Advertisement

Advertisement


Home > Politics - Political News

నమ్మకం అంటే జగనే!

నమ్మకం అంటే జగనే!

రాజకీయాల్లో విశ్వసనీయత. విలువలు గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంటే అంత మంచిది. ఇది అందరికీ తెలిసిందే. కానీ పార్టీ పెడుతూనే ఇలాంటి నీచ రాజకీయాలకు  స్వస్తివాచకం పలుకుతాను అని జగన్ నాడే  తెగేసి చెప్పారు.

తాను ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా న్యాయం చేయాలనుకున్న వారికి ఆయన కచ్చితంగా చేస్తున్నారు. ఈ విషయంలో అచ్చమైన అభిమానమే జగన్ కొలమానం. నేనున్నాను అని జనాలకు భరోసా ఇచ్చిన జగన్ తనను నమ్ముకుని పార్టీ జెండా ఎత్తిన కార్యకర్తలకు కూడా ఇంతకు ఇంతా బాధ్యతగా అండదండలు అందిస్తారని ఇప్పటికే రుజువు అయింది.

ఇపుడు మరో మారు అదే జరుగుతోంది. ఉత్తరాంధ్రా రాజకీయ కురువ్రుధ్ధుడు మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు తాజాగా దివంగతులయ్యారు. ఆయన రాజకీయ వారసుడు, కుమారుడైన  డాక్టర్ సూర్యనారాయణరాజుకు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు జగన్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.

ఇది నిజంగా ఆనందించే వార్తే.  2014 ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి వైసీపీ తరఫున  సూర్యనారాయణరాజు పోటీ చేసి ఓటమిపాలు అయ్యారు. 2019 నాటికి సామాజికసమీకరణల్లో భాగంగా  టికెట్ ఇవ్వలేకపోయారు.  పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం ద్వారా ఆ కుటుంబానికి రాజకీయ న్యాయం చేయడానికి వైసీపీ హైకమాండ్ సిధ్ధంగా ఉందని అంటున్నారు.  మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ  సీటుని రాజుకు ఇస్తున్నారని భోగట్టా. మొత్తానికి పెద్దాయన సాంబశివరాజుకు ఈ వార్త  ఆత్మ శాంతి కలిగించేదే. 

ఈ గడ్డంతో నిద్ర పట్టట్లేదు

మెగాస్టార్ గురించి మీకు తెలీదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?