నగరాలు ఎలా ఏర్పడతాయి. వాటి అభివ్రుధ్ధి ఎలా ఉంటుంది అన్నది ఓ అధ్యయనం. ఏ నగరమూ స్వయం నిర్మితం కాదు, అలాగే ఏ నగరమూ ఒక్క రోజులో తయారు కాదు, ఒక్క నాయకుడితే అయ్యే పనీ కాదు. నేనే నగరాలు కట్టాను అని ఎవరైనా చెబితే అది రాజకీయ మూర్ఖత్వమే అవుతుంది.
ఇక అమరావతి రాజధాని విషయానికి వస్తే అది నదీ పరివాహిక ప్రాంతంలో ఉంది కాబట్టి అభివ్రుధ్ధి చెందుతుందని పాత కధనే కొత్త భాష్యంగా కొంతమంది చెబుతున్నారు. నాగరికత అంతా నదుల పక్కనే పుట్టిదని కూడా గుర్తుకుతెస్తున్నారు.
ఇందులో నిజాలు ఉన్నా చరిత్ర అంతా ఇదే కాదు. ఇక మహానగరాలుగా ఉన్నవి అన్నీ కూడా పోర్టు సిటీలేనని కొత్త పాయింట్ ముందుకు తెస్తున్నారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. అలా పోర్టు సిటీ విశాఖ ఎందుకు రాజధాని కాకూడదూ అంటూ ఆయన బాబునే సూటిగా ప్రశ్నిస్తున్నారు.
ముంబై పోర్ట్ సిటీ కావడం వల్లనే ఇంతలా ఎదిగిందని కూడా గుర్తుచేస్తున్నారు. విశాఖ రాజధాని కాకపోతే ఉద్యమాలు మళ్ళీ పుడతాయని కూడా ఆయన అంటున్నారు. శ్రీకాకుళం నక్సల్స్ ఉద్యమం ఎలా పుట్టిందో బాబుకు తెలుసా అంటూ తమ్మినేని నిలదీస్తున్నారు.
అభివ్రుధ్ధి వికేంద్రీకరణ చేయకపోవడం వల్లనే మన కష్టాన్ని అంతా హైదరాబాద్ లో పెట్టి ఉత్త చేతులతో వెనక్కి వచ్చామని అంటున్న తమ్మినేని అమరావతి మోడల్ ఇపుడు పనికిరాదని, అన్ని ప్రాంతాలు సమగ్రాభివ్రుధ్ధి మాత్రమే అజెండా కావాలని అంటున్నారు.
విజన్ 2020 అని కలవరించిన చంద్రబాబు అదే 2020 వచ్చేసరికి మాత్రం జోలే పట్టుకుని బిక్షాటన చేసుకుంటున్నారని తమ్మినేని ఎద్దేవా చేశారు. విజన్ 2020 అంటే ఇదేనా బాబూ అంటూ సెటైర్లు వేస్తున్నారు.