‘అల’ పాటలు వచ్చేదిలా

అల వైకుంఠపురములో. పండగ కు వస్తున్న టాలీవుడ్ కోడి పుంజుల్లో ఒకటి. ఈ సినిమా పాటలు ఫుల్ వైరల్ అయ్యాయి. బయటకు వచ్చిన నాలుగు పాటల్లో మూడు హిట్ అంటే మాటలు కాదు. దాంతో…

అల వైకుంఠపురములో. పండగ కు వస్తున్న టాలీవుడ్ కోడి పుంజుల్లో ఒకటి. ఈ సినిమా పాటలు ఫుల్ వైరల్ అయ్యాయి. బయటకు వచ్చిన నాలుగు పాటల్లో మూడు హిట్ అంటే మాటలు కాదు. దాంతో ఫ్యాన్స్ దృష్టి ఈ పాటల మీదే వుంది. ఏ పాట సిట్యువేషన్ ఏమిటి? ఏ పాట ఎప్పుడు వస్తుంది? అన్నది డిస్కషన్ పాయింట్ గా మారింది.

అల వైకుంఠపురములో రెండు పాటలు 100 మిలియన్ హిట్ లు దాటాయి. ఈ రెండు పాటలు తొలిసగంలొ ఒకటి, మలిసగంలో ఒకటి వస్తాయి. సినిమా లో తొలుతగా వచ్చే సాంగ్, ఓ మై డాడీ అంటూ ర్యాప్ స్టయిల్ లో సాగే పాట. ఆ తరువాత వచ్చే పాట 'సామజవరగమన' సాంగ్. ఆ తరువాత 'అల వైకుంఠపురములో'. ఈ పాట ముందు గతంలో అత్తారింటికి దారేదిలో వచ్చినట్లే శాస్త్రీయ ఆలాపన కూడా వుంటుంది.

విశ్రాంతి తరువాత 'బుట్ట బొమ్మ' సాంగ్ వస్తుంది, ప్రీ క్లయిమాక్స్ లో 'రాములో..రాములా' సాంగ్ వుంటుంది. చివర్న క్లయిమాక్స్ టైమ్ లో ఇప్పటి వరకు ఇంకా విడుదల చేయని శ్రీకాకుళం జానపద స్టయిల్ లో వుంటే చిన్న బిట్ సాంగ్ వస్తుంది.

ఓ మై డాడీ, బట్ట బొమ్మ, రాములోరాముల పాటలు డ్యాన్స్ నెంబర్లుగా వుంటాయి. సామజవరగమన మాత్రం క్లాస్ టచ్ తో వుంటుంది.

DSP తో మాట్లాడి 6 నెలలు అయింది