యోధా లైఫ్ లైన్ డయగ్నొస్టిక్స్ సెంటర్ ను ప్రారంభించిన వెంకయ్యనాయుడు

హైదరాబాద్ లో యోధా లైఫ్ లైన్. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పిన డయగ్నొస్టిక్స్ కేంద్రాన్ని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం ప్రారంభించారు. మెటబోలమిక్స్, ప్రోటియోమిక్స్, మాలిక్యులర్ డయగ్నొస్టిక్ తో పాటు రేడియాలజీ సేవలు కూడా…

హైదరాబాద్ లో యోధా లైఫ్ లైన్. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పిన డయగ్నొస్టిక్స్ కేంద్రాన్ని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం ప్రారంభించారు. మెటబోలమిక్స్, ప్రోటియోమిక్స్, మాలిక్యులర్ డయగ్నొస్టిక్ తో పాటు రేడియాలజీ సేవలు కూడా ఒకే చోట అందుబాటులో ఉండే కేంద్రమిది. శరీరానికి వచ్చే అన్ని రకాల ఇబ్బందులను ముందే పసిగట్టే పరికరాలు, ప్రసవ సమయంలో తల్లీ బిడ్డ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలను తెలియజేసే సౌలభ్యం ఉండడం ఈ డయగ్నొస్టిక్స్ సెంటర్ ప్రత్యేకత.

సుధాకర్ కంచర్ల సారధ్యంలో సేవలు అందించే ఈ కేంద్రాన్ని ఉప రాష్ట్రపతి ప్రారంభించారు. సుధాకర్ కంచర్ల ఇదే రంగంలో ఉన్నారు. అమెరికాలో వర్జీనియ, అలబామా, టెక్సాస్ లో ఆయన డయగ్నొస్టిక్స్ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ సేవలను అందిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని రకాల సర్వీసులను ఒకే దగ్గర అందించాలన్న సంకల్పంతో హైదరాబాద్ లో ప్రారంభించినట్లు సుధాకర్ కంచర్ల ఈ సందర్భంగా చెప్పారు. డయగ్నొస్టిక్స్ అవసరాల కోసం విదేశాల వైపు చూడాల్సిన అవసరం ఉండదని, యోధా  ఆ సేవలను అందిస్తుందని తెలిపారు.

రాష్ట్రపతి గా వెంకయ్యనాయుడు ను చూడాలి: చిరంజీవి

భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ను భారత రాష్ట్రపతి గా చూడాలని మెగాస్టార్ చిరంజీవి అభిలషించారు. అది తెలుగు వారికి దక్కే అత్యున్నత గౌరవం అవుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఉప రాష్ట్రపతితో కలిసి యోధా లైఫ్ లైన్ డయగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ…తెలుగు జాతి ఖ్యాతిని ఎన్ టీ ఆర్ దిగంతాలకు చాటారన్నారు. వెంకయ్యనాయుడు తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ఆయన్ను రాష్ట్రపతి గా చూడాలని కోరుకుంటున్నాను. అలాంటి అవకాశం వస్తే స్వీకరించాలని కోరుకుంటున్నా. తెలుగువారు అత్యున్నత స్థానంలో చూడాలన్నది తన ఆకాంక్ష అని చిరంజీవి వ్యాఖ్యానించారు. అయితే ప్రజలతో మమేకం కావడమే తనకు ఇష్టమని వెంకయ్యనాయుడు అన్నారు. ఉప రాష్ట్రపతి గా ఈ అవకాశం కలుగుతోందని అన్నారు.

సినీ కళాకారులకు రాయితీ పైన యోధాలో డయాగ్నొస్టిక్ సేవలు!

చిరంజీవి యోధా లైఫ్ లైన్ సారధి సుధాకర్ కంచర్ల కు ఒక సూచన చేశారు. సినీ కళాకారుల్లో పేద వారున్నారు. అలాంటి వారు కూడా డయాగ్నొస్టిక్ సేవలు ఈ కేంద్రంలో పొదడానికి వీలుగా రాయుతీ కల్పించే విషయం ఆలోచించాలని అన్నారు. దీనికి సుధాకర్ కంచర్ల వెంటనే స్పందించారు. సినీ పరిశ్రమ తో ముదిపడిన వారికి తమ యోధా లైఫ్ లైన్ లో 50 శాతం రాయితీతో సేవలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కు ఆయన 25 లక్షల రూపాయల చెక్ ను ఉప రాష్ట్రపతి ద్వారా అందించారు.

భవిష్యత్ లో ఇతర మెట్రో పాలిటిన్ నగరాలకూ విస్తరిస్తామన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అజారుద్దీన్, పుల్లెల గోపీ చంద్, ద్రోణవల్లి హారిక, తదితరులు ప్రారంభ కార్యక్రమం లో పాల్గొన్నారు. సతీష్ వేమన కార్యక్రమానికి వందన సమర్పణ చేశారు.