వైఎస్ జ‌గ‌న్ లేఖ‌పై స్పందించిన ప్ర‌శాంత్ భూష‌ణ్

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ హై కోర్టు తీరుతెన్నుల‌పై, సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ తీరుపై ఫిర్యాదు చేస్తూ సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బాబ్డేకు రాసిన…

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ హై కోర్టు తీరుతెన్నుల‌పై, సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ తీరుపై ఫిర్యాదు చేస్తూ సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బాబ్డేకు రాసిన లేఖ‌పై ప్ర‌ముఖ న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్ స్పందించారు. 

ఇది వ‌ర‌కూ ఏపీ హై కోర్టు ఇచ్చిన గాగ్ ఆర్డ‌ర్స్ మీద కూడా ఈ న్యాయ‌వాది స్పందించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ హై కోర్టు ఇచ్చిన గాగ్ ఆర్డ‌ర్స్ పూర్తిగా అవుట్ ఆఫ్ ఆర్డ‌ర్ అని ఈ ప్ర‌ముఖ న్యాయ‌వాది అప్ప‌ట్లో అభిప్రాయ‌ప‌డ్డారు. అప్ప‌ట్లోనే చాలా మంది ప్ర‌ముఖులు ఆ గాగ్ ఆర్డ‌ర్స్ ను త‌ప్పు ప‌ట్టారు. అయితే ఇప్ప‌టికీ ఆ ఆర్డ‌ర్స్ అమ‌ల్లోనే ఉన్నాయి!

ఆ నేప‌థ్యంలో జ‌గ‌న్ లేఖ పెను సంచ‌ల‌నం రేపింది. దీనిపై ప్రశాంత్ భూష‌ణ్ స్పందిస్తూ.. ఈ ఆరోప‌ణ‌లు తీవ్రంగా ఉన్నాయ‌ని, క‌చ్చితంగా వాటిపై త్వ‌రితగ‌తిన విచార‌ణ అవ‌స‌రం అని ప్ర‌శాంత్ భూష‌ణ్ వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు ఈ ప‌బ్లిక్ ఇంట్ర‌స్ట్ న్యాయ‌వాది ట్వీట్ చేశారు. 

సుప్రీం కోర్టు సీజేఐకి ఏపీ ముఖ్య‌మంత్రి రాసిన లేఖ‌కు సంబంధించిన వార్త‌ను కూడా ఆయ‌న షేర్ చేశారు. 

నీ మరిది ఎలాంటోడో నీకు తెలీదా?