తెలంగాణ వదలి ఆంధ్రలో రాజకీయాలు చేస్తున్నారు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్. కానీ ఆయన వుండేది హైదరాబాద్ లో. ఇల్లు కట్టుకున్నది హైదరాబాద్ లో. ఫార్మ్ హవుస్ అక్కడే. ఆ మధ్య ఇంటికి సమీపంలోనే ఆఫీసు ఏర్పాటు చేసుకున్నారు.
లేటెస్ట్ గా మరో సంగతి వినిపిస్తోంది. సిటీలోని మాంచి ఏరియాలో 1200 గఙాల స్థలం కొన్నారన్నది. ఆ ఏరియాలో గజం రెండు లక్షలు పలుకుతోంది. అంటే 24 కోట్లు. పోనీ కాస్త తక్కువకు వచ్చిందనుకున్నా 20 కోట్ల ప్రాపర్టీ అన్నమాట.
సిటీలో ఇటీవల బాగా డెవలప్ అయిన ఏరియా ఖ్వాజాగూడా. అనేక ప్రముఖ విద్యాసంస్థలు, గేటెడ్ సముదాయాలు వున్నది అక్కడే. ఆ ప్రాంతంలోని ఓ ప్రముఖ స్కూలు ఎదురుగా,మెయిన్ రోడ్ మీద పవన్ ఈ 1200 గజాల స్థలం కొన్నట్లు తెలుస్తోంది.
పవన్ ఇప్పుడు చకచకా సినిమాలు చేస్తున్నారు. అడ్వాన్స్ లు తీసుకుంటున్నారు. అందువల్ల పెట్టుబడులు పెట్టడంలో ఆశ్చర్యం లేదు. పైగా నలుగురు పిల్లలు వున్నారు. ఆ మాత్రం ఙాగ్రత్త అవసరం కూడా.