Advertisement

Advertisement


Home > Politics - Political News

సామాన్యుడికి అధికారం ఇచ్చిన జగన్

సామాన్యుడికి అధికారం ఇచ్చిన జగన్

జగన్ నిర్ణయాలు ఎపుడూ వినూత్నంగా విలక్షణంగా ఉంటాయి. విశాఖ వంటి మెగా సిటీలో కార్పోరేటర్ పదవి అంటే ఆషామాషీ కాదు. దానికి వైసీపీ ఒక సాధారణ వ్యక్తికి ఇచ్చి దగ్గరుండి గెలిపించుకుంది. 

విశాఖలోని 31వ వార్డు అంటే టీడీపీకి ఒక విధంగా కంచుకోట. అక్కడ రెండు సార్లు వరసబెట్టి గెలిచిన టీడీపీ నేత వానపల్లి రవికుమార్ ఆ మధ్యన కరోనా కారణంగా మరణించారు.

దాంతో వచ్చిన ఉప ఎన్నికల్లో జె బిపిన్ కుమార్ జై కి వైసీపీ అనూహ్యంగా టికెట్ ఇచ్చింది. ఆయన జైన్ మతానికి చెందిన వారు. ఆ మతస్తులు విశాఖలో ఎక్కువగానే ఉన్నా వారికి ఎపుడూ అధికార పదవి దక్కలేదు. ఇక బిపిన్ కుమార్ అయితే ప్రతీ సారీ స్తానిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోవడం అలవాటు.

ఈసారి ఆయనకు లక్ వైసీపీ రూపంలో తగిలింది. అంతే ఆయన ఒక్కసారిగా కార్పోరేటర్ అయిపోయారు. అది కూడా టీడీపీ కంచు కోటలో పాగా వేశారు. బిపిన్ కుమార్ కి టికెట్ ఇచ్చి గెలిపించినందుకు విశాఖలోని జైన్ మతస్థులు అంతా వైసీపీకి ధన్యవాదాలు తెలియచేస్తున్నారు. ఇక ఫస్ట్ టైమ్ ఈ మతానికి రాజకీయ ప్రాధ్యాన్యత ఇచ్చిన పార్టీగా వైసీపీ రికార్డు క్రియేట్ చేసింది. 

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా