాలపైగా  అనేక కీలక పదవులు విజయవంతంగాను నిస్వార్దంగాను  నిర్వహించి 'తానా' నాయకునిగా అమెరికా వ్యాప్తంగా గుర్తింపు కలిగి ఉండడం మూలంగా గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయంటున్నారు. 

ముఖ్యంగా 2015-17 'తానా' ఫౌండేషన్ చైర్మన్గా అయన చేసిన సేవలను  గూర్చి అమెరికా లోనే కాక  రెండు తెలుగురాష్ట్రాల్లోనూ అనేకమంది ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారని, అమెరికా లోని సుమారు 20 ప్రముఖ నగరాల్లో  "మన ఊరికోసం" నినాదంతో మొదలుపెట్టి చేసిన 5కే రన్స్ కార్యక్రమాల మూలంగా 'తానా' సంస్థ సేవలపై ప్రత్యేక అవగాహనా కల్పిస్తూ సమీకరించిన కోట్లాది రూపాయలను తెలుగు రాష్ట్రాల్లో "చైతన్య స్రవంతి" కార్యక్రమం ద్వారా కంటి చూపు క్యాంపులు, కాన్సర్  నివారణ క్యాంపులు, గ్రహణం మొర్రి సర్జరీస్, డిజిటల్ మరియు పుస్తక లైబ్రరీస్, రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు, విద్యార్థి స్కాలర్షిప్ లు, వారధి ద్వారా అనేకమంది పిల్లలకు చదువులు మొదలైన కార్యక్రమాలకు ఖర్చు చేసి వేలాది మందికి లబ్ది కలిగించామన్నారు. అంతేగాక 2015 'తానా' కాన్ఫరెన్స్ సెక్రటరీ గాను, 'తానా'  బోర్డు లోను , బైలాస్ కమిటీ మొదలు అనేక పదవుల్లో విశిష్ట సేవలందించామన్నారు.

'తానా' లో సంస్థాగతంగా నెలకొన్నపెత్తందారీ వ్యవస్థను, ధన ప్రాబల్యంతోను, బలవంతపు బాలట్ కలెక్షన్ తోనూ నిర్వహించే ఎన్నికల తంతును బహిరంగంగా వ్యతిరేకిస్తానని, 'తానా మనందరిదీ' అంటూ పోటీ చేస్తూ పెత్తందారీ వ్యవస్థను, ధన ప్రాబల్యంను, బలవంతపు బాలట్ కలెక్షన్ ను ఖండించాలని కొత్త సంస్కరణలు, విలువల పరిరక్షణతో 'తానా' ను తిరిగి గర్వపడేలా చేయడంలో తనతో పాటు కల్సి రావాలని కోరుతూ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభకాకాంక్షలు తెలియజెసారు.

నిస్వార్ధంగా, నిబద్దతతో పనిచేస్తున్న తనను గెలిపిస్తే 'తానా'ను అన్నివర్గాలకు చేరువ చేస్తానని, ముఖ్యంగా మహిళలు, యువత కూడా పాల్గొనేలాగా కార్యక్రమాలు రూపొందిస్తానని, సంస్థను రాజకీయ పార్టీ కార్యక్రమాలనుంచి దూరం పాటిస్తూ, అన్ని ఇతర సంస్థలతో కూడా తెలుగు ప్రజల సంక్షేమం కోసం కలసి పనిచేస్తానని తెలియజెస్తున్నారు.

సక్సెస్ మీట్ లో కలుద్దాం

నీకు ఉన్నదల్లా కుల పిచ్చే !!! 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?