బడా నిర్మాత దిల్ రాజు దగ్గర ప్రస్తుతం పెద్దగా పెద్ద సినిమాలు ప్లానింగ్ లో లేవు. ఎఫ్ 3, థాంక్యూ మొదలు కావాలి. వకీల్ సాబ్ నిర్మాణంలో వుంది. ఆ తరువాత ఏంటీ? అన్నది పాయింట్.
రామ్ చరణ్ కనుక వంశీ పైడిపల్లి కథ ఓకె చేస్తే ఆ సినిమా వుంటుంది. ఇలాంటి నేపథ్యంలో దిల్ రాజు పెద్ద డైరక్టర్ల కోసం అన్వేషిస్తున్నారు. పెద్ద డైరక్టర్లు చేతిలో వుంటే పెద్ద హీరోల డేట్ లు వస్తాయి.
సుకుమార్ తో చేయాలని వుంది కానీ అది మరో రెండేళ్ల వరకు మెటీరియలైజ్ కావడం అసాధ్యం. ఇంకెవ్వరు దిల్ రాజు దగ్గరకు ఎందుకో అంతగా వెళ్లడం లేదు.
ఎఫ్ 3 తరువాత అనిల్ రావిపూడి కూడా వేరే బ్యానర్లకు వెళ్లడానికి సిద్దంగా వున్నారు. ఇలాంటి నేపథ్యంలో బోయపాటి శ్రీనివాస్ కు దిల్ రాజు అడ్వాన్స్ ఇచ్చారు అంటే ఆలోచించాల్సిన విషయమే.
ప్రస్తుతం చేస్తున్న బాలయ్య సినిమా తరువాత బోయపాటి చేయబోయేది దిల్ రాజుకే. అయితే హీరో ఎవరు అన్నది సమస్య. బోయపాటి దగ్గర మహేష్ బాబు కోసం ఓ కథ వుంది. దాన్ని తీసుకుని, మహేష్ ను ఒప్పించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కానీ మహేష్ నుంచి అంత సానుకూల స్పందన అయితే రావడం లేదు. మరే హీరో కూడా బోయపాటికి ఓకే అనేది కష్టం. చూడాలి ఏం చేస్తారో?