చ‌మత్క‌రించ‌డంలో ప్ర‌కాశ్‌రెడ్డి పెద్ద ‘తోపు’

ప్ర‌త్య‌ర్థుల‌ను చ‌మ‌త్క‌రించ‌డంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి పెద్ద ‘తోపు’ అని నిరూపించుకుంటున్నాడు. రాజ‌థాని విష‌యంలో ఏపీలో జ‌రుగుతున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ల్లో శివాలెత్తిన‌ట్టు ప్ర‌తిరోజూ…

ప్ర‌త్య‌ర్థుల‌ను చ‌మ‌త్క‌రించ‌డంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి పెద్ద ‘తోపు’ అని నిరూపించుకుంటున్నాడు. రాజ‌థాని విష‌యంలో ఏపీలో జ‌రుగుతున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ల్లో శివాలెత్తిన‌ట్టు ప్ర‌తిరోజూ రాజ‌ధాని రైతుల ఆందోళ‌న‌ల‌పై క‌థ‌నాల‌ను వండుతున్నారు. ఈటీవీ, ఏబీఎన్ ల‌లో కూడా వాటి య‌జ‌మానులు రామోజీరావు, వేమూరి రాధాకృష్ణ‌లు శివ‌తాండ‌వ‌మాడుతున్నారు. గోరింత‌లుంటే కొండంత‌లు చేయ‌డం ఎలాగో ఎల్లో మీడియా సంస్థ‌ల‌ను చూసి నేర్చుకోవాల్సిందే.

చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంలో తానెక్క‌డ వెనుక‌ప‌డుతానో అని రాజ్యాంగ ప‌ద‌విలో ఉన్న నెల్లూరు పెద్దాయ‌న ఏపీకి వ‌చ్చారు. ఉప రాష్ట్ర‌ప‌తిగా ఉన్న తాను రాజ‌కీయ అంశాలు మాట్లాడ‌న‌ని అంటూనే , మ‌రోవైపు జ‌గ‌న్ స‌ర్కార్‌పై అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతున్నారు. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతూనే, అదే నోటితో అన్నీ అమ‌రావ‌తిలోనే ఉండాల‌ని క్లైమాక్స్‌లో వెంక‌య్య స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

ఈ నేప‌థ్యంలో వెంక‌య్య‌నాయుడి వైఖ‌రిపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  టీడీపీ కొంప కూల‌కుండా నిల‌బడ్డ మూడు స్తంభాలైన  ఈనాడు రామోజీ ,ABN రాధాకృష్ణ , వెంక‌య్య‌నాయుడుల‌పై రాప్తాడు ఎమ్మెల్యే త‌న‌దైన శైలిలో సెటైర్ వేశాడు.

కనిపించే మూడు పసుపు సింహాలు బాబు, రామోజీ, రాధాకృష్ణ అయితే, క‌నిపించ‌ని నాలుగో సింహం వెంక‌య్య‌నాయుడు అని ఆయ‌న త‌న‌దైన శైలిలో చ‌మ‌త్క‌రించాడు. అబ్బో ప్ర‌త్య‌ర్థుల‌ను చ‌మ‌త్క‌రించ‌డంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి పెద్ద ‘తోపు’ అని నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.

జగన్ గోప్ప నిర్ణయం తీసుకున్నారు    శత్రువులు ఎక్కువయ్యారు.. మీ ఆశీస్సులు కావాలి